విద్యుత్తు మంత్రిత్వ శాఖ
మార్పులు చేసి అమలు జరుగుతున్న పంపిణీ రంగ పురోగతి ముందంజలో ఉన్న అస్సాం, మేఘాలయ
సరఫరా నష్ఠాల తగ్గింపు, స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరింగ్ విధానం అమలు, 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఫీడర్ స్థాయి ఇంధన లెక్కల అమలు, బిల్లింగ్ , ఇతర ఐటీ, ఓటీ వ్యవస్థల ఆధునీకరణ లక్ష్యాలుగా అమలు జరుగుతున్న సంస్కరణలు
లబ్ది పొందనున్న 55 డిస్కామ్ లలో ప్రతిపాదనలు అందించిన 39 డిస్కమ్‌లు (నోడల్ ఏజెన్సీలు, ఆర్ఇసి, పిఎఫ్ సిలు )
Posted On:
26 DEC 2021 10:47AM by PIB Hyderabad
పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు అందించి, వినియోగదారులకు నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో పనిచేస్తున్నడిస్కమ్‌లకు కేంద్ర ఇంధన శాఖ సంస్కరణల ఆధారిత మరియు ఫలితాలతో అనుసంధానించబడిన పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకాన్ని ( ఆర్ డి ఎస్ ఎస్ ) అమలు చేస్తోంది. డిస్కమ్‌ల పనితీరును మెరుగు పరచి, వాటి ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు ఈ పథకం రూపొందింది.
పథకం అమలులో మేఘాలయ, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు ముందంజలో ఉన్నాయి. పథకం కింద అమలు చేయాల్సి ఉన్న కార్యాచరణ, ఆర్థిక సంస్కరణల అమలుకు ఈ రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించాయి. రాష్ట్ర స్థాయి పంపిణీ రంగ పథకం (నోడల్ ఏజెన్సీ - ఆర్ఇసి ) ఈ ప్రణాళిక అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలు కోసం రూపొందిన కార్యాచరణ ప్రణాళిక, డీపీఆర్ లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా లభించింది.
సరఫరా నష్టాలు తగ్గించడం, ఎక్కువ శాతం వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవడం, 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ఫీడర్ స్థాయిలో 100% ఎనర్జీ అకౌంటింగ్ విధానం అమలు చేయడం , పాత/విరిగిపోయిన కండక్టర్లను మార్చడం, ఎల్ టీ ఏబీసీ కి మార్చడం, వ్యవసాయ ఫీడర్ల విభజన, బిల్లింగ్ , ఇతర ఐటీ, ఓటీ వ్యవస్థ ఆధునీకరణ వంటి అనేక సంస్కరణ చర్యలు ఉన్నాయి. . ఈ ప్రణాళికల కింద రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, ప్రభుత్వం. ప్రభుత్వ శాఖ బకాయి పడి ఉన్న సబ్సిడీ మొత్తాలు చెల్లించడం, టారిఫ్ సంస్కరణల అమలు, వినియోగదారుల సేవలు మెరుగు పరిచే చర్యలు అమలు చేయడానికి రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ ప్రతిపాదనలు ఇప్పుడు ఆమోదం కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ పరిశీలనకు పంపబడతాయి.
విధ్యుత్ రంగ ప్రక్షాళనకు అమలు జరుగుతున్న ప్రణాళిక అమలులో ఈశాన్య ప్రాంతానికి చెందిన రెండు రాష్ట్రాలు ఈ సారి ముందంజలో ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పథకం కింద లబ్ధి పొందనున్న 55 డిస్కామ్ లలో 39 డిస్కమ్‌లు (నోడల్ ఏజెన్సీలు ఆర్ఇసి, పిఎఫ్ సి లు ) ఇప్పటికే ప్రతిపాదనలు అందించాయి. వీటికి ఆమోదం పొందడానికి సంబంధిత నోడల్ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నాయి, మిగిలిన డిస్కమ్‌లు కూడా త్వరలో తమ ప్రతిపాదనలను పంపుతాయని భావిస్తున్నారు.
పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం 3,03,758 కోట్ల రూపాయల వ్యయం అంచనాలతో రూపొందింది. 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం 97,631 కోట్ల రూపాయలను బడ్జెట్ నిధులు సమకూరుస్తుంది. సంస్కరణలతో అనుసంధానించబడి ఆర్థిక మరియు కార్యాచరణ మెరుగుదలలతో ముడిపడి ఈ పథకం అమలు జరుగుతుంది. కేంద్ర సహాయం పొందేందుకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు డిస్కామ్‌ల పంపిణీ, ఆర్ధిక వ్యవస్థల పనితీరు మెరుగుపడాల్సి ఉంటుంది. అంగీకరించిన ప్రమాణాలను సాధించడంతోపాటు ప్రీ-క్వాలిఫైయింగ్ ప్రమాణాలను రాష్ట్ర డిస్కమ్ చేరుకోవలసి ఉంటుంది. అందరికీ ఒకే విధానం ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాల ఆధారంగా కార్యాచరణ కార్యక్రమం రూపొందించడం ఈ పథకం ప్రత్యేకతగా ఉంటుంది.
100% మీటరింగ్ వ్యవస్థను , ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అమలు చేయడం, ఎనర్జీ అకౌంటింగ్ మరియు నష్టాల తగ్గింపు కోసం మౌలిక సదుపాయాల పనులు అమలు చేయడం, నాణ్యతను మెరుగు పరిచే లక్ష్యంతో ఆధునికీకరణ, వ్యవస్థ ఆధునీకరణ లాంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు డిస్కమ్ లకు సహకారం అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. విశ్వసనీయ విద్యుత్ సరఫరా. కుసుమ పథకం కింద సౌర విద్యు సరఫరా చేయడానికి గుర్తించిన వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ సరఫరా కోసం మాత్రమే అంకితమైన ఫీడర్ల విభజన కు పథకం అమలులో ప్రాధాన్యత లభిస్తుంది. డిస్కమ్‌లు తమ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు కార్యాచరణ సామర్థ్యం, ఆర్థిక పరిస్థితి, విద్యుత్ నాణ్యత మరియు విద్యుత్ సరఫరా విశ్వసనీయతను మెరుగుపరచడం లక్ష్యంగా వివిధ సంస్కరణ ద్వారా అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదనలతో అందించవలసి ఉంటుంది.
దేశంలో డిస్కమ్‌ల నిర్వహణ మరియు ఆర్థిక నష్టాల ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, మహమ్మారి ప్రభావిత సంవత్సరంలో విద్యుత్ రంగానికి మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరమైన ప్రోత్సాహం అందించడానికి విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్ అధ్యక్షతన డిస్కమ్‌లతో అనేక సమావేశాలు మరియు వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయి. పథకం ప్రయోజనాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సంసిద్ధతను కూడా సమావేశాల్లో మంత్రి సమీక్షించారు.
(Release ID: 1785296)
Visitor Counter : 200