ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారాన్ని విస్తరించేందుకు భారత్- వియత్నాం ఒప్పందం
ఐసిటి రంగంలో రెండు దేశాల సామర్థ్య నిర్మాణం పెంపుదల లో నిమగ్నమైన ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వాలు, సంస్థల మధ్య చురుకైన సహకారం ఎం ఓ యు ఉద్దేశం
Posted On:
16 DEC 2021 7:51PM by PIB Hyderabad
వియత్నాం సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి గుయెన్ మన్ హంగ్ ఈ రోజు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖను సందర్శించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ను కలిశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి రెండు దేశాలు తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య ఐసిటి వాణిజ్యం , సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు.
PHOTO
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారంపై భారత్- వియత్నాం ఎంఒయును విస్తరించే ఒప్పందంపై ఇరువురు మంత్రులు ఈ సందర్భంగా సంతకాలు చేశారు. ఐసిటి రంగంలో రెండు దేశాల ప్రయివేట్ సంస్థలు,
ప్రభుత్వాలు, సామర్ధ్య పెంపుదల లో పాలుపంచుకునే సంస్థల మధ్య చురుకైన సహకారాన్ని పెంపొందించాలని ఈ ఎమ్ఒయు ఉద్దేశిస్తోంది.
డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారతదేశం గత 19 నెలల్లో కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని వేగవంతమైన డిజిటలైజేషన్ ప్రయత్నాలు చేసిందని మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతదేశ ఐటి సేవల రంగం, డిజిటల్ ప్రభుత్వ కార్యక్రమాలు ,వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఈ మహమ్మారి సవాళ్లను ఎదుర్కోవటానికి మాత్రమే కాకుండా ఇప్పుడు ఇతర అభివృద్ధి చెందుతున్న , తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఆదర్శంగా కూడా ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశం, వియత్నాం మధ్య చురుకైన భాగస్వామ్యం ఉన్నప్పటికీ మరింత సహకారం విస్తరణ కోసం అన్వేషించడానికి విస్తారమైన
అవకాశాలు ఉన్నట్టు ఇరువురు మంత్రులు అంగీకరించారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, డిజిటల్ వియత్నాం మార్పు కింద ఒకే విధమైన లక్ష్యాలు ఇరు దేశాల మధ్య సహకారం డిజిటల్ వాణిజ్యాన్ని మరింత పెంచ గలదని భావిస్తున్నారు.
****
(Release ID: 1782443)
Visitor Counter : 197