మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాలలో బాలికల నమోదును పెంచే చర్యలు
Posted On:
22 DEC 2021 5:09PM by PIB Hyderabad
పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం (DoSEL), విద్యా మంత్రిత్వ శాఖ తో కలసి సమగ్ర శిక్షణా పథకాన్ని అమలు చేస్తోంది, విద్యాహక్కు చట్టం, 2009లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతుగా 2018-19 నుండి అమలులోకి వచ్చింది. పాఠశాల విద్య అన్ని స్థాయిలలో సమానత్వం కల్పించడం, చేరికలను నిర్ధారించడం ఈ సమగ్ర శిక్షణ ప్రధాన లక్ష్యాలలో ఒకటి.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) / UDISE+లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి బాలికల స్థూల నమోదు నిష్పత్తి (GER) అన్ని స్థాయిల విద్యలో బాలికల నమోదులో పెరుగుదలను చూపుతుంది, వివరాలు క్రింద ఉన్నవి:
సంవత్సరం
|
ప్రాధమిక విద్య
|
అప్పర్ ప్రైమరీ
|
పాఠశాల
|
ఉన్నత పాఠశాల
|
2018-19
|
101.78
|
88.54
|
76.93
|
50.84
|
2019-20
|
103.69
|
90.46
|
77.83
|
52.40
|
(మూలం: UDISE/UDISE+)
పాఠశాల విద్య అన్ని స్థాయిలలో లింగ, సామాజిక వర్గ అంతరాలను తగ్గించడం సమగ్ర శిక్షణ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంతో సహా, విద్యలో బాలికల అధిక భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి, ఎనిమిదవ తరగతి వరకూ బాలికలకు అందుబాటులో సౌలభ్యంగా ఉండేట్టు సమీప పరిసరాల్లో పాఠశాలలను తెరవడం, బాలికలకు ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు వంటి అనేక చేరికలు సమగ్ర శిక్షణ లక్ష్యంగా పెట్టుకున్నాయి., I నుండి 12వ తరగతి వరకు మారుమూల/కొండ ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులకు నివాస గృహాలు, మహిళా ఉపాధ్యాయులతో సహా అదనపు ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యెక విద్యా అవసరాలు కావాల్సిన (CWSN) బాలికలకు స్టైపెండ్, ప్రత్యేక మరుగుదొడ్లు, బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు, లింగం భేదం లేకుండా పాఠ్య పుస్తకాలు మొదలైనవాటితో సహా సునిశిత బోధన-అభ్యాస సామగ్రి ఏర్పాటు చేస్తున్నారు.
పాఠశాల విద్య అన్ని స్థాయిలలో లింగ అంతరాలను తగ్గించడానికి, సమగ్ర శిక్ష కింద కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVలు) ఏర్పాటు చేశారు. KGBVలు SC, ST, OBC,వెనుకబడిన మైనారిటీలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఆరు నుండి తొమ్మిదో తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 10.11.2021 నాటికి, 6.50 లక్షల మంది బాలికల నమోదు, దేశంలో మొత్తం 5615 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు మంజూరు చేశారు, వీటిలో జార్ఖండ్ రాష్ట్రంలో 203 మంజూరు చేయగా 70377 మంది బాలికల నమోదు అయ్యారు.
ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు
***
(Release ID: 1784455)
Visitor Counter : 138