మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సాధికారత సాధనం ఉండనున్న స్థానిక, మాతృ భాషల్లో ఇంజినీరింగ్ విద్య - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
27 DEC 2021 6:26PM by PIB Hyderabad
మాతృభాష, స్థానిక భాషలలో ఇంజినీరింగ్ విద్య సాధికారతకు ఒక సాధనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్ నేడు 36వ ఇండియా ఇంజినీరింగ్ కాంగ్రెస్ (ఐఇఐ)లో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
భారతదేశం శాస్త్రీయ దృక్పతం కలిగిన ప్రజలను కలిగిన దేశమని, పటిష్టమైన ఇంజినీరింగ్ సామర్ధ్యాలు, నిర్మాణ విద్య, జల నిర్వహణ, నౌకా సంబంధ నిర్మాణ విద్య వంటి ఆధారాలతో మన మన నాగరికత చరిత్ర నిండి ఉందని ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ప్రధాన్ అన్నారు. భారతీయ ఇంజినీరింగ్ సంప్రదాయాలను ముందుకు తీసుకువెడుతున్నందుకు, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఐఇఐ పాత్రను అభినందించారు.
దూరదృష్టితో కూడిన ఎన్ఇపి 2020 అమలుతో, 21వ శతాబ్దానికి మన యువతను సిద్ధం చేయడానికి తాము విద్యను బహుశాస్త్ర విద్యా విధానాన్ని అవలంబిస్తూ విద్యను నైపుణ్యాలతో ఏకీకృతం చేస్తున్నామని మంత్రి చెప్పారు. దీనితో పాటుగా నైపుణ్యాలను, శిక్షణాకాలాన్ని ప్రధాన పాఠ్యాంశాలలో భాగంగా చేస్తున్నామని ఆయన వివరించారు.నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా మాతృభాష, స్థానిక భాషలలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టడమనేది మన యువతను సాధికారం చేయడమే కాక మన ఇంజినీరింగ్ సామర్ధ్యాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
ఇంజినీరింగ్ విద్యను డిగ్రీలను ప్రదానం చేయడానికి పరిమితం చేయకూడదని శ్రీ ప్రధాన్ అభిప్రాయపడ్డారు. విద్యార్జన ప్రక్రియలో భాషాపరమైన అడ్డంకులను తొలగించి, మన ఇంజినీరింగ్ సమాజ సామర్ధ్యాల నిర్మాణానికి మనందరం కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు.
ఆవిష్కరణలు, సంస్థ సభ్యులు జ్ఞానాన్ని పంచుకోవడం, ఉపాధి, వ్యవస్థాపకతకు నూతన నమూనాలను సృష్టించడం ద్వారా భారతదేశ ఇంజినీరింగ్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఐఇఐ తప్పనిసరిగా కృషి చేయాలని ఆయన కోరారు.
***
(Release ID: 1785665)
Visitor Counter : 153