మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పోషణ్ అభియాన్‌పై బడ్జెట్ కేటాయింపు
Posted On:
22 DEC 2021 1:33PM by PIB Hyderabad
సమీకృత, ఫలిత ఆధారిత విధానాన్ని అవలంబించడం ద్వారా నిర్ణీతకాలంలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల పోషహాకార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో 8 మార్చి 2018న పోషన్ అభియాన్‌ను ప్రారంభించారు. ఐసిటి అప్లికేషన్లు, సమ్మేళనం (కన్వర్జెన్స్), సమాజ సమీకరణ, ప్రవర్తనలో మార్పు & జన ఆందోళన్, సామర్ద్య నిర్మాణం, ప్రోత్సాహకాలు, అవార్డులు, ఆవిష్కరణల ద్వారా పోషణ్ అభియాన్ దేశవ్యాప్తంగా పౌష్ఠికాహార సమస్యలను పరిష్కరిస్తుంది.
వ్యాధి, పోషకాహార లోపాన్ని నిరోధించే రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టి పద్ధతులను అభివృద్ధి చేసే దృష్టితో ఫలితాలకై పోషక పదార్ధాలను, సరఫరా, అందుబాటును బలోపేతం చేసేందుకు అనుబంధ పోషకాహార కార్యక్రమమైన పోషణ్ అభియాన్‌ను ఉపసంహరించే సమగ్ర పోషకాహార మద్దతు పథకమైన మిషన్ పోషణ్ 2.0ను 2021-2022 బడ్జెట్‌లో ప్రకటించారు. పోషకాహార నాణ్యత, పరీక్షలను మెరుగుపరచడం, పటిష్టమైన ఐసిటి సామర్ద్యం కలిగిన ఐసిటి వేదిక అయిన పోషణ్ ట్రాకర్ ద్వారా సరఫరాను బలోపేతం చేయడమే కాక సాంకేతికతను అనుకూలంగా ఉపయోగించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటుగా అనుబంద పోషకాహారాన్ని అందించడం కోసంతక్షణ పర్యవేక్షణల, సేవల నిర్వహణ ద్వారా పాలనను మెరుగుపరచడం కోసం ఉద్దేశించినవి. అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సూపర్‌వైజర్లను సాదికారం చేసేందుకు వారికి స్మార్ట్ ఫోన్లను అభియాన్ అందిస్తోంది. నేటివరకూ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సేకరించిన స్మార్ట్ ఫోన్లు, గ్రోత్ మానిటరింగ్ పరికరాలు (ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలు- ఇందులో స్టాడియో మీటర్, ఇన్ఫాంటో మీటర్, పసిపిల్లల, తల్లి, పిల్ల/ పిల్లవాడి బరువు తూచే మిషన్లు) మొత్తం వరుసగా 11.03, 11.94 లక్షలుగా ఉన్నాయి. అనుబంధ పోషకాహార పంపిణీలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం, పోషకాహార ఫలితాలను అనుసరించడం కోసం 13.01.2021న మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు 2017-2018 నుంచి పంపిణీ చేసిన నిధుల వివరాలను రాష్ట్రాల వారీగా, సంవత్సరాల వారీగా అనెక్చర్ 1లో పొందుపరచడం జరిగింది.
ఐసిడిఎస్ ఆర్ఆర్ ఎస్ నివేదిక ప్రకారం పోషణ్ అభియాన్ కింద 30 జూన్ 2021వరకు మొత్తం 9,12,32,915మంది లబ్ధిదారులు ప్రయోజనాలను పొందుతున్నారు. వర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలను అనెక్చర్ -2లో పొందుపరిచారు.
ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ది మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు.
***
(Release ID: 1784188)
Visitor Counter : 119