ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 05 DEC 2021 9:25AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 127.61 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,155.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.29% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.35% కు చేరింది.

గత 24 గంటల్లో 6,918 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,40,60,774 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,895 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.73%) గత 62 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.80%) గత 21 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 64.72 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(రిలీజ్ ఐడి: 1778243) సందర్శకుల సూచీ సంఖ్య : : 175
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam