పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ప్రస్తుత టెర్మినల్స్ విస్తరణ, మార్పులు చేపట్టడానికి రాగల 5 సంవత్సరాలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్న ఎఎఐ
దేశవ్యాప్తంగా 21 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అమోదం తెలిపిన ప్రభుత్వం
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులలోని మూడు పిపిపి విమానాశ్రయాలు 2025 నాటికి 30,000 కోట్ల రూపాయల మేరకు భారీ విస్తరణ కార్యక్రమం చేపట్టనున్నాయ.
దేశీయ నిర్వహణ, మరమ్మతుల సేవలకు జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
Posted On:
06 DEC 2021 2:44PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్టులు ఎదుర్కొన్న నష్టం వరుసగా సుమారు 19 వేలా 564 కోట్ల రూపాయలు. 5,116 కోట్ల రూపాయలుగా ఉంది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా దేశీయ విమానయాన సర్వీసులను 25-3-2020 నుంచి నిలిపివేశారు. ఆ తర్వాత 25-05-2020 నుంచి పరిమిత సంఖ్యలో 33 శాతం సామర్థ్యంతో ,వివిధ రంగాలలో కనిష్ఠ, గరిష్ఠ ప్రయాణ రుసుము పరిమితితో నడపడం జరిగింది. విమానయాన సంస్థలు ఎక్కువ ధర వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారికి సంబంధించి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసిన అనంతరం విమానయాన సర్వీసుల సామర్ధ్యానికి సంబంధించిన ఆంక్షలను 18-10-2021 నుంచి సడలించడం జరిగింది. దేశీయ విమానయాన సర్వీసులను వాటి సామర్ధ్యంపై ఎలాంటి పరిమితులు లేకుండా అనుమతించడం జరిగింది.
పౌర విమానయాన రంగాన్ని తిరిగి కోలుకునేట్టు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోంటోంది. అందులో కొన్ని......
1. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) రాగల 5 సంవత్సరాలలో ప్రస్తుత టెర్మినళ్ళ అభివృద్ధి, కొత్త టెర్మినళ్లు, ప్రస్తుత రన్ వేలు ఆప్రాన్‌లు , ఎయిర్ పోర్టు నావిగేషన్ సర్వీసులు (ఎఎన్ ఎస్) కంట్రోల్ టవర్లు, టెక్నికల్ బ్లాక్‌లు తదితరలాను రూ 25,000 కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టనుంది.
2.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరువద్ద గల మూడు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విమానాశ్రయాలు పెద్ద ఎత్తున విస్తరణ పథకాలను చేపట్టాయి. 2025 నాటికి 30 వేల కోట్ల రూపాయల మేరకు విస్తరణ పథకాలను పూర్తి చేయనున్నాయిఇ. అదనంగా 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా పిపిపి పద్ధతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది.
3. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు 8 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అవి మహారాష్ట్రలోని షిర్ది, పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ ,సిక్కింలోని పాక్యాంగ్, కేరళలోని కన్నూరు, ఆంధ్రప్రదేశ్ లోని ఓర్వకల్లు, కర్ణాటకలోని కాలబురగి, మహారాష్ట్రలోని సింధు దుర్గ్, ఉత్తరప్రదేశ్ లొని కుషినగర్.
4.దేశీయ మెయింటినెన్స్ రిపేర్, ఓవర్ హాల్ సేవలకుసంబంధించి జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం జరిగింది.
5. సానుకూల విమానయాన లీజింగ్, ఫైనాన్సింగ్ వాతావరణం ఏర్పాటు
6. గగనతల నావిగేషన్ కు సంబంధించి మౌలికసదుపాయాలను భారతీయ విమానాశ్రయాలలో మెరుగుపరిచేందుకు చర్యలు
7. సరకు రవాణాకు సంబంధంచి భారతీయ సంస్థలు 2018లో ఏడు ఫ్రైట్ కారియర్లను చేపట్టగా 2021 కి అవి 21 కి చేరాయి. ఫలితంగా అంతర్జాతీయ సరకు రవాణా ఇండియాకు, అలాగే ఇండియానుంచి గత రెండు సంవత్సరాలలో రెండు శాతం నుంచి 19 శాతానికి పెరిగింది.
ప్రాంతీయ అనుసంధానత పథకం (ఆర్‌సిఎస్) కింద ఉదే దేశ్ కా ఆమ్ నాగరిఇక్ (ఉడాన్) పథకం కింద 2021 నవంబర్ 24 నాటికి 393 మార్గాలలో 62 మార్గాలు ఇప్పటివరకు అనుసంధానత లేని, తక్కువ అనుసంధానత గల ప్రాంతాలకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 2 వాటర్ ఎయిరోడ్రోమ్‌లు, 6 హెలిపోర్టులు ఉ న్నాయి. భారత ప్రభుత్వం అన్ సర్వ్‌డ్, అండర్ సర్వ్ డ్ ఎయిర్ పోర్టులు, హెలిపోర్టులు, రాష్ట్రప్రభుత్వాల వాటర్ డ్రోమ్‌లు, పిఎస్‌యులు, ఎఎఐ తదితరాలకు 2017 నుంచి 2021 అక్ఠొబర్ వరకు
పునరుద్దరణకు 2,062 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ కొత్త తరహా సీ ప్లేన్ కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. వీటిని వాటర్ ఎయిరో డ్రోమ్ల నుంచి ఉడాన్ -3 కింద ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మొత్తం 14 వాటర్ ఎయిరోడ్రోమ్‌లు ఉన్నాయి. వీటిని గుజరాత్ అస్సాం, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికొబార్ , లక్షద్వీప్‌లలో గుర్తించారు.
1. సర్దార్ సరోవర్ డామ్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ ) గుజరాత్
2. సబర్మతి రివర్ ఫ్రంట్, అహ్మదాబాద్
3. శత్రుంజయ్ డ్యామ్ , గుజరాత్
4.స్వరాజ్ ద్వీప్ , అండమాన్ నికొబార్ దీవులు
5. హావ్ లాక్ ఐలండ్ అండమాన్ నికొబార్ దీవులు
6. షాహీద్ ద్వీప్ (నీల్ ఐలండ్) అండమాన్ నికోబార్ ఐలండ్స్
7. గౌహతి రివర్ ఫ్రంట్, అస్సాం
8.ఉమ్‌రాంగ్సో రిజర్వాయర్ , అస్సాం
9. నాగార్జున సాగర్ డ్యామ్, తెలంగాణ
10. ప్రకాశం బ్యారేజ్, ఆంధ్రప్రదేశ్
11.మినికాయ్ లక్షద్వీప్ ఐలండ్
12. కవరట్టి, లక్షద్వీప్
13. పోర్ట్ బ్లయిర్
14. అగట్టి , లక్షద్వీప్ ఐలండ్స్
పైన పేర్కొన్న వాటర్ డ్రోమ్‌లకు 28 సీ ప్లేన్ రూట్‌లను కేటాయించడం జరిగింది. సీ ప్లేన్ రూట్ లను గెలుచుకున్న ప్రైవేటు సంస్థలు స్పైస్ జెట్, టర్బో ఏవియేషన్, ఆర్.సి.ఎస్ ఫ్లయిట్ కార్యకలాపాలు ఇతర వాటర్ ఎయిరోడ్రోమ్ లనుంచి , అక్కడ కార్యకలాపాలు ప్రారంభానికి అనువుగా ఉన్నవెంటనే మొదలవుతాయి.వాటర్ ఎయిరోడ్రోమ్ ల అభివృద్ధిని పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ (ఎం..పి.ఎస్.డబ్ల్యు) మంత్రిత్వశాఖ చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఎం.ఒ.సి.ఎ , ఎంపిఎస్‌డబ్ల్యు మధ్య ఎం.ఒ.యు కుదిరింది.
ఈ సమాచారాన్ని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి .డాక్టర్ వి.కె.సింగ్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో రాజ్యసభకు తెలిపారు.
***
(Release ID: 1778954)
Visitor Counter : 186