రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్షణ మంత్రిత్వ శాఖ ,ఎస్ ఐ డిఎమ్ నిర్వహించిన ఎం ఎస్ ఎం ఇ సదస్సుకు హాజరైన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్


పరిశోధన -అభివృద్ధి పై మరింత పెట్టుబడి పెట్టాలని , దేశ భద్రత -పురోగతి కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని

ఎంఎస్ ఎంఈలకు పిలుపు

Posted On: 04 DEC 2021 1:33PM by PIB Hyderabad

రక్షణ మంత్రి ప్రసంగం లోని ముఖ్యాంశాలు:

దేశీయ,ప్రపంచ రక్షణ అవసరాలను తీర్చే ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వ్యవస్థను మనం భారతదేశంలో సృష్టించవచ్చు

ఎం ఎస్ ఎం ఇ లు కాంపోనెంట్ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పెద్ద సంస్థలకు మద్దతు ఇస్తాయి. అదే సమయంలో ఉపాధిని సృష్టిస్తాయి.

యువతను సాధికారపరచడంలో, వారి కలలను నెరవేర్చడంలో అవి పెద్ద పాత్ర పోషిస్తాయి. భారత దేశం త్వరలోనే భారత సాయుధ బలగాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దేశం గా ఆవిర్భవిస్తుంది.

పరిశోధన -అభివృద్ధి ,కొత్త ఉత్పత్తులు ,టెక్నాలజీలను తయారు చేయడంలో మరింత పెట్టుబడి పెట్టాలని ,తద్వారా దేశ భద్రత ,పురోగతికి దోహదపడాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ ఎంఈ) లకు పిలుపునిచ్చారు. రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ ఉత్పత్తుల విభాగం సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫెక్చరర్స్ (ఎస్ ఐ డి ఎం) భాగస్వామ్యం తో శనివారం (4-12-2021) ఢిల్లీ లో హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించిన ఎం ఎస్ ఎం ఇ సదస్సు లో రాజ్ నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. లోహపు ఉపకరణాలను త యారు చేయడంలో మొత్తం ప్రపంచం గుర్తింపు పొందిన జర్మనీకి లోని 'మిట్టల్స్  స్టాండ్' (మిట్టల్-స్టంట్ ) తరహాలో భారత దేశంలో పారిశ్రామిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఎంఎస్ ఎంఈ, ఎస్ ఐ డిఎంలను కోరారు.

నిరంతరం మారుతున్న భద్రతా వాతావరణం దృష్ట్యా రక్షణ రంగం లో  స్వావలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఈ రంగంలో ఎంఎస్ ఎంఈ ల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత తయారీదారులు, వారి అనుబంధ ఎంఎస్ ఎంఈలు దేశ ర క్ష ణ అవసరాలను తీర్చడంలో ప్ర ధాన పాత్ర పోషిస్తాయని, ప్రపంచ అవసరాలను కూడా తీరుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ‘ఆత్మ నిర్భర్ భారత్’ దార్శనికతను సాకారం చేసే దిశగా ఎంఎస్ ఎంఈలు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రపై రక్షణ  మంత్రి మాట్లాడుతూ, ట్యాంకులు, జలాంతర్గాములు, విమానాలు ,హెలికాప్టర్ల తయారీ ద్వారా జాతీయ భద్రత ,ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పరిశ్రమలు పెద్ద పాత్ర పోషిస్తాయని,  అయితే, ఈ పెద్ద , భారీ పరిశ్రమలకు వెనుక నుంచి దన్నుగా నిలిచేవి చిన్న పరిశ్రమలని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుత అవుట్ సోర్సింగ్ యుగంలో, తెర వెనుకన ఉన్న ఎంఎస్ ఎంఈలు అందించిన వేలాది విడి భాగాల తోనే భారీ ప్లాట్ ఫారమ్ లు సమీకరించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్ఎస్ ఎంఈలు ఉప వ్యవస్థలు ,కాంపోనెంట్ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పెద్ద సంస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ప్రజలకు ప్రత్యక్ష ,పరోక్ష ఉపాధిని కూడా కల్పిస్తున్నాయని శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పెద్ద పరిశ్రమలు, ఎంఎస్ ఎంఈలు ఒకదానికొకటి అనుబంధంగా ఉన్నాయని, కలిసి దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థను బలపరచగలవని చెబుతూ, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం పూర్తి మద్దతును ఇస్తుందని ఆయన తెలిపారు.

పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉన్న ఎం ఎస్ ఎం ఈ లు ఆర్థిక కార్యకలాపాలకే కాకుండా సామాజిక అభివృద్ధికి కూడా సమాన బాధ్యత వహిస్తున్నాయి. "నేడు, మన దేశంలో గణనీయమైన సంఖ్యలో ఎంఎస్ ఎంఈలు ఉన్నాయి, ఇవి వారి జాతీయ అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా మన జిడిపికి 29 శాతం అందిస్తున్నాయి. వ్యవసాయ రంగం తరువాత, ఇది సుమారు 100 మిలియన్ల ప్రజలకు ఉపాధి ని అందించడానికి అతిపెద్ద వనరుగా ఉంది. పెద్ద సంస్థల్లో ఆవిష్కర్తలు,మధ్యవర్తులను భాగస్వాములను చేయడానికి కూడా ఎంఎస్ ఎంఈలు పనిచేస్తాయి. విలువ గొలుసు ,సరఫరా గొలుసులో ఒక ముఖ్యమైన భాగంగా మారడం ద్వారా పెద్ద పారిశ్రామిక సంస్థల లక్ష్యాలను నెరవేర్చడానికి అవి సహాయపడతాయి" అని ఆయన అన్నారు.

పెద్ద సంస్థలతో పోలిస్తే, ఎంఎస్ ఎంఈల ద్వారా సంపద కేంద్రీకరణ తక్కువగా ఉందని, దాని పంపిణీ విభజింపబడి ఆర్థిక అసమానతను తగ్గించడానికి సహాయపడుతుందని  రక్షణ  మంత్రి అభిప్రాయపడ్డారు. దేశ యువతకు ఆర్థికంగా సాధికారత కల్పించడంలోనూ,  వారి కలలను నెరవేర్చడంలోనూ  ఎంఎస్ ఎంఈలు ఖచ్చితంగా పెద్ద పాత్ర పోషించగలవని ఆయన అన్నారు.

“మేము బ్యాంకింగ్,క్యాపిటల్ మార్కెట్ కు సంబంధించిన విధానాలను తీసుకువచ్చాము, తద్వారా మా ఎంఎస్ ఎంఈలు గరిష్ట మూలధనాన్ని సులభంగా చౌక రేట్లకు పొందవచ్చు. ఎమ్ఎస్ ఎమ్ ఇ ల స్థిర వ్యయాన్ని తగ్గించడానికి విలువ గొలుసు ఏకీకరణ ,ఉమ్మడి సౌకర్యాలు, పారిశ్రామిక పార్కులు ,రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు విధానంతో మేము ముందుకు వచ్చాము" అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఎంఎస్ ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడానికి ప్రభుత్వ నిబద్ధతను వ్యక్తం చేశారు. ప్ర భుత్వ , ప్ర యివేట్ రంగాల సామ ర్థ్యాలను, ప్ర త్యేకంగా ఎంఎస్ ఎమ్ ఈల సామ ర్థ్యాలను వినియోగించు

కోవడం ద్వారా దేశంలో 'మేక్ ఇన్ ఇండియా' కింద దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి చేసిన రక్షణ , ఏరోస్పేస్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కొన్ని ప్రభుత్వ చొరవలను ఆయన వివరించారు. "మనం  రూ.85,000 కోట్ల అంచనా తో కూడిన ఏరోస్పేస్,రక్షణ పరిశ్రమ కలిగిఉన్నాము. ఇందులో ప్రైవేటు రంగం వాటా రూ.18,000 కోట్లకు పెరిగింది. భారత దేశాన్ని ప్రపంచ రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలన్నదే  మా దార్శనికత " అని ఆయ న అన్నారు.

ఎమ్ ఎస్ ఎమ్ ఈలను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యల్లో, అంచనా వ్యయం సంవత్సరానికి రూ.100 కోట్లు మించని లేదా మొత్తం విలువ రూ.150 కోట్ల కంటే తక్కువగా ఉన్న, (ఏది ఎక్కువ అయితే) ఎమ్ ఎస్ ఎమ్ ఈలకు ప్రొక్యూర్ మెంట్ కేసుల్లో ఎలాంటి ఆర్థిక షరతు లేకుండా అభ్యర్థన ఫర్ ప్రపోజల్ (ఆర్ ఎఫ్ పి) జారీ చేయడం; మేక్ కేటగిరీల కింద ప్రాజెక్టులను కేటాయించడం, భారతీయ ఆఫ్ సెట్ భాగస్వామి ఎంఎస్ ఎంఈగా ఉన్న చోట అవసర అంగీకారం (ఎవోఎన్) డిమాండ్,సవరించిన ఆఫ్ సెట్ పాలసీ 2020 సమయంలో డెలివరీ షెడ్యూల్ ఆధారంగా సంవత్సరానికి రూ.100 కోట్లకు మించని ప్రొక్యూర్ మెంట్.

ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడిఎక్స్), టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ (టిడిఎఫ్) పథకం కింద ప్రాజెక్టులు ప్రధానంగా స్టార్టప్ లు ,ఎంఎస్ ఎంఈల కోసం రిజర్వ్ చేయబడ్డాయని శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.”ఈ పథకాలు రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి, వినియోగదారు సేవల ద్వారా నిర్వహించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి, తద్వారా ఎంఎస్ ఎంఈలు, స్టార్టప్ లు, వ్యక్తిగత ఆవిష్కర్తలకు అవసరమైన ప్రేరణను అందిస్తాయి. సేవలు తయారు చేసిన సమస్యా ప్రకటనలకు సృజనాత్మక పరిష్కారాలను అందించడానికి వారికి ఆర్థిక గ్రాంట్లతో నిధులు సమకూర్చబడుతున్నాయి ఇంకా కృత్రిమ మేధస్సు, డేటా ఎనలిటిక్స్ ,రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించవచ్చు" అని ఆయన అన్నారు.

2021-22 నుండి 2025-26 వరకు రాబోయే ఐదేళ్లకు సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతుతో ఐడిఎక్స్ కోసం కేంద్ర రంగ పథకానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని  రక్షణ  మంత్రి ఈ సందర్భం గా చెప్పారు. ఈ పథకం డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డిఒఐ) ద్వారా సుమారు 300 స్టార్ట్-అప్ లు/ఎమ్ ఎస్ ఎమ్ ఈలు/వ్యక్తిగత ఆవిష్కర్తలు ,సుమారు 20 భాగస్వామి ఇంక్యుబేటర్ లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కొత్త రక్షణ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, దేశంలో పెరుగుతున్న స్టార్ట్-అప్ ల వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి 2021-22 లో ఐడిఇఎక్స్ స్టార్ట్-అప్ ల నుండి సేకరణ కోసం మంత్రిత్వ శాఖ రూ.1,000కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. టిడిఎఫ్ కింద ప్రస్తుతం 30 కి పైగా ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, రు. 150 కోట్లకు పైగా పెట్టుబడి ఉపయోగించబడిందని ఆయన ప్రశంసించారు.

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్ట ర్ ఎపిజె అబ్దుల్ కలాం కు నివాళిగా ఉన్న

రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ)   నిర్వహిస్తున్న  'డేర్  టు డ్రీమ్'  నూత న ఆవిష్కరణ ల పోటీ గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించారు. ఈ పోటీ టిడిఎఫ్ పథకం కింద స్టార్టప్ లను చేర్చుకుని  వాటికి అత్యాధునిక టెక్నాలజీలు ,సైనిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఆర్థిక , హాండ్ -హోల్డింగ్ మద్దతును అందిస్తుంది.భారత పరిశ్రమ

త్వరలోనే భారత సాయుధ దళాలకు మాత్రమే కాకుండా ప్రపంచ విపణికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రదాతగా అవతరిస్తుందని ఆయ న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎగుమతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని పునరుద్ఘాటిస్తూ, భారతదేశం త్వరలో నికర దిగుమతిదారు నుండి నికర ఎగుమతిదారుగా మారుతుందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. "2024-25 నాటికి రూ.35,000 కోట్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. ప్ర స్తుతం భారత దేశం సుమారు 70 దేశాల కు రక్షణ సామగ్రిని ఎగుమతి చేస్తోంది.స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2020 నివేదిక ప్రకారం, రక్షణ ఎగుమతుల్లో టాప్ 25 దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది' అని ఆయన తెలిపారు.

శ్రీజన్ పోర్టల్, 209 అంశాల సానుకూల ఇండిజెనైజేషన్ జాబితాల నోటిఫికేషన్ ,'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' వంటి ఇతర చర్యలను ప్రస్తావిస్తూ,  'మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ ది వరల్డ్' అనే ప్రభుత్వ సంకల్పాన్ని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు.ఈ చర్యలన్నీ స్వదేశీ రక్షణ పరిశ్రమకు ఇచ్చే ఒప్పందాల సంఖ్య పెరగడానికి దారితీసినట్లు ఆయన పేర్కొన్నారు. "ఇండియన్/ఐడిఎమ్ ఎమ్ (దేశీయంగా డిజైన్ చేయబడ్డ, అభివృద్ధి చేయబడ్డ మరియు తయారు చేయబడ్డ) కేటగిరీల ప్రొక్యూర్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వడం నుంచి ఆర్ డికి మద్దతు ఇవ్వడం వరకు, పరిశ్రమ, అకాడెమియా ,టెక్నాలజీ ప్రొవైడర్ లు, ఎక్విప్ మెంట్ తయారీదారులు, క్వాలిటీ కంట్రోలర్ లు ,యూజర్ లతో చురుకైన సహకారం ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి మేం కృషి చేస్తున్నాం." అని ఆయన చెప్పారు. ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న "ఆత్మ నిర్భర్ భారత్" లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సాయుధ బలగాలు నిరంతరం మద్దతును అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల గ త ఏడేళ్ల లో దేశ రక్షణ ఎగుమతులు రూ.38,000 కోట్ల మార్కును దాటాయని శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు; 12,000 ఎంఎస్ ఎంఈలు రక్షణ రంగంలో చేరాయని,  ఆర్ అండ్ డి, స్టార్టప్ లు, ఆవిష్కరణలు ,ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు.  ఈ విధానాల కారణంగా సిఐడిఎంలో ఇప్పుడు 500మందికి పైగా సభ్యులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

రక్షణ తయారీలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వంతో కలిసి చురుకుగా పనిచేస్తున్నందుకు రక్షా మంత్రి సిఐడిఎంను ప్రశంసించారు, ప్రభుత్వ చొరవల గురించి పరిశ్రమలకు తెలియజేయడం, వారి అభిప్రాయాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయడం ,కొత్త విధానాలలో విలువైన సూచనలను అందించడం ద్వారా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని అన్నారు. ఎస్ ఐ డిఎం వృద్ధి ,నిరంతర వ్యాప్తి భారత రక్షణ పరిశ్రమ అభివృద్ధిని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఈ సదస్సు వారికి కొత్త వృద్ధి అవకాశాలను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  .

ఎస్ ఐడిఎం అధ్యక్షుడు శ్రీ జయంత్ పాటిల్ తన ప్రారంభ ప్రసంగం లో, ఎంఎస్ ఎంఈ లకు మద్దతు ఇవ్వడం ,వారి ఎదుగుదలకు దోహద పడటం లో సిఐడిఎం నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఎంఎస్ ఎంఈల కు కొత్త అవకాశాలను గుర్తించడానికి, ఈ రంగంతో

మరింత సమన్వయం కల్పించడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో  సానుకూలంగా కలసి పనిచేయడాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఈ సదస్సు కీలక లక్ష్యాలు; రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం గురించి సంబంధిత సమాచారాన్ని అందించడం ద్వారా భారతదేశం అంతటా టైర్ 2 ,టైర్ 3 నగరాల్లో ఉన్న రక్షణేతర రంగ ఎమ్ ఎస్ ఎమ్ ఈల సామర్థ్యాన్ని వెలికితీయడం ; దేశీయ అవసరాల కోసం, మిత్ర దేశాలకు ఎగుమతి చేయడం కోసం దేశంలో రక్షణ ఉత్పత్తుల  అభివృద్ధికి కొత్త ప్రేరణనుఇవ్వడం: రక్షణ రంగంలో ప్రవేశించడానికి రక్షణేతర రంగాలలో క్రియాశీలకంగా ఉన్న భారతీయ ఎమ్.ఎస్.ఎం.ఈలకు సాంకేతిక సహకారం అందించడం; తక్కువ మూలధనం లేదా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌ల కోసం సమర్థవంతమైన పారిశ్రామికవేత్తలను సులభతరం చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వివిధ నిధుల యంత్రాంగాలను  వారికి పరిచయం చేయడం ,భారత రక్షణ రంగంలో భావి మార్కెట్ ,వ్యాపార అవకాశాల గురించి తెలియజేయడం.

ప్రస్తుతం భారతదేశంలో, అనేక వేల ఎమ్ ఎస్ ఎమ్ ఈలు విభిన్న రంగాల్లో పనిచేస్తున్నాయి. సాధారణంగా వివిధ ప్రభుత్వ సంస్థలు మరియు పెద్ద ప్రయివేట్ సెక్టార్ ఓఈఎమ్ లతో టైర్డ్ పార్టనర్లుగా అవి కనెక్ట్ అయి ఉన్నాయి.. ఎంఎస్ ఎంఈలను రక్షణ సరఫరా గొలుసులోకి తీసుకురావడం, తద్వారా రక్షణ రంగం  స్వావలంబనను పెంచడం, రక్షణ ఎగుమతుల మార్కెట్  కు  దోహదపడటం 'మేక్ ఇన్ ఇండియా' కీలక లక్ష్యాలలో ఒకటి .

రక్షణ మంత్రిత్వ శాఖ ,ఎస్ ఐడిఎం సీనియర్ అధికారులు,పరిశ్రమ ప్రతినిధులు సదస్సు లో పాల్గొన్నారు. 

 

*****



(Release ID: 1778068) Visitor Counter : 210