గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఏవై-ఎన్ఆర్ఎల్ఎం) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పారిశుద్ధ్య వారోత్సవాలు
Posted On:
10 DEC 2021 2:31PM by PIB Hyderabad
అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద స్వయం-సహాయక బృందం సభ్యులు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల (ఎస్ఆర్ఎల్ఎంలు) అంతటా 2021 నవంబర్ 19 నుండి 25 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు జరుపుకున్నారు.

స్వయం సహాయక సంఘాలు, సిఎల్ఎఫ్ లీడర్ల ర్యాలీ - ఆంధ్రప్రదేశ్
కమ్యూనిటీ సంస్థలు కీలకమైన ఇతివృత్తాలపై దృష్టి సారించాయి: (i) చేతులు కడుక్కోవడం – సరైన పద్ధతి & క్లిష్టమైన సమయాలు, (ii) ఇంటిలోని సభ్యులందరూ టాయిలెట్‌ని అన్ని సమయాల్లో ఉపయోగించడం, నిర్వహణ మరియు నీటి లభ్యత, (iii) వ్యక్తిగత పరిశుభ్రత, ( iv) ఋతు పరిశుభ్రత మరియు నిర్వహణ మరియు (v) ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ. తాగునీరు, పారిశుధ్యం మరియు ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి (ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్) నిర్వహించే ఈవెంట్‌లు మరియు కార్యకలాపాలలో పాల్గొనడానికి మరియు మద్దతు ఇవ్వడానికి లైన్ డిపార్ట్‌మెంట్‌లతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఆర్ఎల్ఎంలకు సూచించారు.

ప్రతిజ్ఞ చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలు - ఆంధ్రప్రదేశ
ఎస్ హెచ్ జిలు, వారి సమాఖ్యలు సమూహ సమావేశాలలో గుర్తించిన సమస్యలపై చర్చలు నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. క్విజ్ వంటి పోటీలు, ప్రాంతాలు మరియు సమీపంలోని నీటి వనరుల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు, ఎస్ హెచ్ జి సభ్యులు తయారు చేసిన ఫినైల్స్, సబ్బులు, శానిటైజర్లు, శానిటరీ నాప్‌కిన్‌లు వంటి సంబంధిత ఉత్పత్తులను ప్రచారం చేశారు. గుర్తించిన థీమ్‌లపై ర్యాలీలు, రంగోలిలు, పోస్టర్‌లు, చేతులు కడుక్కోవడానికి సరైన పద్దతి, టిప్పీ ట్యాప్ పద్ధతిని ఉపయోగించడం వంటి కమ్యూనిటీ-ఆధారిత ఈవెంట్‌లను నిర్వహించింది. సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి కీలక సందేశాలు మరియు ఆడియో-విజువల్ మెటీరియల్‌లను వ్యాప్తి చేయడానికి కూడా ఇది ఒక ప్రోత్సాహంగా ఉంది. ఉదాహరణకు వెబ్‌నార్లు, వాట్సాప్ సమూహాలు, ఆన్‌లైన్ చర్చా వేదికలు మొదలైనవి. అన్ని కార్యకలాపాలు కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించారు.

ఘన వ్యర్థాల నిర్వహణపై కర్ణాటకలోని కామరాజనగర లో శిక్షణ
స్వాతంత్ర్యోత్సవ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యం, పోషకాహారం, వాష్‌తో సహా సామాజిక అభివృద్ధి అంశాలపై అవగాహన పెంపొందించడానికి 75 గంటలు వెచ్చించాలని ఎస్ హెచ్ జి సభ్యులకు ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. ఆ సలహాకు అనుగుణంగా, ఎస్ఆర్ఎల్ఎంలు కమ్యూనిటీ సభ్యుల అవగాహన కోసం వారంలో కార్యకలాపాలను ప్లాన్ చేయాలని అలాగే పేర్కొన్న సమస్యలపై పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలని సూచించారు.
ఎస్ఆర్ఎల్ఎంల ద్వారా వివిధ కార్యకలాపాలు నిర్వహించారు. ఉత్తరాఖండ్, అండమాన్-నికోబార్ ద్వీపం 100 శాతం ఎస్ హెచ్ జి కుటుంబాలు ఫంక్షనల్ టాయిలెట్లతో ఉన్న తమ సభ్యులు, విఓలను గుర్తించే చొరవను చేపట్టాయి. గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన “ఆత్మనిర్భర్ గ్రామ యాత్ర”లో గుజరాత్ ఎస్ఆర్ఎల్ఎం చురుకుగా పాల్గొన్నారు, స్వావలంబన గుజరాత్ దృక్పథంతో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై కీలక సందేశాలతో 33 జిల్లాల్లోని 10,605 గ్రామాలకు చేరువైంది. కుటుంబశ్రీ, కేరళ ప్రస్తుతం ఉన్న హరితకర్మసేన యూనిట్లను (హెచ్కెఎస్) ఉపయోగించుకుంది, ఇది పారిశుద్ధ్యం, పరిశుభ్రత, అలాగే వ్యర్థాల విభజనపై అవగాహన కల్పించడానికి ఎంటర్‌ప్రైజ్ మోడల్. కేరళ వ్యాప్తంగా 26,561 మంది సభ్యులతో మొత్తం 3,192 హరితకర్మసేన యూనిట్లు 1,000 స్థానిక గ్రామీణ మరియు పట్టణ సంస్థలకు సేవలను అందించాయి.


ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోని పచ్చయా గ్రామంలోని ఎస్ హెచ్ జి లు, విఓలు మరుగుదొడ్డి పరిశుభ్రత, టాయిలెట్ వినియోగం, ఘన మరియు ద్రవ గృహ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి పారిశుద్ధ్య చౌపాల్, స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు.
*****
(Release ID: 1780518)
Visitor Counter : 189