సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

2 రోజుల్లో 3500 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్న 'జాతీయ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పెడిషన్ బృందం'

Posted On: 09 DEC 2021 12:58PM by PIB Hyderabad

 

 'జాతీయ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పెడిషన్ బృందం'  ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంబల్ జిల్లా నుంచి మొద‌లై నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకుంది. 12 రోజుల సాహసయాత్రలో భాగంగా బృందం రోడ్డు మార్గంలో 3500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది. ఎంఎస్ఎంఈ కోసం చేప‌ట్టిన ఈ సాహ‌స‌యాత్ర‌కు.. కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే నవంబర్ 27, 2021న ఢిల్లీ జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర మొదటి దశలో బృందం మొత్తం ఐదు రాష్ట్రాలలో ప్ర‌యాణించింది.  దేశంలో మార్చి 12, 2021 నుండి ఆగస్టు 15, 2023 వరకు జరుగుతున్న ‌'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా ఎంఎస్ఎంఈ పథకాలను ప్రచారం చేయడానికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 75 ఎంఎస్ఎంఈ సభలను నిర్వహించారు. ఈ బృందం ఢిల్లీ నుంచి ఫరీదాబాద్, బల్లబ్‌గఢ్, పల్వల్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఫతేపూర్, కాన్పూర్, అలహాబాద్, రేవా, వారణాసి, బక్సర్, అరా, పాట్నా, ఛప్రా, చంపారన్, గోరఖ్‌పూర్, సంత్ కబీర్ నగర్, సుల్తాన్‌పూర్, కన్నౌజ్, లక్నో, అనుప్‌షాహర్,  సంభాల్ గుండా ప్ర‌యాణించింది. .ఈ ప్రయాణ సమయంలో బృందం ప్రత్యక్షంగా వేలాది మందికి మరియు పరోక్షంగా లక్షలాది మందికి ఎంఎస్ఎంఈ పథకాల గురించి త‌గిన అవగాహన క‌లిగించింది.
పాట్నాలో బీహార్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీ సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ఈ యాత్రకు ఫ్లాగ్ చేశారు. లక్నో న‌గరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మంత్రి  శ్రీ సిద్ధార్థనాథ్ సింగ్ డిసెంబర్ 7, 2021న జెండా ఊపి ముందుకు పంపారు. సంభాల్ జిల్లాలో శ్రీమతి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ రాష్ట్ర మంత్రి గులాబో దేవి ఢిల్లీకి యాత్ర బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
చంపారన్‌లో,  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు బీహార్ మాజీ మంత్రి శ్రీ బ్రజ్ కిషోర్ సింగ్ బృందానికి  జాతీయ జెండాను అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మనవడు అమిత్ ఆజాద్ లక్నోలో బృందానికి జాతీయ జెండాను అందజేశారు.
                                                                             

***


(Release ID: 1779883)
Read this release in: Urdu , English , Hindi , Tamil