మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సైబర్ రంగంలో పిల్లల భద్రత
Posted On:
22 DEC 2021 1:35PM by PIB Hyderabad
'నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో' (ఎన్‌సీఆర్‌బీ) వద్ద వివిధ విభాగాల వారీగా నమోదైన కేసుల వివరాల ప్రకారం, 2018-2020లో పిల్లలపై సైబర్ క్రైమ్ (కమ్యూనికేషన్ పరికరాలను మీడియం/టార్గెట్‌గా చేర్చడం) నేరారోపణలు వెలుగులోకి వచ్చాయి. ఛార్జ్ షీట్ దాఖలు చేయబడిన కేసులు, దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులు వివరాలు అనుబంధం-Iలో చేర్చబడినాయి.
(i) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, 2000లోని సెక్షన్ 67బీ పిల్లల లైంగిక వేధింపులను ఆన్‌లైన్‌లో ప్రచురించడం, ప్రసారం చేయడం, వీక్షించడంపై కఠినమైన శిక్షను సిఫారసు చేస్తుంది.
(ii) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 మధ్యవర్తుల వినియోగదారులకు అధికారం కల్పిస్తుంది. వారి భద్రతకు గాను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా చేస్తుంది. నియమాల ప్రకారం మధ్యవర్తులు ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడంతో పాటు బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అందిస్తుంది. మధ్యవర్తులు తమ నిబంధనలు మరియు షరతులను తెలియజేయాలి, ఇందులో హానికరమైన, పరువు నష్టం కలిగించే, అశ్లీలమైన, మరొకరి గోప్యతకు హాని కలిగించే విధంగా, హాని కలిగించేలా ఏదైనా సమాచారాన్ని హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్‌లోడ్ చేయడం, సవరించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, నవీకరించడం లేదా భాగస్వామ్యం చేయడం వంటివి చేయకూడదు. మైనర్లకు చేటు చేసే విధంగా కమ్యూనికేషన్ ద్వారా వివిధ పనులను చేపట్టడం చట్టవిరుద్ధం.
భారతదేశంలోని ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే విధఃగా ఏదైనా సమాచారాన్ని అందిచండం, కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా తగిన ప్రభుత్వం లేదా దాని అధీకృత ఏజెన్సీ ద్వారా నోటీసు ద్వారా వారికి తెలియజేసినప్పుడు తొలగించాలని కూడా భావిస్తున్నారు.
పిల్లల లైంగిక వేధింపుల విషయాలను చురుగ్గా గుర్తించడం సాంకేతిక ఆధారిత చర్యలను అమలు చేయడం, ప్రయత్నించడానికి కూడా నియమాల ప్రకారం ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి (ఎస్ఎస్ఎంఐ) అవసరం.
(iii) ఇంటర్‌పోల్ జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన 'సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స (సీబీఐ) ద్వారా అందిన ఇంటర్‌పోల్ "చెత్త జాబితా"లోని సైట్లను ప్రభుత్వం కాలానుగుణంగా బ్లాక్ చేస్తుంది.
(iv) బ్రిటన్‌లోని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ (ఐడీఎఫ్) లేదా కెనడాలోని ప్రాజెక్ట్ అరాక్నిడ్, సీఎస్ఏఎం జాబితాలోని వెబ్‌సైట్‌లు/ వెబ్‌పేజీల నిబంధనల జాబితాను డైనమిక్ ప్రాతిపదికన అమలు చేయాలని, పిల్లల అశ్లీలతకు యాక్సెస్‌ను నిరోధించాలే తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంబంధిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్‌పీలకు) ఆర్డర్‌ను జారీ చేసింది.
(v) ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ & అవేర్‌నెస్ (ఐసియా) కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్పర్మెషన్ టెక్నాలజీ శాఖ, ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నప్పుడు డిజిటల్ భద్రత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మహిళలు మరియు పిల్లలతో సహా ఆయా వినియోగదారులకు తగు అవగాహన కల్పిస్తోంది. సమాచార భద్రత అవగాహన కోసం ఈ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను (https://www.infosecawareness.in) నిర్వహిస్తోంది. ఇందులో సంబంధిత అవగాహన విషయాలను అందిస్తుంది.
(డి): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 దేశంలో నివేదించబడిన అన్ని రకాల సైబర్ నేరాలను పరిష్కరించడానికి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.
(vi) దీనికి తోడు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోస్కో) చట్టంలోని సెక్షన్-14 ప్రకారం అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగిస్తే విధించే శిక్షలను వెల్లడిస్తుంది. సెక్షన్-14 ప్రకారం శిక్షలను విధిస్తారు.
(1) పిల్లవాడిని లేదా పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించే వ్యక్తికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడుతుంది మరియు జరిమానా కూడా విధించబడుతుంది. రెండవ లేదా తదుపరి నేరం రుజువైతే ఒక కాలానికి జైలు శిక్ష విధించబడుతుంది. ఇది ఏడేళ్ల కంటే తక్కువ ఉండదు మరియు జరిమానా కూడా విధించబడుతుంది.
(2) సబ్-సెక్షన్ (1) కింద అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను లేదా పిల్లలను ఉపయోగించుకునే ఎవరైనా, అటువంటి అశ్లీల చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా సెక్షన్ 3 లేదా సెక్షన్ 5 లేదా సెక్షన్ 7 లేదా సెక్షన్ 9లో పేర్కొన్న నేరానికి పాల్పడితే, వారికి శిక్ష విధించబడుతుంది. సబ్-సెక్షన్ (1)లో అందించిన శిక్షతో పాటు వరుసగా సెక్షన్ 4, సెక్షన్ 6, సెక్షన్ 8 మరియు సెక్షన్ 10 కింద కూడా నేరాలను పేర్కొంది."
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభకు తెలిపిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 1784459)
Visitor Counter : 160