సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యుపిఎస్‌సి సిఫార్సు చేసిన 38 మంది అభ్యర్థుల కాంట్రాక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం .. వీరిలో 10 మంది సంయుక్త కార్యదర్శి హోదాలో నియమించడానికి డిఓపిటి ఆమోదం - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


లేటరల్ ఎంట్రీ ప్రక్రియతో ప్రతిభావంతుల సేవలను వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన స్థాయిల్లో మానవ వనరులను పెంచడం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయి- కేంద్ర మంత్రి

Posted On: 06 DEC 2021 6:09PM by PIB Hyderabad

కాంట్రాక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన ప్రభుత్వంలో చేరేందుకు యుపిఎస్‌సి సిఫార్సు చేసిన 10 మంది సంయుక్త కార్యదర్శుల తో సహా 38 మంది అభ్యర్థుల నియామకానికి డిఓపిటి ఆమోదం తెలిపిందని శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం,  పిఎంఓ లో సహాయ మంత్రి,సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు,  పెన్షన్అణుశక్తిఅంతరిక్ష శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. .  లేటరల్ ఎంట్రీ ప్రక్రియ వల్ల రెండు లక్ష్యాలు నెరవేరుతాయని మంత్రి పేర్కొన్నారు.  ప్రభుత్వ సేవలోకి సరికొత్త  ప్రతిభను తీసుకురావడం  కేంద్రదీనివల్ల  ప్రభుత్వంలో కొన్ని స్థాయిలలో మానవ వనరులను బలోపేతం  వీలవుతుందని మంత్రి అన్నారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన విధంగా ఈ నియామక ప్రక్రియ జరిగిందని మంత్రి అన్నారు. నియామక ప్రక్రియను సంస్థీకరించి, లక్ష్య సాధనకు అనుగుణంగా నియామకాలు జరిగేలా చూడడానికి లేటరల్ ఎంట్రీ  భాధ్యతను యుపిఎస్‌సి కి అప్పగించాలని ప్రధానమంత్రి ఆదేశించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలలో   సంయుక్త కార్యదర్శి / డైరెక్టర్/ డిప్యూటీ కార్యదర్శి హోదాల్లో కాంట్రాక్ట్/డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమించడానికి అభ్యర్థులను ఎంపిక చేయాలని  సిబ్బంది వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ  14.12.2020 మరియు 12.02.2021 తేదీల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కోరిందని మంత్రి వివరించారు. 

దీనికి అనుగుణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించింది. అందిన దరఖాస్తులను పరిశీలించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 231 మందిని ఎంపిక చేసి వారికి 27 సెప్టెంబర్ నుంచి  8 అక్టోబర్ 2021 వరకు  ఇంటర్వ్యూలు నిర్వహించింది. వీరిలో 31 మందిని ఎంపిక చేసింది. జాయింట్ సెక్రటరీడైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ పోస్టులకు  అభ్యర్థులును  సిఫార్సు చేసింది. గతంలో సంయుక్త కార్యదర్శి హోదాలో 7 మంది నియమితులయ్యారు. దీనితో నియామకాల సంఖ్య 38 కి చేరిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

ఉద్యోగ నియామకాలు జరిగే ముందు అనుసరించే అన్ని విధానాలను అనుసరించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పోలీసు తనిఖీ, ఐబీ క్లియరెన్స్‌తో సహా అన్ని నిబంధనలు పాటించినట్టు  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.  ఇటువంటి నియామకాలు కొత్త ప్రతిభను తీసుకురావడమే కాకుండా మానవ వనరుల లభ్యతను పెంపొందించే తోడ్పడతాయని శ్రీ సింగ్ అన్నారు.

భర్తీ చేయబడిన ప్రతి పోస్ట్ ఒక నిర్దిష్ట భౌగోళిక  ప్రాంతం పరిధికి లోబడి  కాంట్రాక్టు ప్రాతిపదికన జరుగుతుందని అన్నారు.   రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, విశ్వవిద్యాలయాలు మొదలైన వాటి నుండి డిప్యుటేషన్ ప్రాతిపదికన  (స్వల్పకాలిక ఒప్పందంతో సహా) నియమించబడతారు.  వారు తమ మాతృ విభాగాలలో హక్కును కలిగి ఉంటారు.

 

 


(Release ID: 1778764) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Punjabi