రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్ ఎఫ్ వి) ,ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ ఎఫ్ వి-షెవ్) ను బిఎస్-6 నిబంధనలతో ఆరు నెలల వ్యవధిలో తయారు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపు..
Posted On:
27 DEC 2021 5:19PM by PIB Hyderabad
భారతదేశం పెట్రోలియం దిగుమతిని ఇంధనంగా బదులు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడానికి, దేశంలోని ఆటోమొబైల్ తయారీ దారులు ఇప్పుడు ఆరు నెలల వ్యవధిలో బిఎస్-6 నిబంధనలను పాటించే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు (ఎఫ్ ఎఫ్ వి) , ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఎఫ్ ఎఫ్ వి-షెవ్) తయారీని ప్రారంభించాలని
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పిలుపు ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఆత్మ నిర్భార్ భారత్ దార్శనికతకు, ఇథనాల్ ను రవాణా ఇంధనంగా ప్రోత్సహించాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు 100% పెట్రోల్ లేదా 100% బయో ఇథనాల్ ,వాటి మిశ్రమాలతో పాటు ఎఫ్ ఎఫ్ వి- ఎస్ హెచ్ ఈ వి ఎస్ ల విషయం లో బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ ని కూడా అమలు చేయగలవని శ్రీ గడ్కరీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
ఈ చర్య వాహనాల నుండి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను వీల్ టూ వీర్ ప్రాతిపదికన గణనీయంగా తగ్గిస్తుందని, 2030 నాటికి మొత్తం అంచనా వేసిన కర్బన ఉద్గారాలను వన్ బిలియన్ టన్నులు తగ్గించడానికి సి ఓ పి 26 లో చేసిన నిబద్ధతను పాటించడానికి భారతదేశానికి సహాయపడుతుందని శ్రీ గడ్కరీ అన్నారు.
శిలాజ ఇంధనాల నుండి మారడానికి ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ప్రవేశపెట్టడాన్ని వేగవంతం చేయడం కోసం-ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ ఐ) స్కీంలో ఆటోమొబైల్ ఆటో కాంపోనెంట్ లు ,ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ల ఆటో కాంపోనెంట్ లు చేర్చబడ్డాయి. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఇబిపి)కి బలమైన పునాదిని అంగీకరించిన తరువాత, 2020-2025 కాలానికి ఇథనాల్ బ్లెండింగ్ కోసం రోడ్ మ్యాప్ ను నీతి ఆయోగ్ రూపొందించింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చొరవ తో పూణేలో మూడు ఇ-100 ఇథనాల్ డిస్పెన్సింగ్ స్టేషన్లను ప్రారంభించడం, సంప్రదాయ ఇంధనానికి అదనంగా, అధీకృత సంస్థలు కనీసం ఒక కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాన్ని మార్కెటింగ్ చేయడానికి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించే ఎం ఓ పి ఎన్ జి (పెట్రోలియం ,సహజ వాయువు మంత్రిత్వ శాఖ) నియంత్రణకు అనుగుణంగా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్ జి), బయో ఫ్యూయల్స్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ ఎన్ జి), ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ పాయింట్లు మొదలైనవి, వివిధ చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వాహనాలను ప్రవేశపెట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాల లభ్యత అవసరమయ్యే రాబోయే ఐదేళ్లలో అధిక శాతం ఇథనాల్ గ్యాసోలిన్ లో మిళితం అవుతుందని భావిస్తున్నారు.
***
(Release ID: 1785666)
Visitor Counter : 181