జల శక్తి మంత్రిత్వ శాఖ

మణిపూర్.కు రూ. 120కోట్లు!


జలజీవన్ మిషన్ కింద కేంద్ర గ్రాంటుగా విడుదల
వచ్చే ఏడాది సెప్టెంబరుకల్లా,
ప్రతి ఇంటికీ నీరు, మణిపూర్ సంకల్పం

Posted On: 08 DEC 2021 12:56PM by PIB Hyderabad

  దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ నీటి కుళాయిల కనెక్షన్లు అందించే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్రప్రాధాన్యం ఇస్తోంది. దీనితో 2019 ఆగస్టునుంచి జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలవుతూ ఉంది. ఈ పథకం అమలుకోసం మణిపూర్ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో ఆ రాష్టానికి కేంద్రం తరఫు గ్రాంటుగా రూ. 120కోట్లను భారత ప్రభుత్వం విడుదల చేసింది. మరో వైపు జె.జె.ఎం. అమలుకోసం కేంద్రం నిధుల కింద 2021-22 సంవత్సరానకి గాను రూ. 481కోట్లు కేటాయించారు. 2020-21వ సంవత్సరంలో మణిపూర్ కు కేటాయించిన మొత్తానికి ఇది దాదాపు నాలుగు రెట్లు ఉంటుంది.

   వచ్చే ఏడాది సెప్టెంబరు వాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ నీటి సరఫరా కనెక్షన్లు అందించాలని మణిపూర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 4.51 ఇళ్లకు గాను, 2.67లక్షల ఇళ్లకు (అంటే 59.2శాతం ఇళ్లకు) నీటి కనెక్షన్లు ఉన్నాయి. 2019వ సంవత్సరంలో జె.జె.ఎం. పథకం ప్రకటించినప్పటినుంచి దాదాపు 2.41లక్షల ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు అందించారు. ఇక 2021-22వ సంవత్సరంలో 2.26లక్షల గ్రామీ ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు అందించాలని మణిపూర్ ప్రభుత్వం యోచిస్తోంది.

   2021-22లో 15వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద రూ. 78కోట్లను కేటాయించారు. గ్రామీణ స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలకు నీటిసరఫరా పారిశుద్ధ్యం పనులకోసం ఈ గ్రాంటును కేటాయించారు. దీనికి తోడు,.. ఇక వచ్చే ఐదేళ్లకు గాను అంటే, 2025-26వరకూ ఆ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు రూ. 414కోట్ల నిధులు అందనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ఇళ్లకు నీటిసరఫరా కల్పనకు ఎలాంటి నిధుల కొరత రాకుండా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉంది.  గ్రామీణ ఇళ్లకు నీటి సరఫరా కోసం మణిపూర్ రాష్ట్రంలో చేసే ఈ భారీ పెట్టుబడితో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. దీనితో గ్రామాల్లో ఆదాయం సృష్టికి అవకాశాలు కూడా పెరుగుతాయి.

https://ci5.googleusercontent.com/proxy/oAT0YzfPUnqtk6mRw4ni05AK1ndWq6VvCLHHqZI2zcp6XL278ixRxEEdXaL-71Gfz7TUJJeXqGJ0A5m0ejuKpHnweU61sKwbQ6W2v98WxmUjph463DGC3H9Wiw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00133CV.jpg

   జె.జె.ఎం. పథకాన్ని వికేంద్రీకరణ పద్ధతిలో అమలు చేస్తూ వస్తున్నారు. ఇందుకోసం దిగువస్థాయి స్థానిక పరిపాలనా సంస్థలకు కూడా తగిన ప్రమేయం కల్పిస్తున్నారు. పథకం ప్రణాళిక, అమలు దశలనుంచి నిర్వహణ వరకూ స్థానిక గ్రామీణ సంఘాలకు కీలకపాత్ర ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్యకమిటీని/పానీ సమితిని మరింత బలోపేతం చేయడం, ఐదేళ్ల గ్రామ కార్యాచరణ ప్రణాళికను గ్రామసభలోనే ఆమోదింపచేయడం  వంటి చర్యలను రాష్ట్రప్రభుత్వం తీసుకుంటోంది. దీనితో తమకోసం అమలుచేసే నీటి సరఫరా పథకాలపై సంబంధిత ప్రజాసమూహమే చర్చించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటిలోకి నీటిని మోసుకువచ్చే విషయంలో మహిళలదే కీలక పాత్ర కాబట్టి జె.జె.ఎం. పథకం అమలులో మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇంకా, ఈ పథకం అమలుకు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, స్థానిక ప్రభుత్వేతర సంస్థలు తగిన మద్దతు అందించేలా రాష్ట్రం తగిన చర్యలు తీసుకుంది. పథకం గురించి అవగాహన కలిగించడం, సురక్షితమైన నీటి ఆవశ్యతను గురించి తెలియజెప్పడం, గ్రామ నీటి సరఫరా పారిశుద్ధ్య కమిటీలకు, పానీ సమితులకు తగిన మద్దతు అందించడం తదితర కార్యకలాపాల్లో ఈ సంస్థలన్నింటికీ ప్రమేయం కల్పిస్తున్నారు.

  ప్రజారోగ్యంపై దృష్టిని కేంద్రీకరించిన ప్రభుత్వం,.. దేశవ్యాప్తంగా నీటి నాణ్యతా పరీక్షల నిర్వహణకోసం 2వేలకుపైగా లేబరేటరీలను  సాధారణ ప్రజలకోసం ప్రారంభించింది. దీనితో ప్రజలు తమ నీటి నమూనాల నాణ్యతను నామమాత్రపు ఖర్చుతో ఎప్పుడైనా పరీక్షించుకునేందుకు అవకాశం కలిగింది. మణిపూర్ రాష్ట్రంలో ఇలాంటివి 13 లేబరేటరీలు ఉన్నాయి.

 

 

https://ci5.googleusercontent.com/proxy/avP21-N5K7CUwF9MGipa3XC3uPwbLfNAp4UVTlKR5VfoSiydP8dX9EEg8mUIkVgtYomVhipUNFt0MqBfxJmvqYQh7Lh3bxixjIw-DnONKsZQzaQIRv-r68WVIA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002DVMO.jpg

క్షేత్రస్థాయి పరీక్షా కిట్లను (ఎఫ్.టి.కె.లను) వినియోగంతో నీటి నాణ్యతను పరీక్షించే పద్ధతిపై అవగాహన, శిక్షణ కల్పిస్తున్న దృశ్యం

   తాగడానికి, మధ్యాహ్న భోజనం వండటానికి, చేతులు కడుక్కోవడానికి, మరుగుదొడ్లలో వినియోగానికి అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కుళాయిల ద్వారా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.  ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం మణిపూర్.లో 3,265 పాఠశాలలకు (94.5శాతం), 7,591 అంగన్వాడీ కేంద్రాలకు (95.2శాతం) నీటి కుళాయిల కనెక్షన్లను అందుబాటులోకి తెచ్చారు.

  2019వ సంవత్సరంలో జలజీవన్ మిషన్ పథకం ప్రారంభమైనపుడు,..దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 18.93కోట్ల ఇళ్లలో కేవలం 3.23కోట్ల ఇళ్లకు (17శాతం ఇళ్లకు) మాత్రమే నీటికుళాయిలు ఉన్నాయి. గడిచిన 27 నెలల్లో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షల ద్వారా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, జలజీవన్ మిషన్ పనులు మాత్రం వేగవంతంగానే జరిగాయి. ఇప్పటికే, గ్రామీణ ప్రాంతాల్లోని 5.39 కోట్ల ఇళ్లకు నీటి కుళాయిల ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మొత్తం 8.63కోట్ల ఇళ్లకు (45శాతం ఇళ్లకు) నీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నాగర్ హవేళీ, డామన్-డయ్యూ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లో ఇళ్లకు, వందకు వందశాతం నీటి కనెక్షన్లు ఏర్పాటుకు  చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం,..83 జిల్లాల్లోని ప్రతి ఇంటికీ, 1.24లక్షల పైచిలుకు గ్రామాలకు ఇపుడు కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. 

  ‘సబ్.కా సాత్, సబ్.కా వికాస్, సబ్.కా విశ్వాస్, సబ్.కా ప్రయాస్’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, దేశంలో ఎవరికీ నీటి సరఫరా అందని పరిస్థితి ఉండకూడదన్న సంకల్పంతో, ప్రతి ఇంటికీ నీటి కుళాయి కనెక్షన్ అందించాలన్న దీక్షతో ఈ పథకం అమలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 83 జిల్లాల్లో, లక్షా 27వేల గ్రామాల్లో ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.

 

****



(Release ID: 1779274) Visitor Counter : 118