కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
వి.వి. గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ జనరల్ కౌన్సిల్ 50వ సమావేశం
प्रविष्टि तिथि:
11 DEC 2021 3:40PM by PIB Hyderabad
వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ (వీవీజీఎన్ఎల్ఐ) యొక్క జనరల్ కౌన్సిల్ 50వ సమావేశం కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి, జనరల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన, ఈ నెల 10వ తేదీన (డిసెంబర్ 10న) జరిగింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి సంస్థ యొక్క వివిధ కార్యకలాపాలను సమీక్షించారు, తదుపరి వృత్తిపరమైన కార్యకలాపాలకు దిశానిర్ధేశం చేశారు. ఇన్‌స్టిట్యూట్ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగాలని, ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోసం పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. మేనేజ్‌మెంట్, లీగల్ విద్యార్థులకు కూడా వీవీజీఎన్ఎల్ఐ ఇంటర్న్‌షిప్ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ యొక్క నాలుగు ప్రచురణలను విడుదల చేశారు. 'వీవీజీఎన్ఎల్ఐ విధాన దృక్పథాలు' (హిందీ & ఇంగ్లీష్); ‘చైల్డ్ హోప్’ (హిందీ & ఇంగ్లీష్), ‘టూ రీసెర్చ్ స్టడీ సిరీస్’ అనే ప్రచురణలను విడుదల చేశారు. ఈ సమావేశానికి కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు జనరల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు శ్రీ. సునీల్ బర్తవాల్ ; అదనపు కార్యదర్శి & ఆర్థిక సలహాదారు శ్రీమతి సిబానీ స్వైన్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి. కల్పనా రాజ్‌సింఘోట్; ఫక్కీ సంస్థ సెక్రెటరీ జనరల్ శ్రీ అరుణ్ చావ్లా; శారదా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ పి.కె. గుప్తా; బీఎంఎస్ సంస్థ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బి. సురేంద్రన్; ఏఐటీయుసీ జాతీయ కార్యదర్శి శ్రీ సుకుమార్ దామ్లే మరియు శ్రీ వీరేంద్ర కుమార్, బీఎంఎస్‌లు పాల్గొన్నారు. వీవీజీఎన్‌ఎల్‌ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హెచ్.శ్రీనివాస్ సభ్యులందరికీ స్వాగతం పలికి సమావేశాన్ని సమన్వయం చేశారు.
***
(रिलीज़ आईडी: 1780621)
आगंतुक पटल : 206