సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఉద‌యం స‌ఖి పోర్ట‌ల్

Posted On: 16 DEC 2021 12:43PM by PIB Hyderabad

ఎంఎస్ఎంఇ రంగంలో ప్ర‌స్తుత‌/  భావి మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల‌కు సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ అమ‌లు చేసే ఆర్థిక ప‌థ‌కాలు, విధానాలు, కార్య‌క్ర‌మాల గురించి స‌మాచారాన్ని అందించేందుకు మార్చి 2018లో ఉద‌యం స‌ఖి పోర్ట‌ల్ (http://udyamsakhi.msme.gov.in/) ను ప్రారంభించారు. మ‌హిళ‌లు త‌మ వ్యాపారాల‌ను ప్రారంభించి, నిర్మించి, వృద్ధి చేసుకునేందుకు ఈ పోర్ట‌ల్ మ‌హిళ‌ల‌కు తోడ్ప‌డుతుంది. నేటివ‌ర‌కూ ఈ పోర్ట‌ల్ ద్వారా మొత్తం 2952మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొంద‌గా, అందులో 17మంది మ‌హిళ‌లు ఒడిషాకు చెందిన వారు. 
ఉద‌యం స‌ఖి పోర్ట‌ల్‌ను అభివృద్ధి చేసేందుకు రూ. 43.52 ల‌క్ష‌ల వ్య‌యం అయింది. ఉద‌యం స‌ఖి పోర్ట‌ల్‌ను సూక్ష్మ‌,చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ (ఎంఒఎంఎస్ఎంఇ) ప‌రిధిలోని ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ డిజైన్ ఆఫ్ ఎల‌క్ట్రిక‌ల్ మెజ‌రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ (ఐడిఇఎంఐ) సంస్థ అభివృద్ధి చేసింది. 
ఉద‌యం స‌ఖి పోర్ట‌ల్‌ద్వారా ల‌బ్ధి పొందిన మ‌హిళా ల‌బ్దిదారుల డేటాను ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, న‌గ‌ర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా పోర్ట‌ల్‌లో నిర్వ‌హిస్తున్నారు. 
ఈ స‌మాచారాన్ని నేడు లోక్‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి నారాయ‌ణ్ రాణె వెల్ల‌డించారు. 

 

***
 



(Release ID: 1782432) Visitor Counter : 128