అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav g20-india-2023

నికర జీరో ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడంలో దేశ ఇంధన పరివర్తనలో అణుశక్తికి ముఖ్యమైన పాత్ర ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.


30,000 మెగావాట్ల కంటే ఎక్కువ మొత్తం సామర్థ్యం గల 79 హైడ్రో స్కీమ్‌లు వచ్చే 10 సంవత్సరాలలో ప్రస్తుత సామర్థ్యానికి జోడింప బడే అవకాశం ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 09 DEC 2021 2:26PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్‌ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నికర జీరో ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ఇంధన పరివర్తనలో అణుశక్తికి ముఖ్యమైన పాత్ర ఉందని అన్నారు.

ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో దేశంలో ప్రస్తుతం స్థాపిత అణు విద్యుత్ సామర్థ్యం 6780 మెగావాట్లు అని చెప్పారు. అణుశక్తి స్వచ్ఛమైనది మరియు పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు ఇది థర్మల్ పవర్ లాగా 24x7 లభ్యమయ్యే బేస్ లోడ్ పవర్‌కు మూలం అని ఆయన అన్నారు.

గ్లాస్గోలో జరిగిన కాప్26 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రకటనలో భారతదేశం తన శిలాజేతర శక్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 జిడబ్లూకి చేరుకుంటుందని మరియు 2030 నాటికి దేశం తన ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చగలదని చెప్పినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

రాబోయే 10 సంవత్సరాలలో వివిధ ఇంధన వనరులను (పునరుత్పాదక మరియు పునరుత్పాదక రహిత) ఉపయోగించి దేశం యొక్క ఇంధన డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వ ప్రణాళిక గురించి  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలుపుతూ..ఈ విషయంలో  2019-2020 నుండి 2029-30 మధ్య కాలంలో సామర్థ్య జోడింపు కోసం 30000 మెగావాట్ల కంటే ఎక్కువ (8700 మెగావాట్ల 11 పంప్‌డ్ స్టోరేజీ స్కీమ్‌లతో కూడిన) మొత్తం 79 హైడ్రో స్కీమ్‌లు ఊహించబడ్డాయి. ఈ కాలంలో ప్రయోజనాలను అందించడానికి నిర్మాణంలో ఉన్న 12663.5 మెగావాట్ల హెచ్‌ఈ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

పై 79 ప్రాజెక్టులలో 1023 మెగావాట్ల సామర్థ్యంతో 5 జలవిద్యుత్ పథకాలు ప్రారంభించినట్లు మంత్రి పార్లమెంటు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న 6780 మెగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని 2031 నాటికి 22480 మెగావాట్లకు పెంచడంతోపాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రగతిశీలంగా పూర్తి చేసి, మంజూరు చేయనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం సామర్థ్యం 31665 మెగావాట్ల బొగ్గు ఆధారిత సామర్థ్యం నిర్మాణం వివిధ దశల్లో ఉంది.

 

<><><><><>(Release ID: 1779881) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Tamil