ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్య అవ‌రాల ఆక్సిజన్ ఉత్పత్తి

Posted On: 03 DEC 2021 3:32PM by PIB Hyderabad

'పెట్రోలియం మరియు ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌'  ‌(పీఈఎస్ఓ) రికార్డుల ప్రకారం, తయారీదారులు సమర్పించిన రోజువారీ నివేదిక ఆధారంగా ధ్ర‌వీకృత‌ ఆక్సిజన్ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 8778 ఎంటీలుగా ఉంది. వైద్యప‌ర‌మైన‌ అవ‌స‌రాల‌కు సంబంధించి ఆక్సిజన్ సామర్థ్యం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

సంవత్సరం

ద్రవీకృత‌ ఆక్సిజన్ తయారీ కర్మాగారాల యొక్క రోజువారీ  మొత్తం సామర్థ్యం

2019

పీఈఎస్ఓ వ‌ద్ద స‌మాచారం అందుబాటులో లేదు

01.10.2020 నాటికి

6876 ఎంటీ/రోజుకు

28/11/2021 నాటికి

8778 ఎంటీ/ రోజుకు

 

దేశంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతను పెంచడానికి పైన పేర్కొన్నవి కాకుండా భారత ప్రభుత్వం 1563 ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ) ప్లాంట్ల‌ను స్థాపించింది. వీటిలో 1225 పీఎస్ఏ ప్లాంట్లు కూడా ఉన్నాయి, ఇవి దేశంలోని ప్రతి జిల్లాలో పీఎం కేర్స్ ఫండ్ కింద ఏర్పాటు చేసి ప్రారంభించబడ్డాయి. వీటికి అదనంగా, 281 పీఎస్ఏ ప్లాంట్లు పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశాయి. 57 పీఎస్ఏ  ప్లాంట్లు విదేశాల నుంచి పొంద‌బ‌డిన  గ్రాంట్‌ల క్రింద ఏర్పాటు చేయ‌డ‌మైంది. అత్యవసర నిర్వహణ ప్రణాళిక మరియు వ్యూహంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాధికారత‌ బృందం ఆక్సిజన్ డిమాండ్‌ను లెక్కించేందుకు, నాన్-ఐసీయు మరియు ఐసీయు సెట్టింగ్‌లలో అవసరమైన ఆక్సిజన్ ప్రవాహ రేట్లు ఒక కేసుకు రోజుకు నిమిషానికి 10 మరియు 24 లీటర్లు అని సిఫార్సు చేసింది. రాష్ట్రాలు/ య‌ఉటీలు మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ద్రవీకృ ఆక్సిజన్ తయారీదారులు/సరఫరాదారులు మొదలైన అన్ని వాటాదారులతో సంప్రదించి వైద్య ఆక్సిజన్ కేటాయింపు కోసం డైనమిక్ మరియు పారదర్శక ఫ్రేమ్‌వర్క్ తయారు చే‌యడ‌‌మైంది. అలాగే, అన్ని వైద్య సౌకర్యాల నుండి మెడికల్ ఆక్సిజన్ కోసం డిమాండ్‌ను నిర్ధారించడానికి మరియు వాటి రవాణాను ట్రాక్ చేయడానికి ఆన్‌లైన్ డిజిటల్ సొల్యూషన్స్ అంటే ఆక్సిజన్ డిమాండ్ అగ్రిగేషన్ సిస్టమ్ (ఓడీఏఎస్‌) మరియు ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఓడీటీఎస్‌)  అభివృద్ధి చేయబడ్డాయి.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ లోక్‌సభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

****


(Release ID: 1777823)
Read this release in: English , Urdu , Tamil