సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

బొమ్మల తయారీ యూనిట్లు

Posted On: 16 DEC 2021 12:43PM by PIB Hyderabad

దేశీయ బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. టాయ్ సెక్టార్‌తో సహా ఎంఎస్‌ఎంఈల డిజైన్ మరియు ఇన్నోవేషన్ సంబంధిత అవసరాలను తీర్చడానికి మంత్రిత్వ శాఖ తన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ల నెట్‌వర్క్ ద్వారా టూల్స్, అచ్చులు, డైస్, జిగ్‌లు, ఫిక్చర్‌లు, ప్రోటోటైప్‌లు మొదలైన వాటి రూపకల్పన మరియు అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అంతేకాకుండా ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వాటిని నిర్వహిస్తోంది. టాయ్ ఇండస్ట్రీతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి లోటును పూరించడానికి పరిశ్రమ యొక్క డిమాండ్లకు అనుగుణంగా ఔత్సాహిక మరియు ఇప్పటికే ఉన్న వ్యవస్థాపకుల కోసం వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది.

ఈ మంత్రిత్వ శాఖకు చెందిన సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల పథకం (ఎస్‌ఎఫ్‌యుఆర్‌టిఐ) కింద తాజా యంత్రాలు, డిజైన్ కేంద్రాలు, ముడి మెటీరియల్ బ్యాంక్, నైపుణ్యం అభివృద్ధి, ఎక్స్‌పోజర్ విజిట్ మొదలైనవాటితో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ల ఏర్పాటుకు సహాయం అందించబడుతుంది. మొత్తం 14 టాయ్ క్లస్టర్‌లు దేశవ్యాప్తంగా 8839 మంది కళాకారులకు లబ్ధి చేకూర్చే పథకం కింద రూ. 41.60 కోట్లకు (సుమారుగా) ఆమోదం లభించింది.

డెవలప్‌మెంట్ కమీషనర్ (హస్తకళలు) ఆఫీస్ టాయ్ క్లస్టర్‌లకు సాంకేతికత, మార్కెటింగ్, సాఫ్ట్ మరియు హార్డ్ జోక్యాలు మరియు హస్తకళా కళాకారుల స్థిరమైన అభివృద్ధికి అవసరమైన మౌలిక మద్దతును కూడా అందిస్తోంది. వీటితో పాటు ఆఫీస్ ఆఫ్ డెవలప్‌మెంట్ కమీషనర్ (హ్యాండీక్రాఫ్ట్స్) చేతితో తయారు చేసిన బొమ్మల క్లస్టర్ ఆర్టిజన్ల మొత్తం అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 13 టాయ్ క్లస్టర్‌లను గుర్తించింది. వర్చువల్ టాయ్ ఫెయిర్ కూడా 27 ఫిబ్రవరి నుండి 04 మార్చి 2021 వరకు నిర్వహించబడింది. ఈ 13 క్లస్టర్‌ల నుండి 215 మంది కళాకారులతో సహా 1074 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారు.

ఈ రోజు లోక్‌సభలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1782430) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Tamil