పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది.
ఉడాన్ పథకం కింద అభివృద్ధి/ఉన్నతీకరణ(అప్‌గ్రేడేషన్) కోసం 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు36 హెలిప్యాడ్‌లతో సహా 154 ఆర్సీఎస్ విమానాశ్రయాలు గుర్తించబడ్డాయి.
Posted On:
13 DEC 2021 2:51PM by PIB Hyderabad
పౌర విమానయాన మౌలిక వసతుల నవీకరణ మరియు ఆధునీకరణ అనేది కొనసాగుతున్న ప్రక్రియ. భూమి లభ్యత, వాణిజ్య సాధ్యత, సామాజిక- ఆర్థిక పరిగణనలు, ట్రాఫిక్ డిమాండ్, విమానాశ్రయాల నుండి ఆపరేట్ చేయడానికి ఎయిర్‌లైన్స్ యొక్క ఇష్టాన్ని బట్టి ఎప్పటికప్పుడు సంబంధిత విమానాశ్రయ ఆపరేటర్లు దీనిని నిర్వహిస్తారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని మరియు ఇప్పటికే ఉన్న విమానాశ్రయాల విస్తరణ/ఆధునీకరణను సుమారు రూ.25వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. రాబోయే 4-5 సంవత్సరాలలో ఇందులో.. ఇప్పటికే ఉన్న టెర్మినల్స్, కొత్త టెర్మినల్స్ విస్తరణ మరియు మార్పులు, ఇప్పటికే ఉన్న రన్‌వేలు, అప్రాన్లు, ఎయిర్‌పోర్ట్ నావిగేషన్ సర్వీసెస్ కంట్రోల్ టవర్లు, టెక్నికల్ బ్లాక్‌ల విస్తరణ లేదా బలోపేతం చేయడం వంటి పనులు చేపడతారు. అంతేకాకుండా రూ.30వేల కోట్లతో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో మూడు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విమానాశ్రయాల భారీ విస్తరణక ప్రణాళికను చేపట్టారు. 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయి.
భారత ప్రభుత్వం రూపొందించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పాలసీ–2008ని.. దేశంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ విధివిధానాల ప్రకారం.. విమానాశ్రయ అభివృద్ధి సంస్థలు(ఎయిర్పోర్టు డెవలపర్లు), రాష్ట్రప్రభుత్వాలలతో సహా విమానాశ్రయాలను ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నవారు పౌర విమానయాన మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపాలి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందే ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
'సైట్-క్లియరెన్స్' స్టేజ్ మరియు 'ఇన్-ప్రిన్సిపల్' అప్రూవల్ స్టేజ్. ఈ విధానానికి అనుగుణంగా, విమానాశ్రయాల ఏర్పాటు కోసం పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఎయిర్‌పోర్ట్ డెవలపర్‌ల నుండి ప్రతిపాదనలను స్వీకరిస్తుంది. మహారాష్ట్రలోని మోపైన్ గోవా, నవీ ముంబై, షిర్డీ మరియు సింధుదుర్గ్, కర్ణాటకలోని కలబురగి, బీజాపూర్, హాసన్ మరియు షిమోగా, మధ్యప్రదేశ్‌లోని డాటియా (గ్వాలియర్) , ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ మరియు నోయిడా (జేవార్), గుజరాత్‌లోని ధోలేరా మరియు హిరాసర్, పుదుచ్చేరిలోని కారైకల్, ఆంధ్రప్రదేశ్‌లోని దగదర్తి, భోగాపురంమండ్ ఒరవకల్, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్, సిక్కింలోని పాక్యోంగ్, కేరళలోని కన్నూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగి (ఇటానగర్)ఇలా దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు పౌరవిమానయాన శాఖ ఇప్పటివరకు 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది. దుర్గాపూర్, షిర్డీ, సింధుదుర్గ్, పాక్యోంగ్, కన్నూర్, కలబురగి, ఒరవకల్ మరియు ఖుషినగర్ వంటి ఎనిమిది విమానాశ్రయాలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి.
ఉడాన్ పథకం కింద, ఇప్పటివరకు, 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు 36 హెలిప్యాడ్‌లతో సహా 154 ఆర్సీఎస్ విమానాశ్రయాలు అభివృద్ధి/ఆధునీకరణ కోసం గుర్తించబడ్డాయి.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వి.కె.సింగ్ (రిటైర్డ్) సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1781122)
Visitor Counter : 154