నీతి ఆయోగ్
ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్ పి)తో స్టేట్ మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్.ఐ. ఒ)పై సంతకం చేసిన నీతి ఆయోగ్
చిరుధాన్యాలను ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు , అంతర్జాతీయంగా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టిపెడుతుంది.
ఈ ఎస్ ఒ ఐ నీతిఆయోగ్ , డబ్ల్యు ఎఫ్ పి లమధ్య వ్యూహాత్మక , సాంకేతిక భాగస్వామ్యంపై దృష్టిపెడుతుంది.
Posted On:
21 DEC 2021 10:39AM by PIB Hyderabad
చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన మీదట, భారత ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి, చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దీనిని చేపట్టారు. ఈ చర్యను మరింత ముందుకు తీసుకుపోయేందుకు భారత ప్రభుత్వం 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించేందుకు యుఎన్ జిఎ తీర్మానానికి భారత ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నది.
చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి పలు చర్య
లు తీసుకోవడం జరిగింది. ఇందుకోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటుచేయడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టంలో పౌష్టికాహారంతో కూడిన చిరుధాన్యాలను సమ్మిళితం చేయడం జరిగింది. అలాగే పలురాష్ట్రాలలో చిరుధాన్యాల మిషన్ ను ఏర్పాటు చేశారు. దీనితోపాటు ఉత్పత్తి, పంపిణీ, వినియోగదారులు వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధించి పలు సవాళ్లు ఉన్నాయి. ఈ పంపిణీ వ్యవస్థ కింద, మనం మన ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కాలరీల ప్రాధాన్యతనుంచి మరింత వైవిధ్యంతో కూడి ఫుడ్ బాస్కెట్ వైపుగా మరలాల్సి ఉంది. ముతక ధాన్యాలు, చిరుధాన్యాలు ప్రీ స్కూలు పిల్లల పౌష్టికాహార స్థాయిని , మహిళల పునరుత్పాదక వయసును మెరుగుపరచనున్నాయి. నీతి ఆయోగ్, డబ్ల్యుఎఫ్ పి ఒక పద్దతి ప్రకారం, సమర్ధమైన రీతిలో ఈ సమస్యలను గుర్తించి పరిష్కారం సాధించనున్నాయి.
నీతి ఆయోగ్ ఐక్యరాజ్యసమితికిచెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్ పి )తో కలిసి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనపై 2021 డిసెంబర్ 20న సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం చిరుధాన్యాలను ప్రధాన స్రవంతిలోకితేవడానికి, అంతర్జాతీయంగా ఇందుకు సంబంధించిన విజ్ఞానాన్ని పంచుకునేందుకు 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అవకాశాన్ని వినియోగించుకునేందుకు తోడ్పడుతుంది. దీనికితోడు, ఈ భాగస్వామ్యం చిన్న రైతుల జీవనోపాధికి భరోసా ఇస్తుంది. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా సామర్ధ్యాలను పెంచుకునేందుకు, ఆహార వ్యవస్థలో పరివర్తన తెచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది.
ఈ ఎస్.ఒ.ఐ ప్రధానంగా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, ఇండియాలో ఆహారం, పౌష్టికాహారభద్రతను పెంపొందించేందుకు వ్యూహాలు, సాంకేతిక కొలాబరేషన్‌పై ప్రధానంగా దృష్టిపెడుతుంది.
ఈ ప్రకటన లో భాగస్వాములైన పక్షాలు ఈ కింది కార్యకలాపాలపై కృషిచేస్తాయి.
-- ప్రాధాన్యతా రాష్ట్రాలలో చిరుధాన్యాలకు సంబంధించి అనుసరిస్తున్న మెరుగైన విధానాలకు సంబంధించి కాంపెండియంను సంయుక్తంగా రూపొందించడం, చిరుధాన్యాల ఉత్పత్తిని అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టడం.
--చిరుధాన్యాల ప్రాధాన్యతను పెంచేందుకు ఎంపిక చేసిన రాష్ట్రాలలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు, ఐఐఎంఆర్, ఇతర అసొసియేటెడ్‌సంస్థల మద్దతుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం.
--ఉభయ పక్షాలూ చిరుధాన్యాల రంగంలో పనిచేస్తున్న భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఎంపికచేసిన అకడమిక్ సంస్థలతో సంయుక్తంగా నేషనల్ కన్సల్టేషన్‌ను ఏర్పాటు చేస్తుంది.
--చిరుధాన్యాల ప్రాధాన్యతకు సంబంధించి భారతదేశ నైపుణ్యాన్ని ఇతర వర్ధమాన దేశాలకుఅందించి అవి ప్రయోజనం పొందేంలా చేసేందుకు నాలెడ్జ్ మేనేజ్ మెంట్ ప్లాట్‌ఫారంలు, పరస్పరం విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయి.
ఈ భాగస్వామ్యాన్ని కింది నాలుగు దశలలో సాధించవచ్చు.
తొలి దశ: చిరుధాన్యాలను ప్రధానస్రవంతిలోకి తెచ్చేందుకు ,దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహంపై అత్యుత్తమ విధానాల అభివృద్ది
రెండో దశ: విజ్ఞానాన్ని పంచడం ద్వారా చిరుధాన్యాలకు సంబంధించిన ప్రాధాన్యతను ముందుకు తీసుకువెళ్లేందుకు,ఎంపిక చేసిన రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించడం
మూడో దశ : చిరుధాన్యాలను ప్రధానస్రవంతిలోకి తెచ్చేందుకు ఇండియాకు గల నైపుణ్యాలను వర్ధమాన దేశాలకు అందించేందుకు చర్యలు
నాలుగో దశ : వాతావరణాన్ని తట్టుకునే, అనుకూల జీవనోపాధి పద్ధతుల కోసం సామర్థ్యాలను పెంపొందించడంపై పని చేయడం.
***
(Release ID: 1783942)
Visitor Counter : 204