నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

పున‌రుత్సాద‌క ఇంధ‌న సామ‌ర్థ్యంలో భారతదేశం ఘనత

Posted On: 21 DEC 2021 1:27PM by PIB Hyderabad

వ్యవస్థాపిత  పునరుత్పాదక శక్తి సామర్థ్యం విష‌యంలో భారతదేశం  ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద దేశంగా నిలిచింది. నవంబర్ 30, 2021 నాటికి దేశంలో మొత్తం 150.54 గిగా వాట్ల వ్య‌వ‌స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యంను (భారీ హైడ్రోతో సహా) క‌లిగి ఉంది. ఇంకా 2021-22 సంవత్సరంలో (అక్టోబర్ 2021 వరకు) వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి మొత్తం 219817. 14 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడింది. దేశంలోని చాలా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పారదర్శక బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేసిన ప్రైవేట్ రంగ డెవలపర్ల ద్వారా ఏర్పాటు చేయ‌బ‌డ్డాయి. పంపిణీ లైసెన్సీలు తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిలో.. పోటీ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చిన్న డెవలపర్‌ల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా  ఫీడ్-ఇన్ ద్వారా పోటీ బిడ్డింగ్ మార్గదర్శకాల పరిధిలోకి రాని సౌర ప్రాజెక్టులు (5 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం) మరియు పవన ప్రాజెక్టుల (25 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం) నుండి రాష్ట్రాలు/యుటీలు విద్యుత్‌ను సేకరించవచ్చును – టారిఫ్ (ఫిటీ) సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంఘం ద్వారా ఇది నిర్ణయించబడుతుంది. ఈరోజు లోక్‌సభలో కేంద్ర విద్యుత్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన వ‌న‌రుల శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్  ఒక ప్ర‌శ్న‌కు లిఖితపూర్వకంగా అందించిన ఒక‌ సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
                                                                             

***(Release ID: 1783927) Visitor Counter : 181


Read this release in: English , Urdu , Tamil , Malayalam