రక్షణ మంత్రిత్వ శాఖ
దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం- నుంచి- ఉపరితల క్షిపణిని రెండవసారి విజయవంతంగా ప్రయోగించి, పరీక్షించిన డిఆర్‌డిఒ
Posted On:
23 DEC 2021 12:13PM by PIB Hyderabad
దేశీయంగా అభివృద్ధి చేసిన సంప్రదాయ ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి ప్రళయ్ రెండవ ప్రయోగాన్ని 23 డిసెంబర్ 2021న ఓడిషా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం దీవి నుంచి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ - డిఆర్‌డిఒ) విజయవంతంగా నిర్వహించింది. తొలిసారి, ఒక బాలిస్టిక్ (గతిశీల) క్షిపణని వరుసగా రెండు రోజులలో రెండుసార్లు విజయవంతంగా ప్రయోగించి పరీక్షించడం జరిగింది. మిషన్ లక్ష్యాలన్నింటినీ ఈ ప్రయోగం నెరవేర్చింది. ఈ ప్రయోగం క్షిపణిలోని రెండు కన్ఫిగరేషన్ (సమగ్రాకృతి)ని రుజువు చేస్తుంది.
నేటి ప్రయోగంలో, ఆయుధ ఖచ్చితత్వాన్ని, ఘాతుకతను నిరూపించేందుకు ప్రళయ్ క్షిపణిని అధిక భారం (పేలోడ్)తో, భిన్న పరిధిలో పరీక్షించారు. ఈ ప్రయోగాన్ని తూర్పు తీరం వెంట మోహరించిన టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టిక్ ట్రాకింగ్ వ్యవస్థ, ప్రభావం చూపే ప్రదేశం వద్ద నిలిపిన డౌన్ రేంజ్ నౌకలు సహా అన్ని రేంజ్ సెన్సార్లు, సాధనాల ద్వారా పర్యవేక్షించడం జరిగింది.
అభివృద్ధి ప్రయోగ పరీక్షలు వరుసగా జరిపినందుకు డిఆర్‌డిఒను, సంస్థ అనుబంధ బృందాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయవంతమైన ప్రయోగ పరీక్షకు కారణమైన బృందాన్ని అభినందిస్తూ, బలమైన నమూనా, , అభివృద్ది సామర్ధ్యాలు రక్షణ రంగం ఆర్&డికి ఉన్నాయని దేశం రుజువు చేసిందని రక్షణ శాఖ కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు.
***
(Release ID: 1784585)
Visitor Counter : 217