ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కింద దేశవ్యాప్తంగా 14 కోట్లకు పైగా ఆరోగ్య ఐడీలు సృష్టించబడ్డాయి

Posted On: 14 DEC 2021 2:13PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) కింద డిసెంబర్ 3, 2021 నాటికి దేశవ్యాప్తంగా 14,15,49,620 ఆరోగ్య ఐడీలు సృష్టించబడ్డాయి.

దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన ఆన్ లైన్ ఆధారిత హెల్త్ రికార్డులను రూపొందించడంతోపాటు ఇంటర్ ఆపరేబిలిటీ సదుపాయం కలిగిన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేయడం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) లక్ష్యం. తద్వారా ప్రతిపౌరుడి ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.


ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ రూపొందించిన డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి అవాంతరాలకు ఆస్కారం లేని పద్ధతిలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది.  ఇది ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతను నిర్ధారిస్తుంది. ప్రత్యేకించి సుదూర మరియు గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా అటువంటి నిపుణుల సంరక్షణ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది  ఆరోగ్య రికార్డుల లభ్యత  అందుబాటులో ఉండడం ద్వారా పదేపదే డయాగ్నస్టిక్స్ అవసరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, ఇది ఆరోగ్య సంరక్షణ  ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.

వైద్యులు, ఆసుపత్రులు మరియు సంబంధిత వ్యక్తులు వ్యక్తిగతంగా యాక్సెస్ కోసం సమ్మతి అందించిన తర్వాత మాత్రమే వ్యక్తి యొక్క వైద్య మరియు ఇతర రికార్డులను యాక్సెస్ చేయగలరు. అంతేకాకుండా, పౌరుల సమ్మతి తర్వాత ఉద్దేశించిన వాటాదారుల మధ్య సురక్షితమైన డేటా మార్పిడిని సులభతరం చేయడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 'డిజైన్ ద్వారా గోప్యత' మరియు ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ సూత్రంపై నిర్మించబడింది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

***

 


(Release ID: 1781509) Visitor Counter : 188