ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 DEC 2021 9:27AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 137.67 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 82,267. ఇది 572 రోజుల కనిష్ట స్థాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.24% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.39% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 8,077 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,41,87,017 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,563 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.75%) గత 77 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.60%) గత 36 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 66.51 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1783441) Visitor Counter : 126