విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సింహాద్రిలో ఏర్పాటు కానున్న భారతదేశపు తొలి, ప్రపంచంలోనేఅతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ మైక్రో గ్రిడ్ ప్రాజెక్టులు
పెద్ద ఎత్తున హైడ్రోజన్ ఇంధన నిల్వ ప్రాజెక్టులకు ముందస్తుగా ఏర్పాటు
Posted On:
15 DEC 2021 12:28PM by PIB Hyderabad
ఎన్ టిపిసి సంస్థకు సింహాద్రి(విశాఖపట్నంసమీపంలో) స్టాండలోన్ ఫ్యూయల్‌సెల్ ఆధారిత మైక్రొ గ్రిడ్ ప్రాజెక్టు కేటాయించడం జరిగింది. ఇది భారతదేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ఇంధన నిల్వప్రాజెక్టు.
ఇది పెద్ద ఎత్తున హైడ్రోజన్ శక్తి నిల్వ ప్రాజెక్టులకు పూర్వరంగంగా ఉంటుంది. దేశంలోని వ్యూహాత్మక ప్రదేశాలలో వివిధ ఆఫ్ గ్రిడ్, బహుళ మైక్రోగ్రిడ్‌లను అధ్యయనం చేయడానికి అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
సమీపంలోని ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులనుంచి 240 కిలోవాట్లసాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రొలైజర్ ను ఇన్‌పుట్ పవర్‌గా తీసుకుని హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సూర్యోదయసమయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను అత్యంత ఒత్తిడి మధ్య నిల్వ చేసి, 50 కిలొవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ ను ఉపయోగించచుకుని విద్యుదీకరించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ స్టాండ్ అలోన్ పద్ధతిలో సాయంత్రం 5 గంటలనుంచి ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది.
ఈ ప్రత్యేక ప్రాజెక్టును అంతర్గతంగా ఎన్.టి.పి.సి రూపొందించింది. ఇది భారతదేశానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు. దీనివల్ల లద్దాక్, జమ్ము కాశ్మీర్ తదితర ప్రాంతాలను కర్బన రహితంగా తయారు చేయడానికి ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం డీజిల్ జనరేటర్లపై ఆధారపడి ఉంది. ఈ ప్రాజెక్టు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. 2070 నాటికి కర్బన సమతుల్యత ను సాధించేందుకు, లద్దాక్ ను కర్బన్ న్యూట్రల్ టెరిటరీగా ప్రకటించాలన్న ఆకాంక్షకు అనుగుణమైనది.
****
(Release ID: 1781831)
Visitor Counter : 252