ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తమిళనాడులోని పట్టణ పేదలకు అందుబాటు ధరలలో ఇళ్ళను అందించడానికి భారతదేశం, ఆసియా అభివృద్ధి బ్యాంకు 150 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం

Posted On: 20 DEC 2021 4:26PM by PIB Hyderabad

7 డిసెంబర్ 2021న భారత ప్రభుత్వం ఆసియా  డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) తమిళనాడు రాష్ట్రంలోని పట్టణ పేదలకు పక్కా ఇళ్ళను ను అందించడానికి 150 మిలియన్ డాలర్ల  రుణంపై సంతకం చేశాయి.

తమిళనాడులోని పట్టణాలలోని  పేదవారికి లబ్ది చేసే విధంగా   కోసం వేటికీ తీసిపోని పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రుణ ఒప్పందం కుదిరింది.  భారత ప్రభుత్వం తరఫున  ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, ADB బ్యాంకు తరుపున  ఇండియా రెసిడెంట్ మిషన్ యొక్క కంట్రీ డైరెక్టర్ టేకో కొనిషి సంతకాలు చేశారు.

రుణ ఒప్పందంపై సంతకం తర్వాత, మిశ్రా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్  PMAY- కార్యక్రమం ద్వారా  అందరికీ ఇళ్లు (పట్టణ)  పేద పట్టణాలలో అర్హత కలిగిన కుటుంబాలకు గృహాల కొరత తీర్చడం కోసం భారత ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలు పట్టణ రంగ అభివృద్ధికి సంబంధించిన విధానాలకు అనుగుణంగా ఉంది అన్నారు.
 
"తమిళనాడు వేగవంతమైన పట్టణీకరణ. వృద్ధి మూలంగా  తక్కువ-ఆదాయ కుటుంబాలకు గృహాల కొరత ఉంది. " అని శ్రీ కొనిషి చెప్పారు. "ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో  గృహ మౌలిక సదుపాయాలతో పట్టణపేద  కుటుంబాలను ఆదుకుంటుంది,  గృహరంగంలో  ప్రైవేట్ రంగ పెట్టుబడిని ఆకర్షిస్తుంది" అని ఆయన చెప్పారు.
తమిళనాడులోని 7 కోట్ల 20 లక్షల జనాభాలో దాదాపు సగం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఇది భారతదేశంలోని అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రాలలో ఒకటి. తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ద్వారా, తొమ్మిది వేర్వేరు ప్రదేశాలలో గృహనిర్మాణాలు జరుగుతున్నాయి.. సహజ విపత్తులకు గురయ్యే దాదాపు 6,000 కుటుంబాలను సురక్షిత స్థానాలకు చేర్చడం దీని లక్ష్యం. ఇది అందుబాటులో ఇంటివసతి, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ తో పాటు  రాష్ట్ర ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథంలో తమిళనాడు  డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌కు ప్రాంతీయ ప్రణాళికలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
ADB సహాయం లో   కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ఆశ్రయ నిధిలో   ప్రైవేట్ రంగ పెట్టుబడులను  ఉత్ప్రేరక పరచడానికి ప్రధానంగా పారిశ్రామిక గృహాలు తక్కువ-ఆదాయ వర్గాల వారికి,  వలస కార్మికుల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో పెట్టుబడులకు మద్దతు లభిస్తుంది.
అదనంగా, తమిళనాడులో పకా ఇళ్ళ నిర్మాణానికి మద్దతుగా  ప్రాంతీయ ప్రణాళికలను అందించడానికి బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థల సహకారంతో  ఆసియా డవలప్ మెంట్ బ్యాంకు తన సాంకేతిక సహాయ ప్రత్యేక నిధి నుండి 1.5 మిలియన డాలర్ల సాంకేతిక సహాయ సంస్థ ద్వారా  (TA) మంజూరు చేస్తుంది. ఇతర  దేశాలలో అవలంబించే విధానాల లాగే    పునరావాసం పొందిన లబ్ధిదారుల ఇళ్ళ  పంపిణీకి విజయవంతమైన విధానాలను కార్యక్రమాలతో సహా TA డాక్యుమెంట్ చేస్తుంది.

 

***


(Release ID: 1783781)
Read this release in: English , Urdu , Hindi , Tamil