ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

గుజరాత్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 10 DEC 2021 2:21PM by PIB Hyderabad

నివాస,  వాణిజ్య సముదాయాల నిర్మాణం, భూలావాదేవీలు అలాగే స్థిరాస్తి ఫైనాన్సింగ్ వ్యాపారం నిర్వ‌హిస్తున్న సూరత్‌లోని ఒక ప్రముఖ గ్రూపున‌పై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ‌) 03.12.2021న సోదాలు, జప్తు  కార్య‌క్రమాన్ని ప్రారంభించింది. ఈ ఐటీ సోదాలు గ్రూపుకు చెందిన‌ సూరత్, ముంబైల‌లోని 40 కంటే ఎక్కువ ప్రాంగణాలలో జ‌రిగాయి.  ఐటీ సోదాలు నిర్వ‌హిస్తున్న సమయంలో, సమూహ సంస్థల విషయంలో ఖాతా పుస్తకాల సమాంతరంగా వివిధ నేరారోపణ ప‌త్రాలు, డిజిటల్ ఆధారాలు కనుగొనబడ్డాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రూపు స‌మూహంలోని సంస్థ‌ల లావాదేవీలు అత్యంత గోప్య‌మైన  కోడెడ్ పద్ధతిలో నిర్వహించబడుతున్నట్లు కనుగొనబడింది. కానీ ఐటీ సోదాల‌ బృందం విజయవంతంగా దీనిని డీకోడ్ చేసింది. ఈ సాక్ష్యాధారాల యొక్క ప్రాథమిక విశ్లేషణ  ప్ర‌కారం సాధారణ ఖాతా పుస్తకాల్లో నమోదుకాని ఫ్లాట్‌లు/భూమి అమ్మకం ద్వారా స‌ముపార్జించిన  రూ.300 కోట్ల కంటే కూడా ఎక్కువ‌గా సొమ్మును గుర్తించ‌డ‌మైంది. ఖాతాల‌లో చూప‌ని  భాగ‌స్వాముల‌కు చెందిన నగదు చేరిక‌లు,  బోగస్ రుణాలు మరియు వివరించలేని నగదు ఖర్చులు మొదలైన వాటి ఆధారాల‌ను  కూడా ఈ సోదాల‌లో ఐటీ శాఖ గుర్తించింది. దీనికి తోడు ఖాతా యొక్క భౌతిక పుస్తకాలను లోతుగా పరిశీలించడం, సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న నేరారోపణ సాక్ష్యాల ప్ర‌కారం రూ. 100 కోట్ల లోన్ ఫైనాన్సింగ్‌, రూ.200 కోట్లకు పైగా వివ‌ర‌ణ చూప‌లేని పెట్టుబ‌డుల‌ను కూడా ఐటీ శాఖ గుర్తించింది. ఈ సోదాల‌లో ఎలాంటి వివరణ లేని  రూ.4 కోట్ల న‌గ‌దును, రూ.3 కోట్ల మేర విలువైన ఆభరణాల‌ను గుర్తించారు. దీనికి తోడు డజనుకు పైగా బ్యాంకు లాకర్లను కూడా స్వాధీనంలోకి తీసుకున్నారు. సోదాలలో మొత్తం రూ.650 కోట్ల విలువైన అంచనా వేయని బహిర్గతం కాని రసీదులను మరియు అనుమానాస్ప లావాదేవీల ఎంట్రీల‌ను గుర్తించారు. ఐటీ శాఖ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.
                                                                                ****(Release ID: 1780514) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi , Punjabi