విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ మంత్రిత్వ శాఖలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు


ఎనర్జీ ఎఫిషియెన్సీపై బీఈఈ నేషనల్ వర్క్షాప్ నిర్వహిస్తోంది

మార్కెట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో శక్తి సామర్థ్య ఉపకరణాల పాత్రపై బీఈఈ జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తుంది

ఇండో-స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ సహకారంతో బీఈఈ నాలుగు కొత్త నాలెడ్జ్ ఉత్పత్తులను విడుదల చేసింది

Posted On: 11 DEC 2021 4:47PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్మహోత్సవ్ వేడుకల్లోభాగంగా 2021, డిసెంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ  వరకు  విద్యుత్ మంత్రిత్వశాఖ ఇంధన పరిరక్షణ వారోత్సవాన్ని జరుపుకొంటోంది.  

విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), డిసెంబర్ 10, 2021న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద భారతీయ రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీపై జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. స్వాతంత్ర్యం తర్వాత 75 ఏళ్లలో భారత్ సాధించిన విజయాలకు స్ఫూర్తిదాయకమైన వేడుక ఇది.   వర్క్షాప్ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పవర్ సెక్రెటరీ అలోక్ కుమార్.. ప్రముఖుల సమక్షంలో నాలు నాలెడ్జ్ ప్రోడక్టులను విడుదల చేశారు.  ఈ ఉత్పత్తులు ఇండో-స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈఈపీ) సహకారంతో అభివృద్ధి చేయబడ్డాయి. జాతీయంగా ఉద్దేశించబడిన లక్ష్యాల సాధన(ఐఎన్డీసీ)కు దోహదపడేందుకు వీటిని అభివృద్ధి చేశారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో  భాగంగా 2021 డిసెంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 10వ తేదీన మార్కెట్పరివర్తనలో శక్తి సామర్థ్య ఉపకరణాల పాత్రపై బీఈఈ జాతీయస్థాయి వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌కు రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (RAMA), కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) మరియు సహకార లేబులింగ్ మరియు అప్లయన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రామ్ (CLASP) వంటి వివిధ ఏజెన్సీలు,  అసోసియేషన్‌లు హాజరై తమవంతు సహకారాన్ని అందించాయి.  ఈ కార్యక్రమాన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ ప్రారంభించారు.
ప్రారంభించబడిన నాలెడ్జ్ ఉత్పత్తులు..
అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉష్ణ బదిలీని నిర్మించడంలో మరియు శక్తి-సమర్థవంతమైన భవనాల రూపకల్పనలో ప్రాథమికంగా శిక్షణ ఇవ్వడానికి "సంఖ్యా ఉదాహరణల ద్వారా భవనాలలో ఉష్ణ బదిలీని అర్థం చేసుకోవడం"పై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఐఐటీ భిలాయ్ భాగస్వామ్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. బిల్డింగ్ ఎన్వలప్ సొల్యూషన్ సెట్‌లు, ఇంధన- సమర్థవంతమైన నివాస భవనాలను రూపొందించడానికి బిల్డింగ్ డిజైనర్‌ల కోసం సిద్ధంగా ఉన్న గణన మరియు నివాస భవనాల కోసం శక్తి పరిరక్షణ భవనం కోడ్ లేదా ఎకో -నివాస్ సంహిత, 2018కి అనుగుణంగా ఉండటంలో సహాయపడతాయి.
ఎక్స్టర్నల్మూవబుల్ షేడింగ్ సిస్టమ్స్ (ఈఎంఎస్వైఎస్)పై రూపొందించిన మాన్యువల్.. దేశంలో అందుబాటులో ఉన్న ఎక్స్టర్న షేడింగ్ సొల్యూషన్‌ల  భవనాల్లోని వేడిని తగ్గించడంలో మరియు భవనాలను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
వాయు ప్రవాహ్: బిల్డింగ్ డిజైనర్‌లకు భవనాల్లో సహజ ప్రసరణను మెరుగుపరచడంలో మరియు వాటిని చల్లగా మరియు ఆరోగ్యవంతంగా చేయడంలో సహాయపడే ఓపెన్ సోర్స్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్డీ) సాధనం ఇది.

భారతదేశం జాతీయంగా నిర్ణయించిన లక్ష్యాల సాధన కోసం ఎన్డీసీ అనుకున్న సమయానికంటే ముందే సాధించిందని పవర్ సెక్రెటరీ వివరించారు. నివాస భవనాల నుంచే ఇంధన డిమాండ్ ఎక్కువగా ఉందని, పట్టణీకరణ పెరగడమంటే.. మరిన్ని భవనాల నిర్మాణం జరగడమేనన్నారు. ఇందుకోసం తగినంత సాంకేతికత, సామగ్రి, విజ్ఞాన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న బీఈఈని ఈ సందర్భంగా పవర్ సెక్రెటర్ అభినందించారు.

 

***



(Release ID: 1780570) Visitor Counter : 170


Read this release in: Hindi , English , Urdu , Tamil