మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మహిళా బాధితుల కోసం 'వన్ స్టాప్ సెంటర్' పథకం

Posted On: 15 DEC 2021 2:37PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 1 నుంచి 'వన్ స్టాప్ సెంటర్స్‌' (ఓఎస్‌సీ) పథకాన్ని అమలు చేస్తోంది. పోలీసు సౌకర్యాలు, వైద్య సహాయం, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, మానసిక మద్దతు, తాత్కాలిక ఆశ్రయం వంటి వివిధ ర‌కాలైన సేవలను ఒకే గొడుగు కింద‌కు తెచ్చి ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో హింస మరియు ఆపదలో ఉన్న మహిళలకు సమగ్ర మద్దతును సహాయాన్ని ఓఎస్‌సీలు అందిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 733 ఓఎస్‌సీ లు ఆమోదించబడ్డాయి, వాటిలో 704 ఓఎస్‌సీలు మొత్తం 35 రాష్ట్రాలు/యుటీలలో (పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మినహా) నిర్వహించబడ్డాయి, ఇవి సెప్టెంబర్, 2021 నాటికి దేశంలోని 4.50 లక్షల మంది మహిళలకు సహాయాన్ని అందించాయి. వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ కింద, 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా జిల్లా అధికారులకు నిర్భయ నిధుల‌ను నుండి అందజేస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభకు అందించిన ఒక లిఖితపూర్వక  సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1781967) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Marathi , Malayalam