ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లో ఇంధన సంస్కరణల కార్యక్రమం కోసం జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూతో ఒప్పందాలు ఖరారు

Posted On: 23 DEC 2021 7:24PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం,  జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ - కేఎఫ్డబ్ల్యూ (క్రెడిటన్‌స్టాల్ట్ ఫర్ వైడెరౌఫ్‌బౌ)  మధ్యప్రదేశ్‌లో ఎనర్జీ రిఫార్మ్ ప్రోగ్రామ్ అమలు కోసం 40 మిలియన్ల యూరోల విలువైన రుణం, 2 మిలియన్ యూరోల గ్రాంట్ ఇవ్వడానికి వీలు కల్పించే ఒప్పందాలపై సంతకం చేశాయి. వీటికి అతి తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, భారత ప్రభుత్వం తరపున ఒప్పందాలపై సంతకం చేశారు.  కేఎఫ్డబ్ల్యూ తరఫున ఈ సంస్థ దక్షిణాసియా ఇంధన విభాగం అధిపతి డాక్టర్ జుర్గెన్ వెల్‌షోఫ్ సంతకం చేశారు. ఈ ప్రాజెక్టులో స్మార్ట్ మీటర్ల అమలు & అడ్వాన్స్‌డ్ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఏఎంఐ) అనే 2 భాగాలు ఉంటాయి. అంతేగాక , వ్యవసాయం & వ్యవసాయేతర ఫీడర్లను వేరు చేస్తారు. మధ్యప్రదేశ్‌ అంతటా కరెంటు పంపిణీ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడం,  బలోపేతం చేయడం ద్వారా భారతదేశంలో మరింత స్థిరమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పడటానికి,  పర్యావరణ అనుకూల ఇంధన సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. ఇది  సాంకేతికంగా,  ఆర్థికంగా సమర్థవంతమైన అలాగే సామాజికంగా,  పర్యావరణపరంగా స్థిరమైన ఇంధన సరఫరాకు దోహదం చేస్తుంది.

***


(Release ID: 1785115) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi