వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జ‌వాద్‌ తుపాన్‌ను ఎదుర్కోవ‌డంలో స‌న్న‌ద్ధ‌త‌పై స‌మీక్ష నిర్వ‌హించిన కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్‌


విప‌త్తు నిర్వ‌హ‌ణ‌, ఉప‌శ‌మ‌నానికి ప్ర‌జ‌ల ప్రాణాల‌నుఉ, జీవ‌నోపాధిని ర‌క్షించ‌డానికి ప‌బ్లిక్‌,ప్రైవేటు భాగ‌స్వామ్యం అవ‌స‌రం _శ్రీ పియూష్ గోయ‌ల్‌

Posted On: 04 DEC 2021 1:30PM by PIB Hyderabad

జ‌వాద్‌ తుపాన్‌ను ఎదుర్కొవ‌డంలో స‌న్న‌ద్థ‌త‌పై కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్ ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు.
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, విప‌త్తు స‌న్న‌ద్ధ‌త‌, దానిని ఎదుర్కోవ‌డం వంటివి సంస్థాగ‌తం అవుతున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ స్వ‌యంగా విప‌త్తు ను ఎదుర్కోవ‌డంపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌తో , ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు, ఇత‌ర స్టేక్ హొల్డ‌ర్లంద‌రితో క‌ల‌సి ప‌నిచేయాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి ఇప్ప‌టికే వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. విప‌త్తుల సమ‌యంలో ప్రాణ‌న‌ష్టం, ఆస్థిన‌ష్టం క‌నీస స్థాయిలో ఉండేట్టు చూడాల్సిందిగా ఆదేశించారు.

ఇందుకు అనుగుణంగా వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జాపంపిణీ, టెక్స్‌టైల్ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిషా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు చేసిన ఏర్పాట్ల‌పై ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో మాట్లాడారు. జాతీయ స్థాయి లోని ప‌రిశ్ర‌మ‌ల సంస్థ‌లైన సిఐఐ, ఎఫ్ ఐ సిసిఐ , అసోచామ్‌, పిహెచ్‌డి చాంబ‌ర్స్‌కు చెందిన ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సులో పాల్గొన్నారు.

సంబంధిత రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు చేసిన ఏర్పాట్ల‌పై మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించారు. విప‌త్తు ప్ర‌భావాన్ని విజ‌య‌వంతంగా త‌గ్గించేందుకు మంత్రులు, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు, ఇత‌ర సంస్థ‌లు, చేసిన సూచ‌న‌ల‌ను ఆయ‌న స‌మీక్షించారు.  తుపాను తీవ్ర‌త‌ను ఎదుర్కొనేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న అభినందించారు. ఈ స‌మ‌న్వ‌యం స‌హ‌కార ఫెడ‌ర‌లిజానికి మంచి ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న అన్నారు.  ఈ ప్ర‌కృతి విప‌త్తును ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు అందించిన స‌మాచారం. సూచ‌న‌ల‌తో స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా రూపొందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌జ‌లను , వారి జీవ‌నొపాథిని కాపాడ‌డానికి ప్ర‌కృతి విప‌త్తు నిర్వ‌హ‌ణ దానిని ఎదుర్కోవ‌డానికి సంబంధించి ప‌బ్లిక్‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. తుపాను స్వ‌ల్ప ప్ర‌భావం క‌ల‌దిగా క‌నిపిస్తున్న‌ద‌ని అంటూ మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకోవాల‌ని, మ‌న సామ‌ర్థ్యాల‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని సూచించారు. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్సు రంగాల‌లో తుపాను ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌త విష‌య‌మై ఆయ‌న పిలుపునిచ్చారు.

తుపాను ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్సు రంగాల‌లో స‌న్న‌ద్ధ‌త‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.
భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండి) ప్ర‌కారం, బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం 

జ‌వాద్‌ తుపానుగా మ‌మారి ఉత్త‌ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌- ఒడిషా తీరాన్ని ఈ మ‌ధ్యాహ్నానికి గంట‌కు 100 కిలోమీట‌ర్ల  వేగంతో గాలులు తీరాన్ని తాకే అవ‌కాశం ఉంది.

***


(Release ID: 1778213) Visitor Counter : 132