ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై - తాజా సమాచారం
Posted On:
17 DEC 2021 2:38PM by PIB Hyderabad
ప్రభుత్వం వివిధ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తోంది, వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి:
1. గర్భనిరోధక సాధనాలు మరియు కుటుంబ నియంత్రణ సేవలను గణనీయంగా అందుబాటులోకి తీసుకు రావడం కోసం 13 రాష్ట్రాల్లో, మిషన్ పరివార్ వికాస్ (ఎం.పి.వి) పథకం అమలవుతోంది. వీటిలో, ఏడు అధిక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉన్న (ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం) రాష్ట్రాలతో పాటు, ఆరు ఈశాన్య రాష్ట్రాలైన (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం) ఉన్నాయి.
2. విస్తరించిన గర్భనిరోధక ఎంపికలు: కండోమ్‌లు, మిశ్రమ నోటి గర్భనిరోధక మాత్రలు, అత్యవసర గర్భనిరోధక మాత్రలు, గర్భాశయ గర్భనిరోధక పరికరం (ఐ.యు.సి.డి) తో సహా ప్రస్తుతం అనేక గర్భనిరోధక మార్గాలు, అవకాశాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, ఇంజెక్ట్ చేయదగిన గర్భనిరోధకం (అంతరా ప్రోగ్రామ్) మరియు సెంక్రోమన్ (ఛాయ) వంటి కొత్త గర్భనిరోధకాలను చేర్చడం ద్వారా, స్టెరిలైజేషన్ విధానం కూడా బాగా విస్తరించింది.
3. స్టెరిలైజేషన్ అంగీకరించేవారికి పరిహారం అందజేసే పథకం: ఇది లబ్ధిదారునికి వేతనాల నష్టానికి పరిహారంతో పాటు స్టెరిలైజేషన్ నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్ బృందానికి కూడా తగిన ప్రోత్సాహకాలను అందిస్తుంది.
4. ప్రసవానంతర గర్భాశయ గర్భనిరోధక పరికరం (పి.పి.ఐ.యు.సి.డి) సేవలు ప్రసవం తర్వాత అందించడం జరుగుతోంది.
5. లబ్ధిదారుల ఇంటి వద్దకే ఆశా కార్యకర్తల ద్వారా గర్భనిరోధక సాధనాలను హోమ్ డెలివరీ చేసే పథకం అమలవుతోంది.
6. కుటుంబ నియంత్రణ లాజిస్టిక్స్ నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎఫ్.పి-ఎల్.ఎం.ఐ.ఎస్) : ఆరోగ్య సౌకర్యాల అన్ని స్థాయిల్లో కుటుంబ నియంత్రణకు అవసరమైన వస్తువులు / పరికరాలను సజావుగా అంచనా వేసి, సేకరించి, పంపిణీని నిర్ధారించడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది.
కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
i. కుటుంబ నియంత్రణ గురించి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం: గర్భనిరోధక డిమాండ్ ను ఉత్పత్తి చేయడానికి సమగ్ర మీడియా ప్రచారం జరుగుతోంది.
ii. దేశంలోని అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో అవగాహన పెంపొందించడానికి, ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం, పక్షోత్సవాలు, వాసెక్టమీ పక్షం నిర్వహించడం జరుగుతోంది.
iii. ఎం.పి.వి. పథకం కింద, ఎం.పి.వి. జిల్లాల్లో అవగాహన పెంపొందించడానికి, సంచార ప్రచార వాహనాలు, ఆత్మీయ సదస్సులు, అత్తా-కోడళ్ళ సమావేశాలతో పాటు, నూతన దంపతులకు పరికరాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
గత మూడు సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా, ప్రభుత్వం చేసిన వ్యయ వివరాలను, అనుబంధం-I లో పొందుపరచడం జరిగింది.
పేర్కొన్న కాలంలో జననాల రేటు ను తగ్గించడంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పురోగతిని, అనుబంధం-II లో పొందుపరచడం జరిగింది.
గత 3 సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రకటనల కోసం ప్రభుత్వం మొత్తం 342.54 కోట్ల రూపాయలు వెచ్చించింది.
*****
(Release ID: 1782996)
Visitor Counter : 187