మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

వారణాసి, రామ్‌నగర్‌ లోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి చెందిన ప్లాంటు కోసం బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటుకు ఈరోజు శంకుస్థాపన చేసిన - ప్రధానమంత్రి

Posted On: 23 DEC 2021 5:27PM by PIB Hyderabad

నేపథ్య సమాచారం 

వారణాసి డెయిరీ ప్లాంటు లోని బయో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు సుమారు రోజుకు / 4000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల బయోగ్యాస్ ప్లాంటు లో బయోగ్యాస్‌ ను ఉత్పత్తి చేయడానికి సుమారు 100 మెట్రిక్ టన్నులు వినియోగిస్తుంది.  డైరీ ప్లాంటు విద్యుత్తు అవసరాలను తీర్చగల విద్యుత్తు మరియు ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయడానికి బయోగ్యాస్ ను ఉపయోగించడం జరుగుతుంది. 

వారణాసి డెయిరీ ప్లాంటు చుట్టుపక్కల, 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 194 గ్రామాలు ఉన్నాయి.  ఈ గ్రామాల్లో దాదాపు 68,600 పాడి పశువులు (పశుగణన ప్రకారం) ఉన్నాయి.  ఈ పశువుల నుండి (సగటున సుమారు 11 కిలోలు చొప్పున) సుమారు రోజుకు 779 టన్నుల పేడ లభిస్తుంది.  ఈ గ్రామాల్లోని 18 గ్రామాల నుంచి నమూనాలు సేకరించి 1519 మంది రైతులను సర్వే చేయడం జరిగింది.   సాధారణంగా పేడను అమ్ముకోగలిగిన రైతులకు కిలోగ్రాము కు 25 పైసల చొప్పున చెల్లిస్తున్నారు.  సర్వేలో పాల్గొన్న దాదాపు 37 శాతం మంది రైతులు పేడను సాధారణ పద్ధతి లో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.  ఈ నిష్పత్తిలో రోజుకు 300 టన్నులు చొప్పున ప్లాంటు చుట్టుపక్కల 10 కి.మీ. వ్యాసార్థంలో పేడ అందుబాటులో ఉండాలి.  వారణాసి డెయిరీలోని బయోగ్యాస్ ప్లాంటు కు రోజుకు 100 టన్నులు మాత్రమే అవసరం కాగా,  ఇది దాదాపు 2000 మంది (రోజుకు 2-3 పశువుల నుండి 25 కిలోల వరకు సరఫరా చేసే) రైతులు మరియు సమీపంలోని కొన్ని గోశాలల ద్వారా పొందే అవకాశం ఉంది. 

ఆనంద్‌ లోని, జకరియా పురా ఎరువుల ఉత్పత్తి ప్రాజెక్టులో,  పేడ విక్రయానికి రైతులకు చెల్లించే ప్రభావవంతమైన ధర కిలోకు ఒక రూపాయి 50 పైసల నుండి రెండు రూపాయల వరకు ఉంటుంది.  బయో సి.ఎన్‌.జి.  కోసం పేడ సేకరణకు బనాస్ డెయిరీ కిలోకి ఒక రూపాయి చొప్పున ధర చెల్లిస్తోంది. 

డెయిరీ ప్లాంటు కు అవసరమైన విద్యుత్తును ఆవు పేడతో ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్ట్ ఇది.  వారణాసి రైతులు పాలతో మాత్రమే కాకుండా నాణ్యత ప్రకారం పేడ విక్రయం ద్వారా కూడా ఒక్కొక్క కిలో కి రూపాయి 50 పైసల నుండి రెండు రూపాయల వరకు అదనంగా ఆదాయాన్ని సంపాదించ గలుగుతారు.   పేడ విక్రయించే సమయంలో రైతులకు కిలో ఒక్కింటికి ఒక రూపాయి చొప్పున ఇస్తారు.  ఆ తర్వాత సేంద్రీయ ఎరువులు కొనుగోలు చేసే సమయంలో వారికి సబ్సిడీగా బకాయిలు బదిలీ చేయడం జరుగుతుంది. 

దాదాపు 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే, లీటరు పాలకు సుమారు 40 పైసల మేర ఖర్చులో నికర ఆదా అవుతుంది. తద్వారా, సుమారు ఆరేళ్లలో పెట్టిన పెట్టుబడి తిరిగి పొందే అవకాశం ఉంది. 

*****



(Release ID: 1784796) Visitor Counter : 88


Read this release in: English , Urdu , Marathi , Hindi