ప్రధాన మంత్రి కార్యాలయం

ఎగ్రో ఎండ్ఫూడ్ ప్రాసెసింగ్ అంశం పై ఏర్పాటైన జాతీయ శిఖర సమ్మేళనం లో రైతుల ను ఉద్దేశించి డిసెంబర్16న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


ప్రాకృతికవ్యవసాయం పైన శ్రద్ధ వహించినున్న శిఖర సమ్మేళనం ఇది;  అంతేకాకుండా ప్రాకృతిక వ్యవసాయం తాలూకు ప్రయోజనాలసంబంధి సమాచారాన్ని రైతుల కు ఇది అందజేస్తుంది

రైతుల సంక్షేమం మరియు వారి ఆదాయాన్ని పెంచే దిశ లో ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా ఈ కార్యక్రమం ఉంది

Posted On: 14 DEC 2021 4:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 16 న ఉదయం 11 గంటల కు గుజరాత్ లోని ఆణంద్ లో ఎగ్రో ఎండ్ ఫూడ్ ప్రోసెసింగ్ అంశం పై జాతీయ శిఖర సమ్మేళనం ముగింపు సమావేశం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రైతుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రాకృతిక వ్యవసాయం పై ఈ శిఖర సమ్మేళనం లో శ్రద్ధ తీసుకొంటున్నారు. రైతుల కు ప్రాకృతిక వ్యవసాయం సంబంధి పద్ధతుల ను అవలంభించడం వల్ల ఒనగూడే ప్రయోజనాల ను గురించిన జరూరైన సమాచారాన్నంతటిని అందించడం జరుగుతుంది.

రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి దార్శనికత ను ప్రభుత్వం ప్రేరణ గా తీసుకొన్నది. ఫలసాయం లో వృద్ధి కి పూచీ పడటం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. దీని ద్వారా రైతు లు వారి వ్యవసాయ సంబంధి సామర్ధ్యాన్ని సాధ్యమైనంత ఎక్కువ కు పెంచుకో గలుగుతారన్న మాట. వ్యవసాయం లో పరివర్తన ను తీసుకు వచ్చేందుకు, మరి అలాగే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యల ను తీసుకోవడం మొదలుపెట్టింది. వ్యవస్థ కు స్థిరత్వాన్ని ఇచ్చేందుకు, ఖర్చుల ను తగ్గించేందుకు, బజారు ను అందుబాటు లో ఉంచేందుకు, ఇంకా రైతుల కు మెరుగైన విలువ ను ఇప్పించేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాల ను ప్రోత్సహించేందుకు, వాటికి సమర్థన ను ఇచ్చేందుకు ప్రయాసలు జరుగుతూ ఉన్నాయి.

రైతులు ఉత్పాదకాల ను కొనుగోలు చేయడం పైన ఆధారపడటాన్ని వీలైనంత గా తగ్గించేందుకు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఒక ప్రవర్ధమానమైనటువంటి సాధనం గా ఉంది. అంతేకాక, ఇది భూమి యొక్క స్వస్థత ను మెరుగు పరచే దిశ లో తోడ్పడే సాంప్రదాయక క్షేత్ర ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబన గా తీసుకొంటూ సాగు కు అయ్యే వ్యవయాన్ని తగ్గిస్తుంది. దేశవాళీ గోవులు, ఆవు పేడ, ఇంకా మూత్రం ఒక ప్రముఖ పాత్ర ను పోషిస్తాయి. వీటి నుంచి వివిధ ఉత్పాదకాల ను పొలాల లోనే తయారు చేసుకోవచ్చును. దీనికి తోడు, నేలల కు అవసరమైనటువంటి పోషకాల ను కూడా అందించేందుకు వీలు ఉంది. బయోమాస్ తో పాటు, తడిపిన గడ్డి ని మట్టి లో కలపడం గాని, లేదా నేల ను ఏడాది పొడవునా ఆకుపచ్చటి పొర తో కప్పి ఉంచడం వంటి ఇతర సాంప్రదాయక పద్ధతుల ను అవలంభించడం వల్ల నీటి అందుబాటు చాలా తక్కువ స్థాయి లో ఉన్న పరిస్థితుల లో సైతం ఈ అభ్యాసాన్ని ఆచరణ లో పెట్టిన ఒకటో సంవత్సరం నుంచే ఫలసాయం తగ్గిపోకుండా చూసుకోవచ్చును.

ఆ కోవ కు చెందిన వ్యూహాల ను గురించి నొక్కి చెప్పడానికి గాను దేశం అంతటా రైతుల కు సందేశాన్ని ఇవ్వడం కోసమని గుజరాత్ ప్రభుత్వం ప్రాకృతిక వ్యవసాయం పై శ్రద్ధ వహిస్తూ, ‘‘నేశనల్ సమిట్ ఆన్ ఎగ్రో ఎండ్ ఫూడ్ ప్రోసెసింగ్’’ ను నిర్వహిస్తున్నది. మూడు రోజుల పాటు ఏర్పాటైన ఈ శిఖర సమ్మేళనం ఈ నెల 14 వ తేదీ మొదలుకొని ఈ నెల 16 వ తేదీ వరకు జరుగుతున్నది. 5000 మంది కి పైగా రైతులు ప్రస్తుతం ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటున్నారు. దీనికి అదనం గా, ఐసిఎఆర్ కు చెందిన కేంద్రీయ సంస్థ లు, ఇంకా రాష్ట్రాల లోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఎటిఎమ్ఎ ( ఎగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ) నెట్ వర్క్ ద్వారా రైతుల ప్రత్యక్షంగా సంధానాన్ని కూడా ఏర్పరచడం జరిగింది.


 


***



(Release ID: 1781522) Visitor Counter : 205