మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు

Posted On: 15 DEC 2021 2:28PM by PIB Hyderabad

మరింత సమర్థంగా సేవలను అందించడానికి పోషణ్ అభియాన్ కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు అందించడం జరిగింది. ప్రభుత్వ ఈ-మార్కెట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేశారు. మొత్తం 11.03 లక్షల స్మార్ట్ ఫోన్లను ఆంధ్రప్రదేశ్ తో సహా  33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కొనుగోలు చేశాయి. 

 అంగన్‌వాడీ కార్యకర్తలు బౌతికంగా వినియోగించే  రిజిస్టర్‌లను   పోషణ్ అభియాన్ మొబైల్ అప్లికేషన్   డిజిటలైజ్ చేసి యాంత్రీకరిస్తుంది. దీనివల్ల ఏడబ్ల్యుడబ్ల్యు  ఏడబ్ల్యుహెచ్ ల సమయం ఆదా అవుతుంది. వారి పెనితీరు కూడా మెరుగుపడుతుంది.  తాజా పరిస్థితిని సమీక్షించడానికి వారికి అవకాశం కలుగుతుంది. 

ఐసీటీ అమలు, కలయిక, ప్రజల సమీకరణ, ప్రవర్తనలో మార్పు, ప్రజల సహకారంతో కార్యక్రమాలను నిర్వహించడం, సామర్ధ్య పెంపుదల, ఆవిష్కరణ, అవార్డులు ఇవ్వడం లాంటి అంశాలకు పోషణ్ అభియాన్ కింద బడ్జెట్ కేటాయింపులు  జరుగుతాయి. 2021 మార్చి 31 వ తేదీ నాటికి పోషణ్ అభియాన్ కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 5,31,279.08 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలు అనుబంధం-లో పొందుపరచడం జరిగింది. 

ఈ వివరాలను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ  ఈరోజు రాజ్యసభలో  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 

 

*****


(Release ID: 1781964) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Tamil