ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తిని పెంచి సంపూర్ణ ఆర్ధికాభివృద్ధికి దోహ‌దం చేసే చొర‌వే డిఒఎన్ఇఆర్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఈశాన్య కౌన్సిల్ ప్రాజెక్టు

Posted On: 07 DEC 2021 12:36PM by PIB Hyderabad

 వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌, సిక్కిం అన్న ప్రాజెక్టును  గ్యాంగ‌ట‌క్‌లో సిక్కిం ప్ర‌భుత్వానికి చెందిన ఆహార భద్ర‌త‌, వ్య‌వ‌సాయ అభివృద్ధి శాఖ అమ‌లు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్య‌యం రూ. 504.05 ల‌క్ష‌లు. ఈశాన్య కౌన్సిల్ వాటా రూ.453. 65 ల‌క్ష‌లు కాగా, రాష్ట్ర వాటా రూ. 50.40 ల‌క్ష‌లు. ఈ ప్రాజెక్టు సిక్కిం తూర్పు, ప‌శ్చిమ‌, ఉత్త‌ర. ద‌క్షిణ జిల్లాల‌లో అమ‌ల‌వుతోంది. 
ఈ ప్రాజెక్టు ల‌క్ష్యం ఒక వ్య‌క్తి, ప‌శువుకు చొప్పున ఉత్ప‌త్తిని పెంచ‌డం, త‌క్కువ స‌మ‌యంలో కార్యక‌లాపాలు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తిలో నిమ‌గ్న‌మై ఉన్న వివిధ యూనిట్ల కార్య‌క‌లాపాల వ్య‌యాన్ని త‌గ్గించ‌డం, వ్య‌వ‌సాయా ఆదాయాన్ని పెంచి, మొత్తం ఆర్ధిక అభివృద్ధికి దోహ‌దం చేయ‌డం. 
ఎద్దుల‌తో పోలిస్తే విద్యుత్ టిల్ల‌ర్ల కార్య‌క‌లాప తుల‌నాత్మ‌క అధిక ఉత్ప‌త్తి కార్యాచ‌ర‌ణ స‌మయాన్ని త‌గ్గించ‌డ‌మే కాక అందులో స‌మ‌యానుకూల‌త‌ను సాధిస్తుంది. ఇది వివిధ రుతువుల‌లో ఏర్ప‌డే బీళ్ళ‌ను త‌గ్గించి, త‌ద్వారా పంట‌లు పండించ‌డంలో ఉధృతిని, ఉపాధిని, ఆదాయాన్ని గ‌ణ‌నీయంగా పెంచుతుంది. 

 

****



(Release ID: 1778812) Visitor Counter : 82