నౌకారవాణా మంత్రిత్వ శాఖ
2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు భారతదేశం సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడం మరియు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీ సోనోవాల్ చెప్పారు.
తదుపరి దశాబ్దంలో భారతదేశ సముద్ర రంగం యొక్క సమన్వయ మరియు వేగవంతమైన వృద్ధిని నిర్ధారించడానికి మారిటైమ్ ఇండియా విజన్ 2030
प्रविष्टि तिथि:
15 DEC 2021 2:04PM by PIB Hyderabad
2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు భారతదేశం సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడం మరియు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద సరఫరా గొలుసు మరియు లాజిస్టిక్స్ రంగాలలో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి సమర్థవంతమైన లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థ ఒక ఉత్ప్రేరకంగా భావించబడుతుంది.
ఈరోజు న్యూఢిల్లీలో దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సు - 2021లో మంత్రి ప్రసంగిస్తూ, గ్లోబల్ మారిటైమ్ సెక్టార్ లో భారతదేశాన్ని ముందంజలో ఉంచే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో భారతదేశ సముద్ర రంగం యొక్క సమన్వయ మరియు వేగవంతమైన వృద్ధిని నిర్ధారించాలానే ఉద్దేశ్యంతో, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, మారిటైమ్ ఇండియా విజన్ 2030 (ఎం.ఐ.వి-2030) పేరుతో, ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు, తెలియజేశారు. ప్రపంచ స్థాయి మెగా పోర్ట్‌లను అభివృద్ధి చేయడం, ట్రాన్స్-షిప్‌మెంట్ హబ్ లు మరియు పోర్టుల మౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి కార్యక్రమాలను ఎం.ఐ.వి-2030 గుర్తించిందని, ఆయన చెప్పారు. ఓడరేవుల మొత్తం నిర్వహణ వ్యయాలను తగ్గించడంలో, ఓడల టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గించడంలో, సామర్థ్యం మరియు నిర్గమాంశను పెంచడంలో, పెద్ద నౌకలను నిర్వహించగల సామర్థ్యాన్ని అందించడంలో మరియు దక్షిణాసియా ప్రాంతంలో భారత నౌకాశ్రయం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను అభివృద్ధి చేయడంలో, ఈ కార్యక్రమాలు సహాయపడతాయి.
ఎం.ఐ.వి-2030 ద్వారా, నౌకాశ్రయాలు, షిప్పింగ్, దేశీయ జల మార్గాల విభాగాల్లో మొత్తం 3 నుండి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆశిస్తున్నట్లు శ్రీ సోనోవాల్ తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళిక ద్వారా భారతీయ ఓడరేవులకు 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వార్షిక ఆదాయం లభిస్తుందని ఆశిస్తున్నట్లు, ఆయన చెప్పారు. దీనితో పాటు, ఇది భారతీయ సముద్ర రంగంలో అదనంగా 20 లక్షల ఉద్యోగాలను (ప్రత్యక్షంగా, పరోక్షంగా) సృష్టించగలదని భావిస్తున్నారు.
*****
(रिलीज़ आईडी: 1781977)
आगंतुक पटल : 247