రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భార‌త-మాల్దీవుల శిక్ష‌ణ క‌స‌ర‌త్తు 'ఎకువెరిన్' 11వ ఎడిషన్‌లో పాలుపంచుకొనేందుకు బ‌య‌లుదేరిన భార‌త సైన్యం

Posted On: 05 DEC 2021 9:14AM by PIB Hyderabad

భారతదేశం మ‌రియు మాల్దీవుల మధ్య శిక్ష‌ణ  క‌స‌ర‌త్తు  'ఎకువెరిన్' 11వ ఎడిషన్‌ మాల్దీవుల్లోని కధూ ద్వీపంలో  డిసెంబర్ 06వ 2021 నుండి డిసెంబ‌రు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  ఇందులో పాల్గొనేందుకు భార‌త సైన్యం కార్య‌స్థ‌లానికి బ‌య‌ల్దేరి వెళ్లింది. సైనిక క‌స‌ర‌త్తు భూమిపై, |సముద్రంలో అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అర్థం చేసుకోవడం, ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డం & త‌గిన విధంగా తిరుగుబాటు కార్యకలాపాలను నిర్వహించడం, ఉత్తమ సైనిక పద్ధతులు మరియు అనుభవాలను పంచుకోవడంలో రెండు దేశాల సాయుధ దళాల మధ్య సినర్జీ & ఇంటర్-ఆపరేబిలిటీని మెరుగుపరుస్తుంది. కఠినమైన శిక్షణతో పాటు, ఉమ్మడి సైనిక వ్యాయామంలో రక్షణ సహకారం, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి గాను సాంస్కృతిక,  క్రీడా కార్యకలాపాలు కూడా ఇందులో భాగంగా నిర్వ‌హించ‌నున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న భద్రతా అంశాలు, మాల్దీవులతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ క‌స‌ర‌త్తు దోహ‌దం చేస్తుంది. ఇరుదేశాల సంబంధాల‌ను నూత‌న తీరాల‌కు చేర్చుతుంది. 

 

****



(Release ID: 1778348) Visitor Counter : 167