ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు , గుండెపోటు నివారణకు, నియంత్రణకు జాతీయ కార్యక్రమంపై తాజా సమాచారం

Posted On: 14 DEC 2021 2:18PM by PIB Hyderabad

జాతీయ కాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు , గుండెపోటు నివారణ, నియంత్రణ ( ఎన్ పిసిడీసీ ఎస్)  కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా 2010 లో ప్రారంభమైంది.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ  తనకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి తనకు అందిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాతాలకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ కార్యక్రమం ప్రధానంగా  మౌలిక వసతులను బలోపేతం చేయటం. మానవ వనరుల అభివృద్ధి,  ఆరోగ్యాభివృద్ధి, రోగనిరోధానికి జాగ్రత్తలు, అవగాహన కల్పించటం, ముందస్తుగా వ్యాధిని గుర్తించటం, తగిన చోటుకు  చికిత్స  నిమిత్తం సిఫార్సు లాంటి అంశాలమీద దృష్టి సారిస్తుంది.

ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించే మొత్తం నిధి 2021-22 లో రూ. 56,118.07 లక్షలు.  ఎన్ పిసిడీసీ ఎస్ కింద 677 ఎన్ సి డి క్లినిక్స్, 187 జిల్లా కార్డియాక్ కేర్ సెంటర్లు. 266 జిల్లా డే  కేర్ సెంటర్లు, కమ్యూనిటీ హేలస్ సెంటర్ల దగ్గర 5392 ఎన్ సి డి క్లినిక్స్ ఏర్పాటు చేయటం ద్వారా అంటువ్యాధులు కాని వ్యాధులకు చికిత్స అందించే ఏర్పాటు చేశారు.

సాధారణంగా వచ్చే  మధుమేహం, రక్తపోటు, కాన్సర్ తదితర అంటువ్యాధేతర జబ్బుల నివారణ, నియంత్రణ, నిర్థారణ  కోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద సమగ్ర ప్రాధమిక ఆరోగ్య రక్షణ చేపడతారు. 30 ఏళ్ళు పైబడినవారికి ఈ వ్యాధులు ఉండే అవకాశాన్ని దృష్టిలోపెట్టుకొని వారికి నిర్థారణ పరీక్షలు చేస్తారు. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా హెల్త్ అండ్ వేల నెస్ కేంద్రాల్లో ఈ సేవలు తప్పనిసరి.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వేల నెస్ కేంద్రాల ద్వారా సమగ్ర ఆరోగ్య రక్షణలో భాగంగా కాన్సర్ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కమ్యూనిటీ స్థాయిలో స్థానికంగా ఈ ఏర్పాట్లు జరుగుతాయి. అదే సమయంలో వీటిమీద అవగాహన పెంచటం కోసం కార్యక్రమాలు చేపడతారు. జాతీయ కాన్సర్ అవగాహనా దినం పాటించటం, ప్రపంచ కాన్సర్ దినం పాటించటం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యాన్ని వివరించటం లాంటివి చేపడతారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ భారత్ఈ ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభ్యకు  ఈ మేరకు లిఖితపూర్వక సమాధానంగా తెలియజేశారు. 

 

****



(Release ID: 1781503) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Bengali , Tamil