ఆర్థిక మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
07 DEC 2021 11:43AM by PIB Hyderabad
ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అహ్మదాబాద్ కేంద్రంగా స్టెయిన్‌లెస్ స్టీల్, లోహ పైపుల తయారీలో నిమగ్నమైన ఉన్న ఒక ప్రముఖ వ్యాపార గ్రూపులో సోదాలు మరియు జప్తు కార్యక్రమాలను నిర్వహించింది. 23.12.2021వ తేదీన ఈ సోదాలు, జప్తు కార్యక్రమం నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ అహ్మదాబాద్ మరియు ముంబయిలోని 30 కి పైగా ప్రాంగణాలలో ఏకకాలంలో జరిగింది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో నేరారోపణ పత్రాలు, విడి పత్రాలు, డిజిటల్ ఆధారాలు మొదలైనవి కనుగొనబడ్డాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సాక్ష్యాలు లెక్కించబడని ఆదాయానికి సంబంధించిన వివరణాత్మక రికార్డులను కలిగి ఉన్నాయి. దానిపై పన్నులు చెల్లించబడలేదు. సాక్ష్యాధారాల యొక్క ప్రాథమిక విశ్లేషణ
ప్రకారం గ్రూపు ఖాతాలో చూపని వస్తువుల విక్రయాలను జరిపిందని.. సాధారణ ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడని నగదును స్క్రాప్ చేసిందని తేలింది. దీనికి తోడు లెక్కల్లో చూపని నగదు రుణాలు, అడ్వాన్స్‌లు వాటిపై వచ్చిన వడ్డీ, నగదులో చేసిన ఖర్చులు, బోగస్ ఖర్చులు, కొనుగోళ్లు, లెక్కలు చూపని విధంగా భూమిపై పెట్టుబడులు మొదలైన అనేక అక్రమాలకు సంబంధించిన నేరారోపణలు కూడా ఈ సోదాలలో బయటపడ్డాయి. శోధన సమయంలో కనుగొనబడిన కీలక వ్యక్తి యొక్క తొలగించబడిన వాట్సాప్ చాట్ ప్రకారం దాని పన్ను పరిధిలోకి వచ్చే లావాదేవీల ఆదాయాన్ని తగ్గించి చూపడానికి.. ఆయా లావాదేవీలను ఖాతా పుస్తకాలలో చూపడం ద్వారా అవకతవకలకు పాల్పడినట్టుగా తగిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
కొన్ని బినామీ ఆస్తులను కూడా గుర్తించారు. సోదాల్లో లెక్కల్లో చూపని రూ.1.80 కోట్ల సొమ్మును గుర్తించారు. వివరణలేని దాదాపు రూ. 8.30 కోట్ల ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 18 బ్యాంకు లాకర్లను అదుపులో తీసుకున్నారు. ఈ ఐటీ శాఖ సోదాలలో దాదాపు రూ.500 కోట్ల విలువైన లెక్కల్లో చూపని లావాదేవీలను గుర్తించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
****
(Release ID: 1779028)
Visitor Counter : 175