పర్యటక మంత్రిత్వ శాఖ

కోల్వా బీచ్‌లో టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, పబ్లిక్ యుటిలిటీలను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి


- దక్షిణ గోవాలోని బీచ్‌లు భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన‌ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

Posted On: 04 DEC 2021 6:49PM by PIB Hyderabad

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఈ రోజు దక్షిణ గోవాలోని కోల్వా బీచ్‌లో టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు పబ్లిక్ యుటిలిటీస్ మరియు దుస్తులు మార్చుకునే గదిని ప్రారంభించారు. దీనిని స్వదేశ్ దర్శన్ పథకం కింద కోస్టల్ సర్క్యూట్ -II ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా  భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా వీటిని నిర్మించారు.  కోల్వా రెసిడెన్సీ, కోల్వా బీచ్‌లో జరిగిన కార్యక్రమంలో టూరిజం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల‌ను మంత్రి ప్రారంభించారు, కోల్వా మరియు బెనౌలిమ్ బీచ్‌లలో పార్కింగ్, ఇల్యూమినేషన్, మరియు దక్షిణ గోవాలోని బీచ్‌లలో ప్రజా సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ఫలకాలను మంత్రి ఈ సంద‌ర్భంగా ఆవిష్కరించారు. కోల్వా మరియు బెనౌలిమ్ బీచ్‌లు ప్రపంచంలోని ప్రసిద్ధ బీచ్‌లలో ప్ర‌ముఖ‌మైన‌వి. గోవా తీరప్రాంతం వెంబడి ఉన్న ఈ బీచ్‌లను ఏడాది పొడవునా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు సందర్శిస్తారు. గోవాలో పర్యాటక పరిశ్రమను పెంపొందించడానికి అన్ని పర్యాటక సౌకర్యాలను కల్పించగల సరైన అభివృద్ధి, అధునాత‌న ప్ర‌ణాళిక‌, అధునాత‌న‌త‌ల‌ డిమాండ్ వ‌స్తున్నందున, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకం - II కింద ఇక్క‌డ ప‌నుల‌కు నిధులను మంజూరు చేసింది. అభివృద్ధి ప్రాజెక్టుల‌లొ స్థానిక వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలు, రోడ్ల విస్తరణ, ద‌స్తులుమార్చుకునే గదులు, లాకర్లతో టాయిలెట్ బ్లాక్‌ల ఏర్పాటు తదిత‌ర ప‌నులున్నాయి.
స్వదేశ్ దర్శన్ కోస్టల్ సర్క్యూట్ థీమ్‌లో భాగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గొవా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ మనోహర్ (బాబు) అజ్‌గావ్‌కర్, బెనౌలిమ్ ఎమ్మెల్యే శ్రీ చర్చిల్ అలెమావో, ఎమ్మెల్యే మరియు జీడీడీసీ  చైర్మన్ శ్రీ దయానంద్ సోప్టేతో పాటుగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. స్వదేశ్ దర్శన్ పథకం అనేది థీమ్-ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్‌ల సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర ప్ర‌భుత్వ రంగ పథకం. ఈ పథకం దేశంలోని థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్‌ల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మొదలైన ఇతర భారత ప్రభుత్వ పథకాలతో కలిసి ఈ పథకం రూపొందించబడింది. ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి ప్ర‌ధాన‌ చోదక శక్తిగా పర్యాటక రంగాన్ని ఒక ప్రధాన ఇంజిన్‌గా ఉంచే ఆలోచనతో పాటు, పర్యాటక రంగం  తన సామర్థ్యాన్ని గ్రహించేందుకు వీలుగా వివిధ రంగాలతో అనుసంధాన‌త‌తో దీనిని అందుబాటులోకి తేవ‌డ‌మైంది.
                                                                                                                                             

***



(Release ID: 1778206) Visitor Counter : 134