వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బొగ్గు తరలింపునకు లాజిస్టిక్ ఖర్చులు తగ్గించేందుకు పి.ఎం. గతిశక్తి మిషన్
2025-26 సంవత్సరం నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ప్రయత్నాన్ని సమీక్షించిన నీతి ఆయోగ్
బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికి పీఎం గతిశక్తికి అనుగుణంగా సమీకృత మౌలిక సదుపాయాలు సమష్టి కృషి.
ఛత్తీస్ ఘడ్,ఒడిషాలలో బొగ్గు తరలింపును పెంచేందుకు 14 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.
Posted On:
03 DEC 2021 1:01PM by PIB Hyderabad
2025-26 ఆర్థిక సంవత్సరానికి 1బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి సంబంధించి కోల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన మిషన్ విషయమై చర్చించేందుకు నీతి ఆయోగ్ సిఇఒ అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బొగ్గు భారతదేశానికి ప్రాథమిక దేశీయ ఇంధనం .అలాగే దేశవ్యాప్తంగా రవాణా అయ్యే ఏకైక అతిపెద్ద సరుకు; అందువల్ల బొగ్గు గనులు, సరఫరా వినియోగం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధానమైనది.
బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాలకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టడం, రైల్వే , రోడ్డు రవాణా, జాతీయరహదాఉలు, పోర్టులు, షిప్పింగ్, జలవనరుల మంత్రిత్వశాఖలు ఈ దిశగా పనులు చేపట్టడంతో బొగ్గు ఉత్పత్తి సామర్ధ్యం దేశీయ డిమాండ్ ను మించి ఉంది. ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమానికి అనుగుణంగా, అన్ని మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల సమన్వయంతో సమీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధి, బహుళ-మోడల్ కనెక్టివిటీ ద్వారా బొగ్గు ఉత్పత్తి , తరలింపు సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి కృషి జరుగుతోంది.
సమావేశంలో చర్చించిన విధంగా బొగ్గు తరలింపునకు సంబంధించి ప్రధాన విధానం దీని వాటాను 64 శాతం నుంచి 75 శాతానికి 2030 ఆర్థిక సంవత్సరానికి విస్తరింపచేయడానికి ఉద్దేశించినది. చత్తీస్‌ఘడ్, ఒడిషాలలో బొగ్గు తరలింపును మరింత విస్తృతపరిచేందుకు గతిశక్తి విధానాలకు అనుగుణంగా 14 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. 2026 ఆర్ధిక సంవత్సరం వరకు బొగ్గు తరలింపునకు సంబంధించిన రైల్వేల లైన్ సామర్థ్యానికి సంబంధించిన అంశాలను తగిన విధంగా పరిష్కరించడం జరిగింది. ప్రైవేటు కంపెనీలను బొగ్గు ఉత్పత్తిలో ప్రోత్సహించేందుకు రైల్వేలు కన్వర్షన్ ఫీజును ప్రైవేట్ సైడింగ్‌నుంచి ప్రైవేట్ రవాణా టెర్మినల్‌కు కోటి రూపాయల నుంచి 10 లక్షలకు తగ్గించింది
రైల్వే మంత్రిత్వశాఖ సరకు రవాణా సమాచార వ్యవస్థ (ఎఫ్.ఒ.ఐ.ఎస్)ను అభివృద్ధి చేసింది . ఇది సరకు రవాణా రైళ్ల గమనాన్ని పరిశీలిస్తుంది. ఇది సరకు రవాణా , ఇతర చార్జీలను లెక్కిస్తుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ ఐఎస్) ఫ్రైట్ బిజినెస్ డాటా ఇంటిగ్రేషన్ (ఎఫ్‌బిడిఐ) సేవలు కూడా అందిస్తుంది. దీనిని కస్టమర్లు తమ అంతర్గత ఎం.ఐ.ఎస్ నెట్ వర్క్ ల తో అనుసంధానం చేసుకోవడానికి పనికి వస్తుంది.
ఇలాంటి సదుపాయాన్నే పోర్టు కమ్యూనిటీ సిస్టమ్ (పిసిఎస్ ) పేరుతో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్‌వేస్ అభివృద్ధి చేసంది. ప్రభుత్వ ఏజెన్సీలు,టెర్మినల్ ఆపరేటర్లు, ట్రేడర్ల మధ్య సరైన సమాచార మార్పిడికి ఇది వేదికగా ఉపయోగపడుతుంది. మౌలిక సదుపాయాలు సమకూర్చే మంత్రిత్వశాఖల డిజిటైజేషన్ దేశంలో బొగ్గు తరలింపు సామర్ద్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.
దీనికితోడు, పిఎం గతిశక్తి ఎన్.ఎం.పి తో ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానానికి అనుసంధానతను కల్పించడానికి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పిఎంజిఎస్ వై రోడ్లు బొగ్గు మంత్రిత్వశాఖకు అందుబాటులో ఉండే విధంగా రోడ్ ట్రాన్స్ పోర్టు, జాతీయరహదారుల మంత్రిత్వశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. బొగ్గు సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఇందుకు సంబంధించిన ప్రణాళిక బొగ్గు తరలింపులో లాజిస్టిక్ ఖర్చులు తగ్గించేందకు, బొగ్గు రంగంలో సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ఇది ఉపకరిస్తుంది.
***
(Release ID: 1778763)
Visitor Counter : 172