ఆయుష్
ఉత్తరప్రదేశ్ లో ఆరోగ్యసదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్న ఆయుష్ మంత్రిత్వశాఖ
నేషనల్ ఆయుష్ మిషన్ కింద 553.36 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న ఆయుష్ మంత్రిత్వశాఖ
Posted On:
24 DEC 2021 5:29PM by PIB Hyderabad
-ఉత్తరప్రదేశ్ లోని 8 నగరాలలో 50 పడకలతో కూడిన 8 ఆయుష్ సమీకృత ఆస్పత్రుల ఏర్పాటు
- 500 ఆయుష్ ఆరోగ్య, వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభం
- ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ఆయుర్వేద)ను 49.83 కోట్ల రూపాయల వ్యయంతో అయోధ్యలో ఎర్పాటు చేయనున్నారు.
-ఆరు కొత్త 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రులు ఆరు నగరాలలో ఏర్పాటు
- రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 250 నూతన ఆయుష్ ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి.
- నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్ ఎ ఎం) కింద ఉత్తరప్రదేశ్ లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం మొత్తం 553.36 కోట్లరూపాయలు విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడానికి పలు కీలక చర్యలను ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. నేషనల్ ఆయుష్ మిషన్ కింద వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మొత్తం 553.36 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రధాన ప్రకటనలను కేంద్ర ఆయుష్ ,పోర్టులు, షిప్పింగ్ , వాటర్ వేస్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రకటించారు.
సుస్థిర, సమర్ధమైన,అందుబాటు ధరలో దేశంలో ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే కృషిలో భాగంగా 50 పడకల 8 కొత్త సమీకృత ఆయుష్ ఆస్పత్రులను ప్రారంభించడం జరిగింది. వీటిని దియోరియా, కౌశాంబి, సోన్‌భద్ర, లక్నో , కాన్పూర్, సంత్ కబీర్ నగర్, కాన్పూర్ దేధమత్, లలిత్‌పూర్‌లలో ఏర్పాటు చేశారు. వీటిని 72 కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 500 కొత్త ఆయుష్ హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలు (హెచ్.డబ్ల్యు.సిలు) ఏర్పాటయ్యాయి.
ప్రజలకు బలమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయం పునాది ఏర్పరచడంతో, 49.83 కోట్ల రూపాయల పెట్టుబడితో నూతన ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఆయుర్వేద కు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ అయోధ్యలో ఏర్పాటు కానుంది. దీనికి తోడు, కొత్తగా ఆరు 50 పడకల ఆస్పత్రులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి ఉన్నావ్, షారావస్తి, హర్దోయ్, గోరఖ్‌పూర్, సంబల్, మిర్జాపూర్ లలో ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 78 కోట్ల రూపాయలు. ఉత్తరప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో 250 కొత్త ఆయుష్ ఆస్పత్రులను నిర్మించనున్నారు.
రాష్ట్రంలో బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఆయుష్ పాత్రను ప్రస్తావిస్తూ శ్రీ సోనోవాల్, 50 పడకల ఆయుష్ ఆస్పత్రులు రాష్ట్రంలో నిర్మాణం తో ప్రజలు ఆయుష్ వైద్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సేవలు పొందగలుగుతారని అన్నారు. ఆయుష్ హెల్త్, వెల్‌నెస్ సెంటర్ లను ప్రధానంగా ప్రాధమిక స్థాయిలో నిర్మించడం జరిగిందని, ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఆయుష్ సూత్రాలు, విధానాల ఆధారంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. వీటితో ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని అనుసరించడానికి వీలు కలుగుతుందని అన్నారు.
ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఆయుష్ మంత్రిత్వశాఖ తీసుకున్న చర్యలు సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన నేషనల్ ఆయుష్ మిషన్ ను ఆయుష్ మంత్రిత్వశాఖ 2014 నుంచి అమలు చేస్తున్నది. ఆయుష్ ఆస్పత్రులు, డిస్పెన్సరీల స్థాయి పెంపు ద్వారా ఆయుష్ సేవలను సార్వత్రికంగా అందుబాటులోకి తీసుకురావడం దీని ఉద్దేశం. దీనికితోడు సంస్థాగత సామర్ధ్యాన్ని రాష్ట్రస్థాయిలో బలోపేతం చేయడం, ఆయుష్ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, 20,30,50 పడకల ఆయుష్ సమీకృత ఆస్పత్రుల ఏర్పాటు ఈ మిషన్ లో ప్రధానమైనవి.
కేంద్ర కేబినెట్2023-24 వరకు జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా 12,500 ఆయుష్ ,హెల్త్ వెల్‌నెస్ సెంటర్లను అమలులోకి తెచ్చేందుకు కేంద్రకేబినెట్ ఆమొదం తెలిపింది. ఆయుష్ సూత్రాల ఆధారంగా సంపూరర్ణ ఆరోగ్య నమూనాతో కూడిన సేవలను అందించడం దీని లక్ష్యం. ఇది వ్యాధుల భారాన్ని తగ్గించి ,ప్రజల స్వీయ రక్షణకు వారికి సాధికారత కల్పిస్తుంది. ప్రస్తుతం జాతీయ ఆయుష్ మిషన్ అమలు రెండో దశలో ఉంది. ఇది 2025-26 వరకు కొనసాగుతుంది. ఇది ఆయుష్ పబ్లిక్ హెల్ద్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రతిపాదించిది. ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను భాగస్వాములను చేయడం జరిగింది.
***
(Release ID: 1785117)
Visitor Counter : 166