మంత్రిమండలి

ప్రధాన మంత్రిఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) ని 2021 మార్చి తరువాత కూడా 2024 మార్చి వరకుఅమలుపరచడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

దీనితో గ్రామీణప్రాంతాల లో ‘అందరి కోసం గృహ నిర్మాణాని’ కి పూచీ లభిస్తుంది

ఈ పథకం లోభాగం గా మొత్తం 2.95 కోట్ల గృహాల ను నిర్మించాలి అనేది లక్ష్యం కాగా వాటిలో మిగతా 155.75లక్షల గృహాల నిర్మాణాని కి గాను ఆర్థిక సహాయాన్ని  అందించడం జరుగుతుంది

దీనికి 2,17,257 కోట్లరూపాయల మేర ఆర్థిక భారం పడుతుంది, అందులో కేంద్రం వాటా 1,25,106 కోట్లరూపాయలు గా ఉంది 

Posted On: 08 DEC 2021 4:56PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) ని 2021వ సంవత్సరం మార్చి నెల తరువాత సైతం కొనసాగించడం కోసం గ్రామీణ అభివృద్ధి విభాగం తీసుకు వచ్చిన ఒక ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదాన్ని తెలిపింది. దీని లో భాగం గా ఈ పథకం లో మొత్తం 2.95 కోట్ల గృహాల ను నిర్మించాలి అనేది లక్ష్యం గా ఉండగా 2021 మార్చి 31 నాటికి మిగతా 155.75 లక్షల ఇళ్ళ నిర్మాణాని కి ఆర్థిక సహాయాన్ని సమకూర్చడం జరుగుతుంది.

మంత్రివర్గం తెలిపిన ఆమోదం తాలూకు వివరాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

2.95 కోట్ల గృహాల ను నిర్మించాలన్న మొత్తం లక్ష్యం లో భాగం గా మిగతా ఆవాసాల నిర్మాణ కార్యాలను పూర్తి చేయడం కోసం ఇప్పటి ప్రమాణాల ను అనుసరించి 2021 మార్చి తరువాత సైతం 2024 వ సంవత్సరం మార్చి నెల వరకు పిఎమ్ఎవై-జి ని కొనసాగించడం;

పిఎమ్ఎవై-జి లో భాగం గా గ్రామీణ ప్రాంతాల లో 2.95 కోట్ల ఆవాసాలు అనే సమగ్ర లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మిగిలిన 155.75 లక్షల గృహాల నిర్మాణానికి గాను మొత్తం ఆర్థిక భారం 2,17,257 కోట్ల రూపాయలు (కేంద్రం వాటా 1,25,106 కోట్ల రూపాయలు, రాష్ట్ర వాటా 73,475 కోట్ల రూపాయలు) గా ఉంది. ఎన్ఎబిఎఆర్ డి (‘నాబార్డ్’) కు వడ్డీ ని చెల్లించడానికి గాను 18,676 కోట్ల రూపాయల మేరకు అదనం గా అవసరమవుతుంది;

ఇబిఆర్ ను దశల వారీ పద్దతి లో సమాప్తం చేయడం తో పాటు పూర్తి పథకాని కి ఆర్థిక సహాయానికి సంబంధించి సకల బడ్జెటు రూపేణా సహాయం (జిబిఎస్) ద్వారా సర్దుబాటు చేసే విషయం లో నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ను సంప్రదించి తీసుకోవడం జరుగుతుంది;

అసమ్, ఇంకా త్రిపుర ను మినహాయించి ప్రతి ఒక్క చిన్న రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల కు మరియు జమ్ము కశ్మీర్ మినహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల కు పరిపాలన సంబంధి నిధి యొక్క కేంద్రం వాటా (2 శాతం పరిపాలన సంబంధి నిధి లో నుంచి 0.3 శాతం) నుంచి ఏటా అదనం గా 45 లక్షల రూపాయల ను విడుదల చేయడం; అది ఆయా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన 1.70 శాతం పరిపాలన సంబంధి నిధి కంటే అదనం గా ఉండగలదు;

ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ యూనిట్ (పిఎమ్ యు) మరియు నేశనల్ టెక్నికల్ సపోర్ట్ ఏజెన్సీ (ఎన్ టిఎస్ఎ) లను 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడం.

లాభాలు:

ఈ పథకాన్ని 2024వ సంవత్సరం మార్చి వరకు కొనసాగించడం వల్ల పిఎమ్ఎవై-జి లో భాగం గా లక్ష్యం గా నిర్దేశించుకున్న 2.95 కోట్ల గృహాల లో మిగిలిన 155.75 లక్షల కుటుంబాల కు కనీస సౌకర్యాల తో కూడిన పక్కా ఇళ్ళ నిర్మాణాని కి గాను ద్రవ్య సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల లో ‘‘అందరికీ గృహ వసతి కల్పన’’ అనే లక్ష్యాన్ని సాధించడానికి వీలవుతుంది

2021వ సంవత్సరం నవంబర్ 29వ తేదీ నాటికి పిఎమ్ఎవై-జి లో భాగం గా మొత్తం లక్ష్యం అయినటువంటి 2.95 కోట్ల గృహాల లో నుంచి 1.65 కోట్ల గృహాల ను నిర్మించడం జరిగింది. 2.02 కోట్ల గృహాలు, ఏవయితే ఎస్ఇసిసి 2011 డేటాబేస్ ఆధారం గా పర్మనెంట్ వెయిటింగ్ లిస్ట్ కు దాదాపు సమానం గా ఉన్నాయో, 2022వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ గా పెట్టుకొన్నటువంటి తుది గడువు ల్లా పూర్తి కాగలవన్న అంచనా ఉంది. ఈ కారణం గా 2.95 కోట్ల గృహాల మొత్తం లక్ష్యాన్ని సాధించడానికి ఈ పథకాన్ని 2024 మార్చి నెల వరకు కొనసాగించవలసిన అవసరం ఉన్నది.

 

***



(Release ID: 1779422) Visitor Counter : 477