వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సేంద్రీయ వ్యవసాయం విస్తరణ

Posted On: 17 DEC 2021 3:15PM by PIB Hyderabad

ప్రభుత్వం 2015-16 నుండి పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పికేవివై), ఈశాన్య ప్రాంతంలో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (ఎంఓవిసిడిఎన్ఈఆర్) వంటి ప్రత్యేకించిన పథకాల ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ రెండు పథకాలు సేంద్రీయ రైతులకు సేంద్రీయ ఉత్పత్తి నుండి ధృవీకరణ మరియు మార్కెటింగ్ వరకు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ వంటి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో సహా ఆద్యంతం తగు సహాయాన్ని అందిస్తుంది. 

క్లస్టర్ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో  పికేవివై అమలు చేశారు. దీనిలో రైతులకు 3 సంవత్సరాలకు హెక్టారుకు రూ. 50000/ఆర్థిక సహాయం అందిస్తారు. అందులో హెక్టారుకు మూడు సంవత్సరాలకు రూ.31,000 విత్తనాలు, బయో ఎరువులు, బయో-పెస్టిసైడ్‌లు, సేంద్రీయ ఎరువు, కంపోస్ట్/వర్మీ-కంపోస్ట్, వృక్షశాస్త్ర పదార్దాలు మొదలైన సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం  రైతులకు నేరుగా డీబీటీ ద్వారా అందిస్తారు.

ఎంఓవిసిడిఎన్ఈఆర్ ధృవీకరించిన సేంద్రీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అన్ని ఈశాన్య రాష్ట్రాలలో దీనిని అమలు చేస్తున్నారు. దీనిలో సేంద్రీయ రైతులు  ఎఫ్‌పిఓ ఏర్పాటు ద్వారా సేంద్రీయ ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ మొదలైన వాటి విలువ గొలుసును అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తారు. పథకం కింద 3 సంవత్సరాలకు హెక్టారుకు రూ.46,575 కేటాయించి  ఎఫ్‌పిఓని రూపొందిస్తారు. సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం రైతులకు మద్దతు, నాణ్యమైన విత్తనాలు/ నాటడం సామగ్రి, శిక్షణ, చేదోడుగా ఉండేందుకు ధృవీకరణ కోసం అందిస్తారు. అంతే కాకుండా ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్, కోల్డ్ చైన్ కాంపోనెంట్ మరియు స్మాల్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి పంటకోత అనంతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఎఫ్‌పిఓలు మరియు ప్రైవేట్ వ్యవస్థాపకులకు వరుసగా 75% మరియు 50% ఆర్థిక సహాయం అందిస్తారు. 

అదనంగా, సేంద్రీయ వ్యవసాయానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవివై), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడిహెచ్) మరియు నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్పిఓఎఫ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్) కింద ఆర్గానిక్ ఫార్మింగ్ పై నెట్‌వర్క్ ప్రాజెక్ట్ కింద కూడా మద్దతు ఉంది.

పికేవివై, ఎంఓవిసిడిఎన్ఈఆర్ కి గత మూడేళ్ళలో వ్యయం :

 

సంవత్సరం 

పికేవివై పథకం 

ఎంఓవిసిడిఎన్ఈఆర్ పథకం 

బడ్జెట్ అంచనాలు (బిఈ)

(రూ. కోట్లలో)

విడుదలైన నిధులు (రూ.కోట్లలో)

బడ్జెట్ అంచనాలు (బిఈ)

(రూ. కోట్లలో)

విడుదలైన నిధులు (రూ.కోట్లలో)

2018-19

360.00

329.46

160.00

174.78

2019-20

325.00

283.67

160.00

103.80

2020-21

500.00

381.05

175.00

137.17

 

పికేవివై, ఎంఓవిసిడిఎన్ఈఆర్ పథకాల కింద, రైతులకు శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక నిబంధన ఉంది.  పికేవివై  కింద ప్రతి రైతుకు మూడు సంవత్సరాల పాటు సామర్థ్యాలను పెంచడానికి రూ.7500/- ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంఓవిసిడిఎన్ఈఆర్ కింద, శిక్షణ, హ్యాండ్‌హోల్డింగ్ మరియు సర్టిఫికేషన్ కోసం ఒక్కో రైతుకు మూడేళ్లపాటు రూ. 10,000 ఆర్థిక సహాయం అందిస్తారు. రాష్ట్రాల వారీగా  పికేవివై, ఎంఓవిసిడిఎన్ఈఆర్  కింద శిక్షణ పొందిన రైతుల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. 

 

రాష్ట్రాల వారీగా 2018-19 నుండి 2020-21 వరకు పికేవివై, ఎంఓవిసిడిఎన్ఈఆర్ కింద గత 3 సంవత్సరాల్లో శిక్షణ పొందిన రైతులు 

క్రమ సంఖ్య

రాష్ట్రం 

పికేవివై పథకం 

ఎంఓవిసిడిఎన్ఈఆర్ పథకం 

మొత్తం రైతులు 

మొత్తం లబ్ధిదారులు 

మొత్తం లబ్ధిదారులు 

1

ఆంధ్రప్రదేశ్ 

200000

**

200000

2

ఛత్తీస్గఢ్ 

50000

**

50000

3

గోవా 

25000

**

25000

4

కర్ణాటక 

25000

**

25000

5

మధ్యప్రదేశ్ 

122400

**

122400

6

ఒడిశా 

36000

**

36000

7

రాజస్థాన్ 

250000

**

250000

8

తమిళ నాడు 

10000

**

10000

9

ఉత్తరప్రదేశ్ 

25000

**

25000

10

అస్సాం 

*

5000

5000

11

అరుణాచల్ ప్రదేశ్ 

*

4000

4000

12

మిజోరాం 

*

6000

6000

13

మణిపూర్ 

*

7500

7500

14

నాగాలాండ్ 

*

7343

7343

15

త్రిపుర 

*

4305

4305

16

హిమాచల్ ప్రదేశ్ 

3750

**

3750

17

ఉత్తరాఖండ్ 

195000

**

195000

18

చండీగఢ్ 

3250

**

3250

19

లక్షద్వీప్ 

6750

**

6750

 

మొత్తం 

952150

34148

986298

గమనిక: *పికేవివై పథకం ఈశాన్య రాష్ట్రాల్లో 2018-19 నుండి అమలు జరగడం లేదు 

            **  ఎంఓవిసిడిఎన్ఈఆర్ పథకం ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోనే అమలవుతోంది 

 ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 

****


(Release ID: 1783007) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Bengali , Tamil