ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ పై తాజాస‌మాచారం


సార్స్ కో వి 2 వేరియంట్ - ఒమిక్రాన్ పై త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు

Posted On: 03 DEC 2021 1:49PM by PIB Hyderabad

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 2021 న‌వంబ‌ర్ 26న ఒమిక్రాన్ (బి.1.1.529) గా నామ‌క‌ర‌ణం చేసిన కోవిడ్ 19 కొత్త వేరియంట్ కు సంబంధించి త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు (ఎఫ్‌.ఎ.క్యు) స‌మాధానాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌
త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయ‌డం జ‌రిగింది.
https://www.mohfw.gov.in/pdf/FAQsonOmicron.pdf
ఒమిక్రాన్ వైర‌స్ అంటే ఏమిటి,  ఆందోళ‌న క‌లిగించే వేరియంట్‌గా దీనిని మార్చేది ఏమిటి?
ఇది ఒక కొత్త సార్స్ సిఒవి 2 వేరియంట్‌. 2021 న‌వంబ‌ర్ 24న ద‌క్షిణాఫ్రికాలో ఇది వెలుగుచూసింది.  దీనిని బి.1.1.529 లేదా ఒమిక్రాన్ ( ఆల్ఫా, బీటా, డెల్టా మొదలైన గ్రీకు వర్ణమాల ఆధారంగా) అని పిలుస్తున్నారు. ఈ వేరియంట్‌లో చాలా పెద్ద సంఖ్య‌లో ఉత్ప‌రివ‌ర్త‌నాలు క‌నిపించాయి. ప్ర‌త్యేకించి వైర‌ల్ స్పైక్ ప్రొటీన్‌పై 30 కంటే ఎక్కువ ఉత్ప‌రివ‌ర్త‌నాలు క‌నిపించాయి. ఇది రోగ‌నిరోధ‌క స్పంద‌న‌ను ప్ర‌త్యేకించి ల‌క్ష్యంగా చేసుకుంటుంది. ఒమిక్రాన్‌లోని ఉత్పరివర్తనాల ను గ‌మ‌నించిన‌పుడు, ఇది అంతకుముందు వ్యక్తిగతంగా పెరిగిన ఇన్‌ఫెక్టివిటీ /లేదా రోగనిరోధక నుంచి త‌ప్పించుకోవ‌డంతో  సంబంధం కలిగి ఉంది . దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్  కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరగడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓమిక్రాన్‌ను ఆందోళన క‌ర‌ వేరియంట్ (VoC)గా ప్రకటించింది. .

ప్ర‌స్తుతం వాడుక‌లో ఉన్న డ‌యాగ్న‌స్టిక్ ప‌ద్ధ‌తులు , ఒమ్రికాన్‌ను గుర్తించ‌గ‌ల‌వా?
సార్స్ కో వి -2 వ వేరియంట్‌కు సంబంధించి అత్యంత ఆమోదించబడిన, సాధారణంగా ఉపయోగించే డయాగ్నస్టిక్ పద్ధతి ఆర్ టిపిసిఆర్‌ పద్ధతి. ఈ పద్ధతి వైరస్ ఉనికిని నిర్ధారిస్తుంది. వైరస్‌లోని నిర్దిష్ట జన్యువులను గుర్తిస్తుంది, స్పైక్ (S), ఎన్వలప్డ్ (E)  న్యూక్లియోకాప్సిడ్ (N) మొదలైనవాటిని వైర‌స్ ఉనికి కోసం గుర్తిస్తుంది.

అయితే, ఒమ్రికాన్ లోని ఎస్ జీన్ ఎక్కువ‌గా మ్యుటేట్ అవుతుంది. కొన్ని ప్రైమ‌ర్లు ఎస్ జీన్ లేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చు. ( దీనిని ఎస్ జీన్ డ్రాప‌వుట్ అంటారు) ఈ ప్ర‌త్యేక ఎస్ జీన్ డ్రాప‌వుట్‌, దీనితోపాటు ఇత‌ర వైర‌ల్ జీన్స్ గుర్తింపును ఒమ్రికాన్ నిర్ధార‌ణ‌లో ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ తుది నిర్థార‌ణ‌కు జెనోమిక్ సీక్వెన్సింగ్ అవ‌స‌రం.

కొత్త  విఒసి విష‌యంలో మ‌నం ఎంత శ్ర‌ద్ధ వ‌హించాలి?
సాంక్ర‌మిక రోగ విజ్ఞానానికి సంబంధించి దాని వ్యాప్తి, లేదా కోవిడ్ 19 మ‌హ‌మ్మార‌లో హానిక‌ర‌మైనమార్పు గ‌మ‌నించిన‌పుడు  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఒక వేరియంట్‌ను విఒసిగా ప్ర‌క‌టిస్తుంది. లేదా ప్ర‌జారోగ్యం, సామాజిక చ‌ర్య‌లు లేదా అందుబాటులో ఉన్న రోగ‌నిర్ధార‌ణ‌లు, టీకాలు, చికిత్సా విధానాల ప్ర‌భావం దానిపై ప్ర‌భావ వంతంగా ప‌నిచేయ‌న‌పుడు దానిని విఒసి గా ప్ర‌క‌టిస్తారు.( మూలం ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ‌)
 ఉత్ప‌రివ‌ర్త‌నాల ఆధారంగా ఒమిక్రాన్‌ను విఒసిగా ప్ర‌క‌టించార‌న్న విష‌యం గ‌మ‌నించ‌ద‌గిన‌ది. దాని ఫీచ‌ర్లు, ఇత‌రుల‌కు వ్యాప్తి పెరగడం, రోగ‌నిరోధ‌క శ‌క్తినుంచి త‌ప్పించుకోవ‌డం, వంటివి . దీనికి గ‌ల కార‌ణాల విష‌యంలో క‌చ్చిత‌మైన సాక్ష్యాల కోసం ఎదురుచూస్తున్నారు.

మ‌నం ఎలాంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలి?
ఇంత‌కు ముందు లాగే ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలి. ముఖానికి మాస్కు ధ‌రించ‌డం, రెండు డోసుల వాక్సిన్ వేయించుకోవ‌డం, (ఇంకా వేయించుకోనివారు), సామాజిక దూరం పాటించ‌డం, వీలైనంత వ‌ర‌కు బాగా గాలీ వెలుతురు ఉండేట్టు చూసుకోవ‌డం అవ‌స‌రం.

మూడోవేవ్ వ‌స్తుందా?
ద‌క్షిణాఫ్రికా వెలుప‌ల ఉన్న దేశాల నుంచి ఒమిక్రాన్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుత‌న్న‌ట్టు స‌మాచారం.
దాని ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నించిన‌పుడు, ఇది ఇండియాతో స‌మా మ‌రిన్ని దేశాల‌కు ఇది వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. అయితే  కేసుల పెరుగుద‌ల‌, మ‌రీ ముఖ్యంగా వ్యాధి వ‌ల్ల ప్ర‌భావం ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. ఇండియాలో పెద్ద ఎత్తున వాక్సినేష‌న్ జ‌రుగుతున్నందున  వ్యాధి తీవ్ర‌త అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి శాస్త్రీయ స‌మాచారం అందుబాటులోకి రావ‌ల‌సి ఉంది.
ప్ర‌స్తుత వాక్సిన్ ఒమిక్రాన్‌కు ప‌నిచేస్తుందా?

ఒమిక్రాన్‌కు ప్ర‌స్తుత వాక్సిఇన్ ప‌నిచేయ‌ద‌ని సూచించే ఆధారాలు ఏవీ లేవు.
స్పైక్ జన్యువుపై జ‌రిగిన కొన్ని ఉత్పరివర్తనలు ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.
టీకా రక్షణ అనేది యాంటీబాడీస్, సెల్యులార్ ఇమ్యూనిటీ పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది, ఇది చాలావ‌ర‌కు ర‌క్ష‌ణ నిస్తుందని భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ,తీవ్ర వ్యాధినుంచి వాక్సిన్ ర‌క్షిస్తుంది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వాక్సిన్ వేయించుకోవ‌డం ఉత్త‌మం.  అర్హులై ఉండి ఇప్ప‌టికీ వాక్సిన్ వేయించుకోని వారు ఎవ‌రైనా ఉంటే వాక్సిన్ వేయించుకోవ‌డం అవ‌స‌రం.
 ఇండియా స్పంద‌న ఎలా ఉంది?

భార‌త ప్ర‌భుత్వం ప్ర‌స్తుత ప‌రిస్థితిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ప‌రిస్థితికి అనుగుణంగా ఎప్ప‌టికప్పుడు మార్గ‌దర్శ‌కాలు జారీచేస్తోంది. మ‌రోవైపు శాస్త్ర‌వేత్త‌లు, వైద్యులు ప్ర‌స్తుత ప‌రిణామాల‌కు అనుగుణంగా  ప‌రిస్థితిని ఎదుర్కోనేందుకు ప‌రీక్ష‌లు, చికిత్స‌కు సన్న‌ద్ధంగా ఉన్నారు. అలాగే జినోమ్ నిఘా, వైర‌ల్‌,  అంటు వ్యాధికి సంబంధించిన ల‌క్ష‌ణాలు గుర‌త్ఇంచ‌డం, చికిత్సా ప‌ద్ధ‌తుల‌ను అభివృద్ధిచేయ‌డంపై దృష్టిపెడుతున్నారు.


ఉత్ప‌రివ‌ర్త‌నాలు ఎందుకు సంభ‌విస్తాయి?

ఉత్ప‌రివ‌ర్త‌నాలు పరిణామ‌క్ర‌మంలో భాగం. వైర‌స్ వ్యాప్తి చెంద‌డానికి అనుకూల ప‌రిస్థితులు ఉన్నంత‌కాలం, అవి వ్యాప్తి చెందుతూ , వాటి సంఖ్య‌ను పెంచుకుంటూ ఉంటాయి.అవి కొత్త‌గా రూపుదిద్దుకుంటుంటాయి. అయితే అన్ని వేరియంట్ లూ ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి కావు. చాలా సంద‌ర్భాల‌లో మ‌నం వాటిని గ‌మ‌నించం. తీవ్ర వ్యాధికి గురిచేసే వాటిని మాత్ర‌మే మ‌నం గుర్తిస్తాం. ఇవి ప్ర‌జ‌ల‌కు తిరిగి వ్యాప్తి చెంది త‌మ ఆధిప‌త్యాన్ని చాటుకుంటాయి. వేరియంట్లు ఉత్ప‌త్తి కావ‌డాన్ని త‌ప్పించాలంటే కీల‌క‌మైన‌ది, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డం. 

***


(Release ID: 1777993) Visitor Counter : 250