ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ

Posted On: 03 DEC 2021 3:30PM by PIB Hyderabad

ప్రజారోగ్యం, ఆస్పత్రులు అనేవి రాష్ట్రానికి సంబంధించిన అంశం.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, కోవిడ్-19కి సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, గ్రేడేషన్ మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడం వంటి ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపైనే ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల నుంచి ఈ మేరకు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్‌ల (PIPలు) రూపంలో  ప్రతిపాదనలు స్వీకరించబడ్డాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు భారత ప్రభుత్వం ప్రతిపాదనలకు రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ (RoPs) రూపంలో ఆమోదాన్ని అందిస్తుంది.

జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా   రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తమ కార్యక్రమాల అమలు ప్రణాళికలలో సేవలతో సహా ఐపీహెచ్ఎస్లోని ఖాళీలను పూరించడానికి, ప్రతిపాదించడానికి వెసులుబాటు ఇవ్వబడింది. ఇది నేషనల్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేషన్ కమిటీతో అంచనా వేయబడుతుంది.  దాని సిఫార్సుల ప్రకారం..  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఆమోదం తెలుపుతుంది.
ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నిర్ణీత విధివిధానాలను రూపొందించడానికి భారతీయ ప్రజా ఆరోగ్య ప్రమాణాల(ఐపీహెచ్ఎస్)ద్వారా భారత ప్రభుత్వం ప్రజా సౌకర్యాల కోసం జనాభా ప్రమాణాన్ని నిర్ణయించింది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క్రమసంఖ్య ప్రజారోగ్య సౌకర్యాలు మైదాన ప్రాంతం కొండ/గిరిజన/కష్టమైన ప్రాంతం

1 ఎస్సీ 5000 3000
2 పీహెచ్సీ 30000 20000
3 నాన్ ఎఫ్ఆర్యూ, సీహెచ్సీ 1,20000 80000
4 ఎఫ్ఆర్యూ, సీహెచ్సీ 500000 ఎన్ఏ

గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం 2019–-20 ప్రకారం... 18,610 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, సబ్ సెంటర్లతోపాటు 1,55,404 గ్రామీణ ఉప కేంద్రాలు, 24,918 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16,635 ఆయుష్మాన్ భారత్ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలు, పీహెచ్సీలు, 5,183 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలున్నాయి.

ప్రజలకు సార్వత్రిక, ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నివారణ, ఉపశమన, పునరావాసంతో కూడిన సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి 12 రకాల ప్యాకేజీలను ప్రస్తుతం ఉన్న ఉప ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ భారత్ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలుగా మార్చబడుతున్నాయి.  

అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 2025–26 వరకు ప్రజారోగ్యం, ఇతర ఆరోగ్య సంస్కరణలపై రూ.64,180 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.


– వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు గ్రామాలు మరియు నగరాల్లో ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాలను బలోపేతం చేయడం.
– జిల్లా స్థాయి ఆసుపత్రులలో కొత్త క్రిటికల్ కేర్ -సంబంధిత పడకలను అందుబాటులోకి తీసుకురావడం.
–11 హై ఫోకస్ స్టేట్‌లలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌లకు (బీపీహెచ్యూ) సహకారం అందించడం.
– అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం.


– జాతీయ ఆరోగ్య మిషన్ అమలులోభాగంగా ఆరోగ్య సౌకర్యాలకు ఉచిత రవాణా కోసం భారత ప్రభుత్వం  నేషనల్ అంబులెన్స్ సేవలను అమలులోకి తీసుకొచ్చింది . ఈ సేవలు మారుమూల మరియు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించబడింది. ఈ అంబులెన్స్లను అందరికీ(తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లోని ప్రజలకు) సులభంగా అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చారు.

ప్రజారోగ్య సౌకర్యాలలో నిపుణులను నిమగ్నం చేయడానికి అనువైన నిబంధనలను అనుసరించమని రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారు. నిపుణుల సేవలను ‘ కాంటాక్టింగ్ ఇన్’ మరియు ‘కాంట్రాక్టింగ్ అవుట్’ పద్ధతిలో  ఉపయోగించుకోవడంతోపాటు అవసరమైన సేవలను పొందడానికి ప్రైవేటు వైద్య సౌకర్యాలను ఎంప్యానెల్ చేయడం, నిపుణులను బయటి నుంచి ఎంగేజ్ చేసుకోవడం కోసం అభ్యర్థనలు చేర్చడం వంటివి నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ట్ర ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ లో ఉన్నాయి.

 గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందిస్తున్న సిబ్బందికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ క్రింది ప్రోత్సాహకాలు, గౌరవ వేతనాలు అందిస్తోంది.

– గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో మరియు వారి నివాస గృహాలలో సేవలందించే నిపుణులైన వైద్యులకు హార్డ్ ఏరియా అలవెన్స్ అందజేస్తున్నారు. తద్వారా వారు అటువంటి ప్రాంతాలలో ప్రజారోగ్య సౌకర్యాలలో సేవ చేయడం ఆకర్షణీయంగా ఉంటుంది.
– గైనకాలజిస్ట్‌లు/ ఎమర్జెన్సీ అబ్‌స్టెట్రిక్ కేర్  శిక్షణ పొందిన, పీడియాట్రిషియన్‌లు మరియు అనస్థీటిస్ట్/ లైఫ్ సేవింగ్ అనస్థీషియా స్కిల్స్ శిక్షణ పొందిన వైద్యులకు గౌరవ వేతనం కూడా గ్రామీణ & మారుమూల ప్రాంతాల్లో సిజేరియన్‌లు నిర్వహించేందుకు నిపుణులను అందుబాటులో ఉంచేందుకు ఉపకరిస్తుంది.
– వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సకాలంలో ఏఎన్సీ చెకప్ మరియు రికార్డింగ్‌ని నిర్ధారించడానికి ఏఎన్ఎం కోసం ప్రోత్సాహకాలు, కౌమార పునరుత్పత్తి మరియు లైంగిక ఆరోగ్య కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రోత్సాహకాలు అందిస్తారు.
– ‘యూ కోట్ వి పే’  వంటి వ్యూహాలలో ఫ్లెక్సిబిలిటీ787ఎఉతో సహా స్పెషలిస్ట్‌లను ఆకర్షించడానికి సరిపడా జీతం అందించడానికి రాష్ట్రాలను అనుమతించారు.
– ఆయుష్మాన్ భారత్ హెల్త్  అండ్ వెల్‌నెస్ సెంటర్స్ యొక్క మరొక ముఖ్యమైన భాగం, ఇ– సంజీవని ద్వారా టెలిమెడిసిన్ సేవలను అందిస్తోంది. అంతేకాకుండా కమ్యూనిటీలకు.. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణుల సేవలను మెరుగుపర్చే లక్ష్యంతో టెలికన్సల్టేషన్సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
– గ్రామీణ ప్రాంతాల్లో  కోవిడ్-19కి సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ.. టీవీ, రేడియో, ఇతర మాస్ మీడియాలతోపాటు ఐవీఆర్ఎస్ ఆధారిత ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంది.
 MoHFW సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, IVRS ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు, TV, రేడియో మరియు ఇతర మాస్ మీడియాలను ఉపయోగించుకుంది.
 కొవిడ్-19 నియంత్రణ మరియు పెరి-అర్బన్, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో నిర్వహణ కోసం వివిధ మార్గదర్శక పత్రాలు మరియు ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్‌ల కోసం ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ వివిధ మార్గదర్శక పత్రాలను విడుదల చేసింది. అటువంటి మార్గదర్శక పత్రాలు మరియు ఎస్ఓపీలు సకాలంలో సవరించబడతాయి మరియు ప్రచారం చేయబడుతున్నాయి. కోవిడ్19 వ్యాప్తి నియంత్రణ, ఇన్ఫెక్షన్ నివారణ కోసం రిస్క్ కమ్యూనికేషన్ మెటీరియల్స్ అభివృద్ధి చేయడబడ్డాయి. గ్రామాలతోపాటు  వ్యూహాత్మక ప్రదేశాలలో మరియు కోవిడ్-19 కేర్ సెంటర్‌లలో ప్రదర్శించడానికి అందుబాటులో ఉన్నాయి.

కోవిడ్19 సంబంధిత కార్యకలాపాలలో వీహెచ్ఎస్ఎన్సీ మరియు ఎంఏఎస్ పాత్రకు సంబంధించి ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ ద్వారా మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.  ఈ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్‌లు (వీహెచ్ఎస్ఎన్సీ మరియు ఎంఏఎస్) కోవిడ్-19పై కమ్యూనిటీ-స్థాయి అవగాహనను రూపొందించడంలో పాలుపంచుకున్నాయి.

సర్వీస్ డెలివరీ, మానవ వనరులు, ఔషధాల సరఫరా మరియు డయాగ్నోస్టిక్స్ సరఫరా, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, సహా ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత యొక్క అనేక ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తూ కోవిడ్-19 వ్యాప్తి సమయంలో అవసరమైన ఆరోగ్య సేవలను అందించడం కోసం సమగ్ర మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో  పంచుకున్నారు.

అదేవిధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్, నేషనల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ (ఎన్సీవీపీ) యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) కింద రూపొందించబడిన మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్ ఏర్పాట్లను ఉపయోగించుకుంటుంది. మొత్తం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ నేషనల్ హెల్త్ మిషన్ రూపొందించిన ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి ఉంటుంది.

అలాగే, సమర్థవంతమైన కోవిడ్-19 నిర్వహణ కోసం స్పెక్ట్రమ్ అంతటా ఆరోగ్య సంరక్షణ ప్రదాతల శిక్షణ ఎన్హెచ్ఎం శిక్షణా ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించుకుంటుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

***



(Release ID: 1777825) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Tamil