వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని ఉపయోగించడం కోసం, మీర్జాపూర్‌లో 'వ్యవసాయ-ఎగుమతి కాన్ఫరెన్స్- కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశాన్ని' నిర్వహించిన అపెడా


వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, ముఖ్య అధికారులు మరియు రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు

Posted On: 05 DEC 2021 1:37PM by PIB Hyderabad

పూర్వాంచల్  అని పిలిచే తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని ఉపయోగించడం కోసం, అపెడా మిర్జాపూర్‌లో 'అగ్రి-ఎగుమతి కాన్ఫరెన్స్, కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశాన్ని' నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి  అనుప్రియా పటేల్‌తో పాటు 700 మందికి పైగా రైతులు, ఎగుమతిదారులు, రైతులు సదస్సుకు హాజరయ్యారు.

 

కాన్ఫరెన్స్‌లో శ్రీమతి అనుప్రియ పటేల్ ప్రసంగిస్తూ, పూర్వాంచల్ నుండి వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల పెరుగుదల భారతదేశ విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో సహాయపడుతుందని అన్నారు.

2021-22లో సరుకుల ఎగుమతుల కోసం దేశం 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించిందని, ఏప్రిల్-నవంబర్ 2021-22 కాలంలో ఇప్పటికే 262 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించామని శ్రీమతి పటేల్ చెప్పారు. 2021-22లో వ్యవసాయ ఉత్పత్తుల కోసం రికార్డు స్థాయిలో 43 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం నిర్దేశించగా, అపెడా, రైతుల కృషి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆమె అన్నారు.పూర్వాంచల్ ప్రాంతం నుండి ఎగుమతులను పెంచడానికి  అపెడా  చేపట్టిన కార్యక్రమాల గురించి ఛైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మిర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ప్రవీణ్ కుమార్ లక్కర్ హాజరయ్యారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఎగుమతిదారులు-అసోసియేషన్ మరియు ఎఫ్పిఓల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. చైనాకు బాస్మతియేతర బియ్యం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పచ్చిమిర్చి ఎగుమతి సరుకులను శ్రీమతి అనుప్రియ పటేల్, అపెడా చైర్మన్ డాక్టర్ అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. 

 

మిర్జాపూర్, భదోహి, వారణాసి, ఘాజీపూర్ మరియు చందౌలీ జిల్లాల నుండి రైతులు ఎక్కువగా సదస్సుకు హాజరయ్యారు.

వ్యవసాయ పంటల ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ పద్ధతులకు కట్టుబడి ఉండటం కోసం, ఎఫ్పిఓలు, వ్యాపారులు, ఎగుమతిదారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతర సంస్థల సహకారంతో  అపెడా జూలై, 2021లో వారణాసిలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. వారణాసి ప్రాంతం నుండి 200 మందికి పైగా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ప్రముఖ సంస్థల అధికారులు ఈ ప్రాంతం నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి అలాగే రైతులచే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఉత్తమ వ్యవసాయ పద్ధతులకు (జిఏపి) కట్టుబడి ఉండటానికి విలువైన ఇన్‌పుట్‌లను అందించారు.

 

*****


(Release ID: 1778349) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Tamil