మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ IIT ఖరగ్‌పూర్ యొక్క 67వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ, పూర్వోదయ మరియు ఆత్మనిర్భర్
భారత్‌లకు ప్రోత్సాహాన్ని అందించడానికి శక్తి ఉత్పాదనా రంగంలో సెమీకండక్టర్ చిప్ తయారీలో ఆవిష్కరణలు జరగాలని పిలుపు.
प्रविष्टि तिथि:
18 DEC 2021 6:24PM by PIB Hyderabad
మా నవతరం సంకల్పం, వాణిజ్య వ్యవస్థల చొరవ, విద్యాసంస్థల బలం ఫలితంగా 21వ శతాబ్దంలో భారతదేశం 130 కోట్లకు పైగా కోవిడ్ ఉపాధి అవకాశాలను అందించడంతోపాటు అనేక అద్భుత విజయాలు సాధించిందని కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ IIT ఖరగ్‌పూర్ 67వ స్నాతకోత్సవంలో అన్నారు.
శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, మనం అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ సందర్భంలో రాజ్‌గురు సహా మన స్వాతంత్ర్య సమరయోధులు, ఇంకా స్వాతంత్య్రం కోసం పోరాడిన అనేక మంది విద్యాలయాలకి వెళ్లడం తన అదృష్టంగా భావిస్తున్నాను. IIT ఖరగ్‌పూర్ జాతీయ ఆవశ్యకతను గుర్తించింది ప్రారంభం నుండి భారతదేశ వృద్ధికి దోహదపడింది, అన్నారాయన.
ప్రస్తుటం మనదేశంలో 3 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు 50 కోట్లకు పైగా ఉన్నారని, ఈ జనాభాను సరైన విద్య మరియు నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం అభివృద్ధి కి అపారమైన అవకాశం అని మంత్రి పేర్కొన్నారు. విమర్శనాత్మక ఆలోచన , గుణాత్మకమైన శ్రామికశక్తి 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడపడానికి భారతదేశానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న ప్రత్యామ్నాయ ఇంధన నమూనాలు, సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి సంబంధించిన ప్రత్యేక రంగాలలో ఆవిష్కరణలు ఆర్థిక సాధికారత ఉద్యోగ కల్పనలకు దారితీయడమే కాకుండా, పూర్వోదయ (తూర్పు ప్రాంత ఉన్నతికి ఉద్దేశించిన ) స్వావలంబన భారతావనికి బాటలు పరుస్తాయని శ్రీ ప్రధాన్ వ్యక్తం చేశారు. 'ఎనర్జీ, ఇంటర్నెట్' లేకుండా జీవితాన్ని ఊహించలేమని, ప్రస్తుత కాలంలో ఈ వాస్తవాన్ని మరింత నొక్కిచెప్పారని ఆయన అన్నారు. 2035 నాటికి భారతదేశం ఇంధన వినియోగదారుల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రస్తుత పాలకుల వల్ల మన దేశం అత్యంత అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధన వ్యాపార వాతావరణాన్ని కలిగి ఉందని ఆయన తెలిపారు.
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన ఆవిష్కరణల పిలుపును గుర్తు చేస్తూ పునరుద్ఘాటించిన మంత్రి, 'అట్టడుగు వర్గాలను శక్తివంతం చేయడానికి నూతన ఆవిష్కరణలు' ప్రతి రంగంలో అభివృద్ధి పురోగతిని నిర్ధారించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి ఊతమివ్వడంలో అభివృద్ధి చెందుతున్న కొత్త ప్రపంచ క్రమంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచడంలో కేంద్రంగా నిలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థుల మేధో పరాక్రమం, నైపుణ్యం వారిని నూతన ఆలోచనా నాయకత్వానికి మార్గదర్శకులుగా మారుస్తాయి. ఈ రోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు, పతకాలు, అవార్డులు పొందిన విద్యార్థులకు, పూర్వ విద్యార్థులందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1783127)
आगंतुक पटल : 157